Murari Heroin: మురారి సినిమాలో మహేశ్‍కు జోడీగా సోనాలీ కంటే ముందు ఈ బాలీవుడ్ భామను అనుకున్నారట!
Murari Movie: మురారి సినిమా మంచి హిట్ సాధించింది. కెరీర్ తొలినాళ్లలో మహేశ్‍కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ మూవీలో సోనాలీ బింద్రే నటన కూడా అందరినీ ఆకట్టుకుంది. అయితే, సోనాలీ స్థానంలో హీరోయిన్‍గా ముందుగా మరో బాలీవుడ్ నటిని మూవీ టీమ్ అనుకుందట. ఆ వివరాలు ఇవే..
Murari Movie: సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్లో మురారి సినిమాకు చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. కృష్ణ వంశీ దర్శకత్వంలో 2001లో వచ్చిన ఈ సూపర్ నేచురల్ ఫ్యామిలీ డ్రామా సినిమా మంచి సక్సెస్ అయింది. హీరోగా తన నాలుగో సినిమాతోనే ఫ్యామిలీ ప్రేక్షకులకు మహేశ్ చేరువయ్యాడు. బాక్సాఫీస్ వద్ద కూడా మురారి సినిమా మంచి హిట్ కొట్టింది. ఈ సినిమాలో హీరోయిన్ సోనాలీ బింద్రే నటనకు అందరినీ మెప్పించింది. వసుంధర పాత్రలో ఆమె చేసిన అల్లరి, అందం వారెవా అనిపించాయి. అయితే, మురారి కోసం సోనాలీని తీసుకునే ముందు వేరే బాలీవుడ్ హీరోయిన్ పేరును మూవీ టీమ్ అనుకుంటదట. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
ఆ నటిని తీసుకుందానుకొని..
మురారి సినిమా కోసం హీరోయిన్‍గా ముందుగా బాలీవుడ్ నటి ఇషా డియోల్‍ను తీసుకోవాలని మూవీ టీమ్ అనుకుందట. దీనిపై చర్చలు కూడా సాగాయి. ఇషా కూడా అప్పడప్పుడే సినీ రంగంలోకి అడుగుపెట్టారు. అయితే, కొన్ని అంశాలు సెట్ కాకపోవటంతో ఇషా స్థానంలో సోనాలీ బింద్రేను తీసుకోవాలని దర్శకుడు కృష్ణ వంశీ ఆ తర్వాత నిర్ణయించుకున్నారు.
సోనాలీ బింద్రే అప్పటికే బాలీవుడ్‍లో చాలా సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. మంచి పర్ఫార్మర్‌గా ప్రూవ్ చేసుకున్నారు. దీంతో మురారి సినిమా కోసం సోనాలీనే కృష్ణ వంశీ ఫైనల్ చేశారు. ఈ చిత్రంతోనే ఆమె టాలీవుడ్‍లో అడుగుపెట్టారు.
భేష్ అనిపించుకున్న సోనాలీ
మురారి (మహేశ్ బాబు) మరదలు వసుంధరగా సోనాలీ బింద్రే నటన ప్రశంసలు దక్కించుకుంది. పల్లెటూరి అమ్మాయిగా చలాకీగా, అల్లరిగా ఆమె యాక్టింగ్ భేష్ అనిపించుకుంది. అందంతో పాటు అమాయకమైన ఎక్స్‌ప్రెషన్లతోనూ ఆకట్టుకున్నారు. ఎమోషన్ సీన్లలోనూ మెప్పించారు. మురారి మూవీతో తెలుగులోనూ సోనాలీ చాలా పాపులర్ అయ్యారు. దీంతో టాలీవుడ్‍లో వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి.
మురారి మూవీ కోసం చర్చల్లో ఓ దశలో హేరామ్ ఫేమ్ వసుంధర ధార్ పేరు కూడా వచ్చిందట. అయితే, ఫైనల్‍గా సోనాలీ బింద్రేకే ఆ ఛాన్స్ దక్కింది.
మురారి మూవీని ఇంట్రెస్టింగ్ పాయింట్‍తో ఎంటర్‌టైనింగ్ ఫ్యామిలీ డ్రామాగా దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కించారు. ముందుగా ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినా.. ఆ తర్వాత అంతా సద్దుమణిగింది. చాలా థియేటర్లలో 100 రోజులు కూడా ఈ చిత్రం ఆడింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది.
మురారి మూవీ 2001 ఫిబ్రవరి 17వ తేదీన రిలీజ్ అయింది. ఈ మూవీని రామ్ ప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై దేవీ ప్రసాద్, రామలింగేశ్వర రావు, గోపీ నందిగం నిర్మించారు. ఇక, ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన సంగీతం కూడా హైలైట్‍గా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా పాటలు ప్రెష్‍గా అనిపిస్తాయి. అంతలా ఈ చిత్రంలోని కొన్ని సాంగ్స్ ఎవర్‌గ్రీన్‍గా నిలిచాయి.
మురారి తర్వాత ఒక్కడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు సహా చాలా బ్లాక్‍బస్టర్ హిట్‍లను తన కెరీర్లో మహేశ్ బాబు సాధించారు. మహేశ్ తన 29వ చిత్రంగా దర్శక ధీరుడు రాజమౌళితో తదుపరి మూవీ చేయనున్నారు. గ్లోబల్ రేంజ్‍లో అడ్వెంచర్ యాక్షన్ సినిమాగా ఇది రూపొందనుంది. ఈ ఏడాది ఆగస్టు లేకపోతే సెప్టెంబర్‌లో షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది.