Krishna mukunda murari serial: ఊహించని మలుపు, బ్లాక్ మెయిల్ కి దిగిన ముకుంద.. గుట్టు రట్టు చేయబోతున్న కృష్ణ-krishna mukunda murari serial today may 21st episode krishna murari grow suspicious about mukunda strange behavior ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari Serial: ఊహించని మలుపు, బ్లాక్ మెయిల్ కి దిగిన ముకుంద.. గుట్టు రట్టు చేయబోతున్న కృష్ణ

Krishna mukunda murari serial: ఊహించని మలుపు, బ్లాక్ మెయిల్ కి దిగిన ముకుంద.. గుట్టు రట్టు చేయబోతున్న కృష్ణ

Gunti Soundarya HT Telugu
May 21, 2024 07:52 AM IST

Krishna mukunda murari serial today may 21st episode: తనకు ఆదర్శ్ తో పెళ్లి ఇష్టం లేదని ఎలాగైనా దాన్ని ఆపమని కృష్ణని ముకుంద బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఇక మీరా ప్రవర్తన మీద కృష్ణ, మురారి అనుమానపడతారు.

కృష్ణ ముకుంద మురారి సీరియల్ మే 21వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ మే 21వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Krishna mukunda murari serial today may 21st episode: అందరూ కలిసి కింద కూర్చుని భోజనం చేస్తుంటే కృష్ణ వాళ్ళు వస్తారు. పెళ్లి సందడి మొదలయ్యిందని కృష్ణ బాధగా అంటుంది. తినేందుకు కృష్ణ కింద కూర్చుంటే ఒట్టి మనిషివి కూడా కాదు పైన కూర్చోమని భవానీ చెప్తుంది.

బ్లాక్ మెయిల్ చేసిన ముకుంద

ముకుంద కావాలని కృష్ణ బాధపడేలా మాట్లాడుతుంది. కృష్ణ కన్నీళ్ళు దిగమింగుకుంటుంది. తింటుంటే కృష్ణకి పొలమారుతుంది. ముకుంద వెంటనే నీళ్ళు తీసుకెళ్ళి తాగిస్తుంది.

గర్భం తీసేశానని ఈ పెళ్లి ఆపాలసిన పని లేదని రిలాక్స్ అయిపోతారు ఏమో. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎలాగైనా మీరే ఈ పెళ్లి ఆపాలి. ఆపకపోతే మీ విషయం మొత్తం చెప్పేస్తానని ముకుంద కృష్ణని బెదిరిస్తుంది.

ముకుంద మాటలకు కృష్ణ స్పృహ తప్పి పడిపోతుంది. అందరూ కంగారుపడతారు. డాక్టర్ కి పపహవం చేయమని భవానీ అంటే మురారి కంగారుగా వద్దని అంటాడు. కానీ భవానీ వినకుండా ఫోన్ చేస్తుంది. వేరే డాక్టర్ అయితే విషయం చెప్పేస్తారని మురారి కంగారుపడి కృష్ణ మొహం మీద నీళ్ళు చల్లుతాడు.

మధు డౌట్

కృష్ణ కళ్ళు తెరుస్తుంది. హాస్పిటల్ కి వెళ్దామని భవానీ అంటే గర్భవతులకు ఇది సాధారణమే కంగారుపడాల్సిన పని లేదని చెప్పి అందరికీ సర్ది చెప్తుంది. కృష్ణ ప్రవర్తనలో తేడా ఆకనిపిస్తుంది ఏమై ఉంటుందా అని మధు డౌట్ పడతాడు.

కృష్ణ, మురారి మీరా గురించి మాట్లాడుకుంటారు. మీరాకి ఆదర్శ్ ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఆదర్శ్ తనని పెళ్లి చేసుకోవాలని చాలా అనుకున్నాడు. అప్పుడు ముకుంద ఇప్పుడు మీరా వాడికి ఎందుకు ఇలా జరుగుతుందని మురారి బాధపడతాడు.

మీరాకి మన కుటుంబానికి ఏంటి సంబంధమని కృష్ణ డౌట్ రైజ్ చేస్తుంది. మిమ్మల్ని ముకుంద వాళ్ళ నాన్న అరెస్ట్ చేయించినప్పుడు హోమ్ మినిస్టర్ తో మాట్లాడి విడిపించింది. తర్వాత అనాథ అంటే పెద్దత్తయ్య ఇంట్లో చోటు ఇచ్చింది. హ్యాపీగా ఆదర్శ్ ని పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అయిపోవచ్చు కదా.

మీరా మీద అనుమానం

తనకు ఈ ఇంట్లో స్థానం దక్కడమే ఎక్కువ. అలాంటిది కోడలి స్థానం వస్తుంటే ఎందుకు కాదనుకుంటుంది. తన మనసులో ఎవరైనా ఉన్నారేమోనని మురారి అంటాడు. ఒక అమ్మాయి ఎవరినైనా ఇష్టపడితే ఇలా సరోగసికి ఒప్పుకోదు. ఆదర్శ్ అంటే ఇష్టం లేకపోతే చెప్పేయొచ్చు కదా.

