Sasha Maha purusha raja yogam: శశ మహాపురుష రాజయోగం.. ఈ రాశుల జాతకులకు కుబేరుడు కనక వర్షం కురిపించబోతున్నాడు
Shasa mahapurusha raja yogam: ప్రస్తుతం శని సంచరిస్తున్న కుంభ రాశిలో బుధుడు, సూర్యుడు కూడా ప్రవేశించారు. మూడు గ్రహాల కలయికతో శశ మహా పురుష రాజయోగం ఏర్పడనుంది. వీరికి కుబేరుడి అనుగ్రహం లభించనుంది.
Shasa mahapurusha raja yogam: నవగ్రహాలలో శని దేవుడు క్రూరమైన గ్రహంగా పరిగణిస్తారు. కర్మల అనుసారం ఫలితాలను ఇస్తాడు.శని అనుగ్రహం ఉంటే అంతా శుభమే జరుగుతుంది. ఈ ఏడాది మొత్తం తన సొంత రాశి అయిన కుంభరాశిలోనే శని సంచారం జరుగుతోంది.
శని ఉంటున్న ఈ రాశిలోకి గ్రహాల రాజు సూర్యుడు, గ్రహాల రాకుమారుడు బుధుడు ప్రవేశించారు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత సూర్యుడు శని సంచరిస్తున్న కుంభ రాశిలోకి ప్రవేశించాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవి రెండు శత్రు గ్రహాలుగా పరిగణిస్తారు. కుంభ రాశిలో ఈ మూడు గ్రహాల కలయిక వల్ల విశేషమైన శశ మహాపురుష రాజయోగం ఏర్పడనుంది. దీంతో పాటు త్రిగ్రాహి యోగం కూడా జరుగుతుంది.
కుంభ రాశిలో ఏ మూడు గ్రహాల మహాపురుష రాజయోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. ఈరోజు యోగం ఉన్న రాశులపై కుబేరుడు సంపద వర్షం కురిపిస్తాడు. సంపదకు దేవుడిగా కుబేరుడిని భావిస్తారు. అటువంటి కుబేరుడి అనుగ్రహం ఉంటే మీ జీవితంలో డబ్బుకి కొదువ ఉండదు. ఏయే రాశుల వారికి ఈ మహారాజ యోగం పట్టబోతుందో తెలుసుకుందాం.
కన్యా రాశి
కన్యా రాశి వారికి శశ మహాపురుష రాజయోగం శుభ ఫలితాలు ఇస్తుంది. వైవాహిక జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి. మీరు పని చేస్తున్న రంగంలో అద్భుతమైన విషయాలు సాధిస్తారు. గతంలో నిలిచిపోయిన పనులను ఈ సమయంలో పూర్తి చేస్తారు. వ్యాపారం చేసే వారికి శని దేవుడు ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. కుటుంబ జీవితంలో సంతోషం నెలకొంటుంది. కుబేరుడి అనుగ్రహంతో సంపద పెరుగుతుంది. నూతన ఆదాయ మార్గాల వల్ల ఆదాయం రాబడి ఉంటుంది.
కర్కాటక రాశి
శనితో పాటు సూర్యుడు, బుధుడు కలవడం వల్ల ఏర్పడిన ఈ రాజయోగంతో కర్కాటక రాశి జాతకులకు అనేక ప్రయోజనాలు కలగబోతున్నాయి. వ్యాపారం చేసే వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యక్తిగత జీవితం మీద ఈ యోగం ప్రభావం ఉంటుంది. కెరీర్లో ప్రగతి సాధిస్తారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. శ్రమిస్తే విజయం చెంత చేరుతుంది.
మేష రాశి
కుంభ రాశిలో ఏర్పడుతున్న ఈ మహారాజ యోగం వల్ల మేష రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. వ్యాపార ఒప్పందంలో తీసుకునే ముఖ్య నిర్ణయాల వల్ల ఆర్థిక లాభం పొందుతారు. వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది. కుబేరుడి ఆశీస్సులు ఈ రాశి వారిపై ప్రత్యేకంగా ఉంటాయి.
వృశ్చిక రాశి
శత మహాపురుష రాజయోగంతో వృశ్చిక రాశి వారి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మధురమైన మాటలతో ఎదుటివారిని త్వరగా ఆకర్షించగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో పనితీరు మెరుగుపరుచుకుంటారు. మీరు కోరుకున్న కలలు నెరవేరే సమయం ఇది. తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.
సింహ రాశి
సింహ రాశి వారికి శశ మహాపురుష యోగం మంచి ఫలితాలు ఇస్తుంది. నమ్మకంతో ముందుకు సాగండి. మానసిక ప్రశాంతత పొందుతారు. అవివాహితులకు ఈ సమయంలో పెళ్లి కుదిరే అవకాశం ఉంది.