Vasantha panchami 2024: వసంత పంచమి రోజు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించండి.. వృత్తిలో ఆటంకాలు తొలగిపోతాయ్
Vasantha panchami 2024: వసంత పంచమి రోజు సరస్వతీ దేవి అనుగ్రహం కోసం ఈ నైవేద్యాలు సమర్పించండి. వృత్తిలో, చదువులో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది.
Vasantha panchami 2024: ఏ పని తలపెట్టినా అందులో ఆటంకాలు ఎదురవుతున్నాయా? వృత్తిలో వచ్చే ఆటంకాల వల్ల ఇబ్బందులు పడుతున్నారా? అయితే సరస్వతీ దేవిని పూజించే సమయంలో ఈ భోగాలు సమర్పించడం వల్ల వాటి నుంచి విముక్తి కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు.
ఫిబ్రవరి 14వ తేదీన వసంత పంచమి జరుపుకోనున్నారు. ఈరోజు సరస్వతీ దేవితో పాటు శివుడు, విష్ణువుని పూజించడం ప్రత్యేక ఆచారం. అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు పూజ సమయంలో ఐదు ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించడం వల్ల సరస్వతీ దేవి ఆశీస్సులు లభిస్తాయి. అలాగే మీ జీవితంలోని బాధలు తొలగిపోతాయి.
సరస్వతీ దేవి అనుగ్రహంతో జ్ఞానం, వాక్కుకి సంబంధించిన లోపాలు తొలగిపోతాయి. పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు స్వీట్లు సమర్పించడం వల్ల సరస్వతీ దేవి ప్రత్యేక అనుగ్రహం పొందుతారు. వసంత పంచమి రోజు పసుపు రంగుకు అధిక ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే పసుపు రంగు స్వీట్లు ఎక్కువగా నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేస్తే సంపద, సంతోషం, శ్రేయస్సు ప్రసాదిస్తుందని నమ్ముతారు.
శనగపిండి లడ్డూ
వసంత పంచమి రోజు శనగపిండి లడ్డూను సమర్పించడం వల్ల సరస్వతీ దేవి అనుగ్రహం లభిస్తుంది. ఈరోజు దేశీ నెయ్యితో చేసిన శనగ పిండి లడ్డూ అమ్మవారికి సమర్పించండి. సరస్వతీ దేవితో పాటు దేవగురువు బృహస్పతి, విష్ణువు అనుగ్రహాలు కూడా లభిస్తాయి.
స్వీట్ బూందీ
సరస్వతీ దేవిని ఇష్టమైన మరొక పదార్థం స్వీట్ బూందీ. పూజ సమయంలో అమ్మవారికి స్వీట్ బూందీ సమర్పిస్తే సకల బాధలు తొలగిపోతాయి. జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. బూందీ లడ్డు సమర్పించి ఈ ప్రసాదాన్ని అందరికీ పంచి పెట్టండి. ఇలా చేయడం వల్ల సరస్వతీ దేవి దయ మీపై ఉంటుంది. అదృష్టం తలుపులు తెరుచుకుంటాయి.
మాల్పువా
పిల్లలకు చదువులో, పెద్దలకు వృత్తిలో ఆటంకాలు ఎదురైతే వాటిని అధిగమించేందుకు సరస్వతీ దేవికి మాల్పువా సమర్పించండి. ఇది నైవేద్యంగా పెట్టడం వల్ల మానసిక వికాసాన్ని పొందుతారు. తెలివితేటలు మెరుగవుతాయి.సరస్వతీ దేవి అనుగ్రహం పొందటం కోసం మీ పిల్లలతో తప్పని సరిగా మాల్పువా పూజలో పెట్టించండి. చదువులో రాణిస్తారు.
పరమాన్నం
అమ్మవారికి పాలు, వెన్న, నెయ్యి అంటే మహా ప్రీతి. అందుకే వసంత పంచమి రోజు బెల్లం వేసి పరమాన్నం చేసి సమర్పించాలి. దేశీ నెయ్యి, చక్కెర లేదా బెల్లం, కుంకుమ పువ్వు, డ్రై ఫ్రూట్స్ వేసి పరమాన్నం తయారు చేసి భోగంగా సమర్పించండి. కుంకుమ పువ్వు వేసి తయారు చేసిన ఖీర్ కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు.
రాజ్ భోగ్
సరస్వతీ దేవికి ఇష్టమైన మరొక ప్రసాదం రాజ్ భోగ్. పాలతో చేసే ఈ పదార్థం అమ్మవారికి ఎంతో ప్రీతిప్రాతమైనది. రాజ్ భోగ్ సమర్పించడం వల్ల అదృష్టం పెరుగుతుందని నమ్ముతారు. దీనితో పాటు సరస్వతీ దేవికి పసుపు వస్త్రాలు, పసుపు మిఠాయిలు పెట్టవచ్చు. సరస్వతీ దేవి పూజ సమయంలో రాజ్ భోగ్ సమర్పించడం చాలా పవిత్రంగా భావిస్తారు. దీనితో పాటు శనగపిండితో చేసే జిలేబి కూడా పెట్టుకోవచ్చు.
సంబంధిత కథనం