Israel Gaza war : ఇజ్రాయెల్-​ గాజా మధ్య యుద్ధ మేఘాలు.. ఒకేసారి 5వేల రాకెట్ల ప్రయోగం!-israel declares state of war after thousands of rockets fired from gaza ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Israel Gaza War : ఇజ్రాయెల్-​ గాజా మధ్య యుద్ధ మేఘాలు.. ఒకేసారి 5వేల రాకెట్ల ప్రయోగం!

Israel Gaza war : ఇజ్రాయెల్-​ గాజా మధ్య యుద్ధ మేఘాలు.. ఒకేసారి 5వేల రాకెట్ల ప్రయోగం!

Sharath Chitturi HT Telugu
Oct 09, 2023 04:06 PM IST

Israel Gaza war : ఇజ్రాయెల్​- గాజాలు యుద్ధం అంచున్న ఉన్నట్టు కనిపిస్తోంది. ఇజ్రాయెల్​పై గాజా 5వేలకుపైగా రాకెట్లను ప్రయోగించింది.

ఇజ్రాయెల్​ గాజా మధ్య యుద్ధ మేఘాలు..
ఇజ్రాయెల్​ గాజా మధ్య యుద్ధ మేఘాలు.. (REUTERS)

Israel Gaza war : ఇజ్రాయెల్​- గాజా మధ్య మరోమారు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంకా చెప్పాలంటే.. ఈ రెండు ప్రాంతాల మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. గాజా స్ట్రిప్​ నుంచి హమాస్​ మిలిటెంట్లు.. ఇజ్రాయెల్​పై రాకెట్లతో విరుచుకుపడటమే ఇందుకు కారణం. హమాస్​ చర్యలను ఇజ్రాయెల్​ దళాలు ప్రతిఘటిస్తున్నాయి.

5వేల రాకెట్లతో హడలెత్తించిన గాజా..!

ఇజ్రాయెల్​వైపు గాజా స్ట్రిప్​ నుంచి కొన్ని గంటల వ్యవధిలో 5వేలకుపైగా రాకెట్లు దూసుకెళ్లడం.. అక్కడి పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో చెబుతోంది. పవిత్రమైన జెరుసలేమ్​తో పాటు అనేక ప్రాంతాల్లో అంబులెన్స్​ సైరన్​ మోత మోగిపోతోంది. తాజా ఘటనలో ఒక మహిళ మరణించినట్టు సమాచారం. పలువురు గాయపడినట్టు తెలుస్తోంది.

తాజా పరిస్థితులపై ఇజ్రాయెల్​ భద్రతా దళాలు స్పందించాయి.

Israel Gaza conflict : "గాజా స్ట్రిప్​ నుంచి అనేకమంది ఉగ్రవాదులు ఇజ్రాయెల్​లోకి చొరబడ్డారు. గాజా స్ట్రిప్​ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని హెచ్చరికలు జారీ చేశాము. ప్రస్తుతం యుద్ధం మధ్యలో ఉన్నట్టు అనిపిస్తోంది," అని ఇజ్రాయెల్​ భద్రతా దళాలు తెలిపాయి.

హమాస్​ బృందం.. పక్కా ప్లాన్​తో ఇజ్రాయెల్​పై దాడి చేస్తున్నట్టు కనిపిస్తోంది. దీనికి ఆపరేషన్​ అల్​-అఖ్స ఫ్లడ్​ అన్న పేరు పెట్టింది ఆ బృందం. 5వేలకుపైగా రాకెట్లను లాంచ్​ చేసినట్టు ప్రకటించింది.

"ఇజ్రాయెల్​ అరాచకాలకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాము. పాలస్తీనావాసులు ఎక్కడున్నా సరే.. బయటకు వచ్చి పోరాడండి," అని హమాస్​ బృందం వెల్లడించింది.

Gaza attacks Israel : ఇజ్రాయెల్​పై గాజా ఆల్​-ఔట్​ అటాక్​ ప్లాన్​ చేసినట్టు కనిపిస్తోంది. గాజా నుంచి ఇజ్రాయెల్​లోకి చొరబడిన అనంతరం కొందరు ఆయుధాలతో డెరూట్​ ప్రాంతంలో విధ్వంసం సృష్టించినట్టు సమాచారం. రోడ్డు మీద వెళుతున్న వారిపై వీరు కాల్పులకు తెగబడినట్టు తెలుస్తోంది. వీధుల్లో గందరగోళం నెలకొంది.

మరో ప్రాంతంలో.. అనేక మంది ఇజ్రాయెల్​ దేశస్థులను ఫైటర్లు బందీ చేసినట్టు సమాచారం. అక్కడి ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

Israel Gaza latest news : తాజా పరిణామాల మధ్య ఇజ్రాయెల్​ ప్రధాని బెంజమిన్​ నేతన్యాహూ.. ఉన్నతాధికారులతో అత్యవసర భేటీని నిర్వహించాలని నిర్ణయించారు. తదుపరి చర్యలపై ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.

2022 ఫిబ్రవరిలో మొదలైన రష్యా- ఉక్రెయిన్​ యుద్ధం.. ఇప్పటికీ కొనసాగుతూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భయపెడుతోంది. ఈ తరుణంలో మరో యుద్ధం మొదలైతే.. పరిస్థితులు దారుణంగా ఉంటాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

Whats_app_banner

సంబంధిత కథనం