పెళ్లి వేడుకలో అగ్ని ప్రమాదం 113 మంది మృతి-more than 100 dead and 150 injured in wedding inferno ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  పెళ్లి వేడుకలో అగ్ని ప్రమాదం 113 మంది మృతి

పెళ్లి వేడుకలో అగ్ని ప్రమాదం 113 మంది మృతి

HT Telugu Desk HT Telugu
Published Sep 27, 2023 07:06 AM IST

ఒక వివాహ వేడుకలో జరిగిన అగ్నిప్రమాదంలో 100 మందికి పైగా మరణించారు. 150 మంది గాయపడ్డారు.

పెళ్లి వేడుకలో అగ్ని ప్రమాదం (ప్రతీకాత్మక చిత్రం)
పెళ్లి వేడుకలో అగ్ని ప్రమాదం (ప్రతీకాత్మక చిత్రం) (face book)

నినెవే, ఇరాక్ (రాయిటర్స్): ఇరాక్‌లోని నినెవే ప్రావిన్స్‌లోని హమ్దానియా జిల్లాలో ఒక వివాహ వేడుకలో జరిగిన అగ్నిప్రమాదంలో 100 మందికి పైగా మరణించారు. 150 మంది గాయపడ్డారు.

నినెవే డిప్యూటీ గవర్నర్ హసన్ అల్-అల్లాక్ రాయిటర్స్‌తో మాట్లాడుతూ 113 మంది మరణించినట్లు ధృవీకరించారు. వేడుక సందర్భంగా బాణాసంచా కాల్చడం వల్ల హాల్‌లో మంటలు చెలరేగాయని స్థానిక పౌర రక్షణ విభాగం తెలిపింది.

‘హాల్ నుండి మంటలు ఎగసిపడటం మేం చూశాం. చాలా మంది అందులో చిక్కుకుపోయారు..’ అని మంటల నుంచి తప్పించుకున్న 34 ఏళ్ల ఇమాద్ యోహానా చెప్పారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం భవనం మంటలు త్వరగా అంటుకునే స్వభావం గల నిర్మాణ సామగ్రితో నిర్మితమైందని, ఇది వేగంగా కూలిపోవడానికి కారణమని స్థానిక మీడియా తెలిపింది.

అధికారిక ప్రకటనల ప్రకారం ఫెడరల్ ఇరాకీ అధికారులు, ఇరాక్ సెమీ అటానమస్ కుర్దిస్తాన్ ప్రాంతం నుంచి అంబులెన్స్‌లు, వైద్య సిబ్బందిని ఘటనాస్థలికి పంపించారు.

రాత్రి 10:45 గంటల సమయంలో భవనంలో మంటలు చెలరేగినట్లు ఘటనా స్థలం వద్ద ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.