Hanuman Jayanti 2024: ఆర్థిక ఇబ్బందులు, శని దోషం తొలగేందుకు హనుమాన్ జయంతి రోజున ఈ పనులు చేయండి!-hanuman jayanti 2024 do this task on this auspicious day to get rid of shani dosh and financial debt problems ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Hanuman Jayanti 2024: ఆర్థిక ఇబ్బందులు, శని దోషం తొలగేందుకు హనుమాన్ జయంతి రోజున ఈ పనులు చేయండి!

Hanuman Jayanti 2024: ఆర్థిక ఇబ్బందులు, శని దోషం తొలగేందుకు హనుమాన్ జయంతి రోజున ఈ పనులు చేయండి!

Published Apr 20, 2024 02:49 PM IST Chatakonda Krishna Prakash
Published Apr 20, 2024 02:49 PM IST

Hanuman Jayanti 2024: చైత్ర పౌర్ణిమి అయిన ఏప్రిల్ 23వ తేదీన హనుమాన్ జయంతికి పండుగ ఉంది. శని దోషం, ఆర్థిక రుణ ఇబ్బందుల నుంచి ఉపశమనం దక్కాలంటే అత్యంత ప్రాముఖ్యత ఉన్న హనుమాన్ జయంతి రోజున ఏ పనులు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

హిందూ మతంలో హనుమంతుడి ఆరాధన చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇక, హనుమాన్ జయంతి రోజున ఆయనను తప్పకుండా పూజించాలి. ఏడాదిలో హనుమాన్ జయంతిని రెండుసార్లు జరుపుకుంటారు. ఈ ఏడాది తొలి హనుమాన్ జయంతి చైత్ర మాసం పౌర్ణిమ అయిన ఏప్రిల్ 23వ తేదీన మంగళవారం వచ్చింది. 

(1 / 5)

హనుమాన్ జయంతి పండుగ మంగళవారం (ఏప్రిల్ 23) రావటంతో.. ఈసారి ఈ పండుగకు మరింత ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం హనుమాన్ జయంతి రోజున కొన్ని పనులు చేయడం వల్ల ప్రయోజనాలను పొందవచ్చు. 

(2 / 5)

శని దోష నివారణ కోసం: హనుమాన్ జయంతి రోజున హనుమంతుడిని ఆరాధించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. శనిదోషం ఉన్న వారు ఆ రోజున దీపంలో నల్ల నువ్వులను ఉంచి.. ఆవనూనెతో హనుమంతుడి ముందు ఆ దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల శని సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. 

(3 / 5)

ఆర్థిక రుణ ఇబ్బందులు తొలగేందుకు: హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామికి లడ్డూలు, తులసి మాలలు, శనగలు సమర్పించండి. అలాగే, మల్లె నూనెతో దీపం వెలిగించాలి. అలాగే, హనుమాన్ చాలీసాను కనీసం 7సార్లు పఠించాలి. ఇలా చేయడం వల్ల రుణ కష్టాలు తొలగిపోతాయనే విశ్వాసం ఉంది. 

(4 / 5)

హనుమాన్ జయంతి రోజున అందరూ హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం చేయాలి. తమలపాకులపై జైశ్రీరామ్ అని రాసి దండగా హనుమంతుడికి సమర్పిస్తే మంచి జరుగుతుంది. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు