Israel war : గర్భవతి కడుపును చీల్చి- బిడ్డను కత్తితో పొడిచి చంపి..!
Israel war : హమాస్ సృష్టించిన విధ్వంసానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇజ్రాయెల్ నుంచి మరో విషాదకర ఘటన బయటకు వచ్చింది. ఓ గర్భవతిని చంపిన కొందరు.. ఆమె కడుపును చీల్చేశారు. లోపల ఉన్న శిశువును కత్తితో పొడిచి హత్య చేశారు!
Israel war latest news : ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రవాదుల బృందం సృష్టించిన విధ్వంసం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. సామాన్యులను.. ఉగ్రవాదులు చంపిన విధానం కంటతడి పెట్టించే విధంగా ఉంది. ఆ తర్వాత ఇజ్రాయెల్ కూడా తన సైన్యంపై విరుచుకుపడింది. వీటి మధ్య జరిగిన ఓ అమానవీయ ఘటనకు సంబంధించిన విషయం ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ఓ ఇంట్లోకి చొరబడిన కొందరు.. ఓ గర్భవతి కుడుపును చీల్చి, బిడ్డను బయటకు తీసి మరీ చంపేశారు!
ఇంత దారుణమా..! అమానవీయం!
గత శనివారం ఉదయం.. ఇజ్రాయెల్‌పై గాజా స్ట్రిప్ నుంచి హమాస్ బృందం భీకర దాడులు చేసింది. ఒకేసారి 5వేలకుపైగా రాకెట్లను విడిచి, విధ్వంసం సృష్టించింది. అయితే.. ఇజ్రాయెల్‌పై దాడిలో ఇది ఒక భాగం మాత్రమే. ఓవైపు రాకెట్ల దాడి జరుగుతుంటే.. మరోవైపు హమాస్ ఉగ్రవాదులు.. సరిహద్దులను దాటుకొచ్చి, ఇజ్రాయెల్వాసులకు నరకం చూపించారు. వీధుల్లో ఎవరు కనిపిస్తే వారిని చంపుకుంటూ వెళ్లారు. అనేకమందిని కిడ్నాప్ చేసి, హత్య చేశారు.
Hamas attack on Israel : ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య విభేదాలు దశాబ్దాల నాటివి! ఎప్పుడు ఇక్కడ రక్తం చిందుతూనే ఉంటుంది. వీటి మధ్య సామాన్యుల జీవితాలు చితికిపోతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయే వారి మృతదేహాలను జాకా అనే సంస్థ సేకరిస్తూ ఉంటుంది. ఈ జాకాలో 55ఏళ్ల యోస్సి లాండౌ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఈయనకు 33 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది.
యొస్సీ లాండౌ.. గాజాకు ఉత్తరాన ఉన్న అష్దూద్ అనే నగరంలో జీవిస్తుంటాడు. ఇజ్రాయెల్‌పై హమాస్ బృందం చేసిన దాడి విని షాక్ అయ్యాడు. అయితే.. అసలు కథ ఇక్కడే మొదలైంది!
హమాస్ దాడిని ఇజ్రాయెల్ ప్రతిఘటించడంతో.. ఇరువర్గాల మధ్య భీకర పోరాటం జరిగింది. యుద్ధం మొదలైన కొన్ని రోజులకు.. మృతదేహాలను సేకరించేందుకు తన టీమ్‌తో కలిసి బయలుదేరాడు యొస్సీ లాండౌ.
Israel Hamas war : "స్డేరూట్ పట్టణంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. వాహనాలు తిరగబడ్డాయి. వీధుల్లో మృతదేహాలు కుప్పలుతెప్పలుగా పడి ఉన్నాయి. ఒక రోడ్డులో పరిస్థితులు మాటలకు అందని విధంగా ఉన్నాయి. ఆ రోడ్డు దాటాలంటే కేవలం 15 నిమిషాలు సరిపోతుంది. కానీ మృతదేహాలను కలెక్ట్ చేసుకుంటూ.. ఆ రోడ్డు దాటేందుకు మాకు 11 గంటల సమయం పట్టింది!" అని యొస్సీ లాండౌ అన్నాడు.
సాధారంగా అంత ఎక్స్‌పీరియెన్స్ ఉన్నవారికి ఫీలింగ్స్ ఉండవు. నిత్యం మృతదేహాలను చూసే వారికి ఏడుపు రాదు! కానీ బీరీ అనే నగరంలో లాండౌకు ఎదురైన ఓ సంఘటనను చూసి.. దాదాపు కన్నీరు పెట్టుకునేంత పనైందంట!
Israel latest news : స్డేరూట్లో లభించిన మృతదేహాలను ట్రక్‌లో ఎక్కించుకున్న తర్వాత.. యొస్సీ లాండౌ బృందం బీరి అనే ప్రాంతానికి వెళ్లింది. గాజా నుంచి 5 కి.మీల దూరంలో ఉండే ఆ ప్రాంతంలో 1,200 మంది నివాసముండేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
"మేము ఒక ఇంట్లోకి ప్రవేశించాము. అక్కడ ఎదురైన సంఘటనను జీవితంలో మర్చిపోలేను. దాదాపు కన్నీళ్లు వచ్చేశాయి. ఆ ఇంట్లో ఓ గర్భవతి మృతదేహం పడి ఉంది. ఆమె కడుపును సగం చీల్చేశారు. కడుపులో ఉన్న శిశువును కత్తితో పొడిచి చంపేశారు," అని నాటి దృశ్యాలను వివరించాడు యొస్సీ లాండౌ.
“20మందికిపైగా ప్రజలను.. వారి చేతులను వెనక్కి కట్టి మరీ చంపేశారు. కొందరిపై లైంగిక దాడి కూడా జరిగింది,” అని యొస్సీ లాండౌ తెలిపాడు.