మనల్ని ఎందుకు అడ్డం పెట్టుకుని ఇలా చేస్తుంది. మన మీద ఎందుకు డామినేట్ చేయాలని చూస్తుంది. మనకి చెప్పకుండా బిడ్డని తీసుకుంది, తీసేసింది. అంతా తన ఇష్ట ప్రకారం చేస్తుందో అర్థం కావడం లేదని అంటుంది. నాకు అదే అనుమానంగా ఉంది మీరా వెనుక ఏదో తెలియని కోణం ఉంది.

నువ్వు అన్నట్టు దీని వెనుక ఏదో అజెండా ఉందని మురారి డిసైడ్ అవుతాడు. ఆ అజెండా ఏంటో తెలుసుకోవాలని ఫిక్స్ అవుతారు. పెళ్లి షాపింగ్ జరుగుతుంది. చీరలు తీసుకోకుండా ముకుంద సైలెంట్ గా ఉంటే నందిని చీర సెలెక్ట్ చేస్తుంది. అది బాగోలేదని ఆదర్శ్ అంటాడు.

మురారి సెలెక్ట్ చేసిన చీర లాగేసుకున్న ముకుంద

తర్వాత ఆదర్శ్ స్వయంగా చీర సెలెక్ట్ చేస్తాడు. ముకుంద కృష్ణ వైపు చూస్తే కొంచెం ఓపిక పట్టు నీ అసలు రంగు తెలిస్తే అప్పుడు అంతు తేలుస్తానని అనుకుంటుంది. ఇక మురారిని కృష్ణకి చీర సెలెక్ట్ చేయమని అంటాడు. పెళ్ళికి, సీమంతానికి ఒకటని అంటారు.

మురారి సెలెక్ట్ చేసిన చీర ఎలాగైనా తీసుకోవాలని ముకుంద అనుకుంటుంది. మురారి కృష్ణ కోసం సెలెక్ట్ చేసిన చీర ముకుంద లాగేసుకుని అది తాను తీసుకుంటానని అంటుంది. అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. నీ సీమంతానికి టైమ్ ఉంది కదా అందుకే తీసుకుంటానని ముకుంద అంటుంది.

పెళ్లి కూతురివి నచ్చింది అన్నావ్ కదా తీసుకోమని రేవతి చెప్తుంది. ఆదర్శ్ మొహం మాడ్చుకుని వెళ్ళిపోతాడు. మీరా మనతో ఆడుకుంటుంది, నీకోసం సెలెక్ట్ చేసిన చీర తను తీసుకుందని మురారి కోపంగా అంటాడు.

ముకుందలాగే మీరా

తను లాక్కున్న విధానం చూస్తే చీర మీద ఆశ కంటే నీకు దక్కకూడదన్న ఆలోచనతో తీసుకున్నట్టు అనిపించదని చెప్తాడు. కృష్ణ ఇది కరెక్ట్ అంటుంది. తను చేసే ప్రతి పని వెనుక ఏదో ఒక అజెండా కనిపిస్తుంది. తన ప్రతి మూమెంట్ తెలుసుకుని అసలు విషయం తెలుసుకోవాలని కృష్ణ అంటుంది.

నాకొక డౌట్ వచ్చింది నన్ను కాపాడటం వల్ల ఇంటికి వచ్చిందని అనిపించడం లేదు. ఇంటికి రావడం కోసమే నన్ను కాపాడిందని అనిపిస్తుంది. అసలు ఆ సమస్యకు తనే కారణమా? అంటాడు. తన ప్రతి కదలిక వెనుక ఏదో ఉంది. ఒకప్పుడు ముకుంద ఎలా ప్రవర్తించిందో మీరా కూడా అలాగే ప్రవర్తిస్తుంది.

తన టార్గెట్ ఏంటి నువ్వా లేక నేనా లేక మన బిడ్డ లేకపోతే మన కుటుంబమా అని మురారి అనుమానిస్తాడు. అక్కడితో నేటి కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

తరువాయి భాగంలో..

కృష్ణ, మురారి బయటకు వెళ్లబోతుంటే భవానీ ఎక్కడికని అడుగుతుంది. మీరా కృష్ణని తీసుకుని రెస్టారెంట్ కి వస్తుంది. నాకోసం ఆలోచించి గర్భం తీయించుకున్నానని అన్నావ్ కదా. మా బిడ్డ ఎక్కడికి పోలేదు అంటుంది. దీంతో ముకుంద టెన్షన్ పడుతుంది. నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావ్ అంటే ఏం లేదని అంటుంది. దీంతో కృష్ణ లాగి పెట్టి ఒకటి పీకుతుంది.

టీ20 వరల్డ్ కప్ 2024