Tulasi plant: మీ ఇంట్లోని తులసి మొక్క ఎండిపోతుందా? జాగ్రత్త పడండి లేదంటే ఆర్థిక నష్టాలు తప్పవు-what does it mean when a tulasi plant dries up ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Tulasi Plant: మీ ఇంట్లోని తులసి మొక్క ఎండిపోతుందా? జాగ్రత్త పడండి లేదంటే ఆర్థిక నష్టాలు తప్పవు

Tulasi plant: మీ ఇంట్లోని తులసి మొక్క ఎండిపోతుందా? జాగ్రత్త పడండి లేదంటే ఆర్థిక నష్టాలు తప్పవు

Gunti Soundarya HT Telugu
Mar 26, 2024 06:37 PM IST

Tulasi plant: హిందూ మతంలో తులసి మొక్కకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నిత్యం తులసిని పూజిస్తూ దీపం వెలిగిస్తారు. అయితే తరచూ తులసి మొక్క ఎండిపోతూ ఉంటుందా? దాని అర్థం ఏంటో తెలుసా?

మీ ఇంట్లో తులసి మొక్క ఎండిపోతుందా?
మీ ఇంట్లో తులసి మొక్క ఎండిపోతుందా? (pinterest)

Tulasi plant: భారతీయులు తులసి మొక్కను చాలా పవిత్రంగా చూసుకుంటారు. లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. తులసి ఔషధ గుణాల కోసం మాత్రమే కాకుండా హిందువులు పూజకి ఉపయోగిస్తారు. ఇంట్లో తులసి కోట ఏర్పాటు చేసుకొని నిత్యం పూజలు అందిస్తారు.

తులసి మొక్క పచ్చగా ఉంటే ఆ కుటుంబం మీద దైవానుగ్రహం ఉంటుందని నమ్ముతారు. ప్రతికూల శక్తులు ఇంటి దరిదాపుల్లో కూడా ఉండలేవు. అయితే ఇంట్లో ఉండే తులసి మొక్క పచ్చగా లేకపోయినా, తరచూ ఎండిపోతున్న, మొక్క సరిగా పెరగకపోయినా ఏదో అశుభానికి సంకేతమని అర్థం చేసుకోవాలి. వెంటనే ఎండిపోయిన మొక్క స్థానంలో కొత్త దాన్ని తీసుకొచ్చి పెట్టాలి.

ప్రతికూల శక్తులు

పచ్చగా ఉండే తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోతే అది మీ ఇంట్లో ప్రతికూల శక్తులు, చెడు దుష్టశక్తులు ఉన్నాయని చెప్పేందుకు చిహ్నంగా భావించాలి. దీని ప్రభావం కుటుంబ సభ్యుల మీద చెడుగా ఉంటుంది. ప్రతికూల భావోద్వేగాలు, పరిష్కరించలేని సమస్యలు, పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబంలో ఘర్షణ వాతావరణం నెలకొంటుంది.

నిర్లక్ష్యం వల్ల

తులసి మొక్క ఎండిపోవడానికి మరొక కారణం ఇంట్లో వాళ్ళ నిర్లక్ష్యం కూడా ఉంటుంది. తులసిని సరైన పద్ధతిలో సంరక్షించుకోకపోతే దాని ప్రభావం మొక్క మీద కనిపిస్తుంది. కుటుంబంలోని వ్యక్తుల పట్ల మీకు శ్రద్ధ లేదని నిరూపిస్తుంది. అలాగే కుటుంబం మద్దతు మీకు లేదని అర్థం. సరిగా సంరక్షణ చేసుకోలేకపోతే కుటుంబంలో తగాదాలు, గొడవలు జరుగుతాయి. ఘర్షణ వాతావరణం నెలకొన్న ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించడానికి ఇష్టపడదు.

పచ్చగా ఉన్న తులసి మొక్క కుటుంబానికి రక్షణను ఇస్తుంది. ఐశ్వరాన్ని అందిస్తుంది. మొక్క ఎండిపోయే విధంగా ఉన్నట్లయితే మీరు వెంటనే ఇంటిని శుభ్రపరుచుకోవాలి. ఈ సమయంలో దైవారాధనకు ఎక్కువగా సమయం కేటాయించాలి. వీలైతే శాంతి పూజ జరిపించుకోవడం మంచిది.

ఇంట్లో సానుకూలత లేకపోవడం

తులసి మొక్క ఇంటి చుట్టూ సానుకూల శక్తిని, స్వచ్చతను వ్యాపింపచేస్తుంది. ఈ మొక్క ఎండిపోవడం ప్రారంభించినట్లయితే ఇంట్లో సానుకూలత లేదని సంకేతంగా భావించాలి. కుటుంబ సభ్యుల మధ్య చెడు సంబంధాలు కలిగినప్పుడు లేదా అధిక ఒత్తిడి, ప్రతికూలత ఉన్నట్లయితే దీని ప్రభావం మొక్క ద్వారా కనిపిస్తుందని విశ్వాసం.

ఆర్థిక నష్టాలు

తులసి మొక్క లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. సంపద, సమృద్ధికి దేవతగా లక్ష్మీదేవిని పూజిస్తారు. ఆర్థిక సంక్షోభం రాబోతున్న సమయంలో తులసి మొక్క ఎండిపోతుంది. ఇంట్లో పచ్చని తులసి మొక్క ఉంటే సంపద, సంతోషం కలుగుతుందని నమ్ముతారు. అయితే తులసి మొక్క ఎండిపోవడం వల్ల కుటుంబంలో ఆర్థిక నష్టాలు, కష్టాలు రాబోతున్నాయని అందుకు ఇదొక సూచికగా భావించాలి. తులసిని పొరపాటున కూడా తూర్పు దిశలో పెట్టకూడదు. ఇది ఆర్థిక సంక్షోభాన్ని కలిగిస్తుంది. ఈశాన్య లేదా ఉత్తర దిశలో ఉంచుకుంటే మంచిది. అలాగే ఆదివారం తులసికి నీరు సమర్పించకూడదు. ఎందుకంటే ఆరోజు తులసి మాత ఉపవాసం ఉంటుందని చెప్తారు. నీరు పోయడం వల్ల ఉపవాసం భగ్నమవుతుందని విశ్వసిస్తారు.

(డిస్‌క్లెయిమర్: ఇవి జ్యోతిష, వాస్తు శాస్త్ర విశ్వాసాలు మాత్రమే. వీటిని హిందుస్తాన్ టైమ్స్ ధృవీకరించదు.)

WhatsApp channel