Crime news : ప్రియురాలిని కత్తితో 13సార్లు పొడిచిన వ్యక్తి.. దూరం పెడుతోందని!-woman stabbed by man in delhs lado sarai cabbie catches accused ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : ప్రియురాలిని కత్తితో 13సార్లు పొడిచిన వ్యక్తి.. దూరం పెడుతోందని!

Crime news : ప్రియురాలిని కత్తితో 13సార్లు పొడిచిన వ్యక్తి.. దూరం పెడుతోందని!

Sharath Chitturi HT Telugu
Oct 13, 2023 06:00 AM IST

Delhi crime news : మహిళపై ఆమె ప్రియుడు దాడి చేసిన ఘటన దిల్లీలో కలకలం సృష్టించింది. మొత్తం 13సార్లు ఆమెను కత్తితో పొడిచాడు!

ప్రియురాలిని కత్తితో 13సార్లు పొడిచిన వ్యక్తి.. దూరం పెడుతోందని!
ప్రియురాలిని కత్తితో 13సార్లు పొడిచిన వ్యక్తి.. దూరం పెడుతోందని!

Delhi crime news : దిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియురాలి ప్రవర్తనలో మార్పు కనిపిస్తోందన్న కారణంతో ఆమెపై కత్తితో దాడి చేశాడు ఓ వ్యక్తి! 13సార్లు కత్తితో పొడిచాడు.

ఇదీ జరిగింది..

దిల్లీలోని లడూ సరై ప్రాంతంలో గురువారం ఉదయం జరిగింది ఈ ఘటన. పోలీసుల ప్రకారం.. 23ఏళ్ల మహిళ.. 2-3ఏళ్లుగా ఓ 27ఏళ్ల వ్యక్తితో రిలేషన్​లో ఉండేది. కానీ గత కొంత కాలంగా అతడిని ఇగ్నోర్​ చేస్తూ వస్తోంది. గురువారం ఉదయం.. బయటకు వెళ్లేందుకు క్యాబ్​ బుక్​ చేసుకుని అందులో ఎక్కిన వెంటనే.. ఆ వ్యక్తి వాహనం ముందు దర్శనమిచ్చాడు.

ఇద్దరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇంతలో.. జేబులో నుంచి కత్తిని బయటకు తీసిని ఆ వ్యక్తి, మహిళని బెదిరించాడు. 13సార్లు ముఖం, శరీరంపై దాడి చేశాడు. ఆమెకు చాలా రక్తం కారింది. నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించగా.. క్యాబ్​ డ్రైవర్​ అతడిని పట్టుకుని బంధించాడు.

Man stabs woman : ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. 'హెల్ప్​ చేయండి.. హెల్ప్​ చేయండి.. ఆసుపత్రికి తీసుకెళ్లండి' అని మహిళ చేస్తున్న విజ్ఞప్తి, ఆ వీడియోలో వినిపిస్తోంది.

ఉదయం 6:30 నిమిషాల ప్రాంతంలో దిల్లీ పీసీఆర్​కు కాల్​ వెళ్లింది. వెంటనే స్పందించిన పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆమెను ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఆమెకు ప్రాణ హానీ లేదని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని తెలిసింది.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్​ చేశారు. దర్యాప్తు చేస్తుండగా కొన్ని విషయాలు తెలిశాయి. 2,3 ఏళ్ల క్రితం ఇద్దరు ఒకే ఆఫీస్​లో పనిచేసే వారని వివరించారు.

Man stabs lover in Delhi : "బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో.. నిందితుడు, బాధితురాలికి ఫోన్​ చేశాడు. తాను ఆఫీసులో ఉన్నట్టు చెప్పి, ఆమె ఫోన్​ పెట్టేసింది. ఆ తర్వాత అతడి ఫోన్​ బ్లాక్​ చేసింది. గురువారం ఉదయం అతను, ఆమె ఇంటికి వెళ్లాడు. కొంతకాలంగా అతడికి ఆమె దూరంగా ఉంటోంది," అని పోలీసులు చెప్పారు.

విచారణలో భాగంగా నిందితుడు.. నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు వెల్లడించారు.

"2- 3ఏళ్లుగా రిలేషన్​లో ఉన్నాము. కానీ ఈ మధ్య కాలంలో తన ప్రవర్తన మారిపోయింది. 10రోజులైంది కలిసి. 4-5సార్లు నన్ను కొట్టింది కూడా. మాట్లాడటానికి క్యాబ్​ ఎక్కితే గొడవమొదలైంది. కోపంలో.. పాకెట్​లో నుంచి కత్తి తీసి దాడి చేశాను," అని నిందితుడు చెప్పినట్టు సమాచారం.

కాగా.. నిందితుడి గురించి మహిళ పోలీసులకు ముందే సమచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.

Man stabs lover : "అక్టోబర్​ 10న.. మహిళ పీసీఆర్​కు కాల్​ చేసింది. పాల్​ అనే వ్యక్తి హింసిస్తున్నాడని చెప్పింది. డబ్బులు విషయంలో బెదిరిస్తున్నాడని పేర్కొంది. కానీ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించింది," అని పోలీసులు తెలిపారు.

ఇంటర్వ్యూకి వెళుతుండగా..!

ఈ పూర్తి వ్యవహారంపై బాధితురాలి తల్లి స్పందించారు.

"నా భర్త చాలా కాలం క్రితమే మరణించాడు. కుటుంబానికి నా కూతురు చాలా సాయం చేస్తోంది. ఉద్యోగం మారాలని, గురువారం ఉదయం ఇంటర్వ్యూ కోసం బయలుదేరింది. ఇంతలో ఇలా జరిగింది. అతను.. నా కూతురిని వెంబడిస్తున్నాడు. పెళ్లి, పెళ్లి అని హింసిస్తున్నాడు. రిజిస్టర్​ మ్యారేజ్​ చేసుకుందామని ఒత్తిడి చేస్తున్నాడు. కానీ నా కూతురు పెళ్లికి సిద్ధంగా లేదు. ఈ విషయం చెప్పినా, అతని అర్థం కావడం లేదు. పెళ్లి చేసుకోకపోతే, చంపేస్తానని బెదిరించేవాడు. ఆమె అతడిని ప్రేమించలేదు," అని బాధితురాలి తల్లి మీడియాకు చెప్పారు.

WhatsApp channel

సంబంధిత కథనం