Pregnancy After 40 Years : 40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చితే వచ్చే సమస్యలు..
Pregnancy After 40 Years : ఆధునిక జీవనశైలితో మహిళలు గర్భం దాల్చడం కష్టంగా ఉంది. 30 ఏళ్లలోపు గర్భం దాల్చాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇటీవల మహిళలు తమ కెరీర్‌పై ఎక్కువ శ్రద్ధ చూపడంతో ఆలస్యంగా గర్భం దాల్చుతున్నారు. దీంతో సమస్యలు వస్తున్నాయి.
40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం అనేది కాస్త కష్టమైన విషయమే. కానీ చాలా మంది ఇలా కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. కెరీర్ మీద ఫోకస్ చేసి.. ఆలస్యం అవుతున్నారు. కొందరికి ప్రెగ్నెన్సీ అయితే.. మరికొందరు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే సరిగా ప్లాన్ చేసుకోవాలి.
సెలబ్రిటీలు కూడా 40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సామాన్యులు కూడా దీనిని అనుసరిస్తున్నారు. దీని వల్ల ఎలాంటి సమస్య వస్తుంది? ఈ రకమైన గర్భం సురక్షితమేనా? శిశువు, తల్లి ఆరోగ్యంపై ఏదైనా ప్రభావం ఉందా అని తెలుసుకోండి.
గర్భానికి ఉత్తమ సమయం ఏది?
గర్భం ధరించడానికి ఉత్తమ వయస్సు ఏది? నిపుణుల అభిప్రాయం ప్రకారం 20 నుండి 30 సంవత్సరాల వయస్సులో గర్భవతి కావడం ఉత్తమం. ఈ వయసులో బిడ్డ పుడితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. 30 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం చాలా కష్టం. మహిళల్లో అనేక సమస్యలు కనిపిస్తాయి.
మరికొందరు మొదటి ప్రెగ్నెన్సీ తర్వాత ఎక్కువ విరామం తీసుకుని రెండో ప్రెగ్నెన్సీకి సిద్ధమవుతారు. ఇలా చేయడం తప్పు. అందువల్ల మొదటి గర్భం నుండి కోలుకునే వరకు రెండో గర్భం కోసం ఎక్కువ సమయం వేచి చూడకూడదు. రెండు గర్భాల మధ్య 18-23 నెలల విరామం ఉండాలి. మొదటి గర్భం నుండి కోలుకున్న తర్వాత.. మరొక గర్భం కోసం సిద్ధం కావడానికి చాలా సమయం కావాలి.
అనేక సమస్యలు
వయసు పెరిగే కొద్దీ గుడ్ల సంఖ్య తగ్గుతుంది. 35 ఏళ్ల తర్వాత, గర్భం దాల్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఆలస్యమైన గర్భం గర్భధారణ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. వయసు ఎక్కువ అయ్యాక గర్భం దాల్చాలనుకునే మహిళలు వైద్యులను సంప్రదించాలి. ఇంకా గర్భం దాల్చడం కష్టంగా ఉన్నట్లయితే మీరు IVF లేదా సరోగసీ వంటి పద్ధతుల ద్వారా పిల్లలను పొందవచ్చు.
లేట్ గర్భం గర్భస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది. నవజాత శిశువులలో కూడా కొన్ని సమస్యలు కనిపిస్తాయి. నెలలు నిండకుండానే లేదా తక్కువ బరువుతో పుట్టిన పిల్లలులాంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. గర్భధారణ సమయంలో తల్లి కూడా కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంది. చాలా బలహీనంగా కనిపిస్తారు.
సవాలుతో కూడుకున్నదే
40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాగే తరచుగా వైద్యుడిని సంప్రదించండి. మీరు గర్భం ధరించడానికి ప్రయత్నించి గర్భం పొందలేకపోతే సంతానోత్పత్తి పరీక్ష చేయించుకోవాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం మీరు 45 ఏళ్లు పైబడి ఉంటే, మీరు సహజంగా గర్భం పొందలేరు.
40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం కచ్చితంగా సవాలుతో కూడుకున్నదే. ఈ సందర్భంలో గర్భధారణ సమయంలో అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఇది శారీరకంగా లేదా మానసిక సమస్యలను తీసుకు వస్తుంది. మీ వయస్సులో, కండరాల ద్రవ్యరాశిని కోల్పోవడం వల్ల కీళ్ల నొప్పులు సర్వసాధారణం. మీరు అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడవచ్చు. అందుకే ఏదైనా సరైన సమయంలో జరగాలి.