krishna mukunda murari serial: మరోసారి చెంప పగిలిందిరోయ్.. నేనే ముకుందనని చెప్పేసిన మీరా, షాక్ లో కృష్ణ
krishna mukunda murari serial today may 22nd episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. ఎందుకు ఆదర్శ్ ని పెళ్లి చేసుకోవాలని డ్రామా ఆడుతున్నావని కృష్ణ మీరా చెంప పగలగొడుతుంది. దీంతో మీరా అసలు ముకుందని నేనే అని నిజం చెప్పేస్తుంది.
krishna mukunda murari serial today may 22nd episode: ఒకప్పుడు ముకుంద ఎలా ప్రవర్తించిందో మీరా కూడా అలాగే ప్రవర్తిస్తుందని కృష్ణ అనుమానపడుతుంది. అసలు తన టార్గెట్ ఏంటని మురారి ఆలోచిస్తాడు. కుటుంబం జోలికి వస్తే సహించేది లేదని కృష్ణ అంటుంది.
మీరా గర్భం తీయించుకోలేదు
మీరా గదిలోకి వెళ్ళి కృష్ణ చెక్ చేస్తుంది. ఎంత వెతికినా ఏం కనిపించదు. మీరాలో నాకు ఒక క్రిమినల్ కనిపిస్తుంది. ఇలాగే వదిలేస్తే ఏం జరుగుతుందోనని భయంగా ఉందని అనుకుంటుంది. మీరా గదిలో ఉన్న డస్ట్ బిన్ చూస్తే అందులో కొన్ని ట్యాబ్లెట్స్ పేపర్ ఉంటుంది.
బేబీ గ్రోత్ కోసం ట్యాబ్లెట్ వేసుకుంటుంది అంటే మీరా గర్భం తీయించుకోలేదు. ఎందుకు ఇలా చేస్తుంది. బిడ్డ ఉన్నందుకు సంతోషించాలా అబద్ధం చెప్పినందుకు బాధపడాలా అనుకుంటుంది. వాటిని తీసుకుని కృష్ణ గదికి వచ్చి మోసపోయామని మురారికి చెప్తుంది.
మీరా గర్భం తీయించుకోలేదు మనతో అబద్ధం చెప్పిందని కృష్ణ చెప్తుంది. మీరా కడుపులో మన బిడ్డ క్షేమంగా ఉందని అంటుంది. మరి ఎందుకు అబద్ధం చెప్తుంది. మన బాధ చూడలేక సరోగసికి ఒప్పుకున్నట్టు చెప్పింది. మన బిడ్డని కడుపులోకి వేసుకున్నాక గర్భం తీయించుకున్నానని అబద్ధం చెప్తుంది.
నిజం చెప్పిస్తా
మనకి చెప్పకుండా మన బిడ్డని మోస్తూ ఏం చేయాలని అనుకుంటుందని కృష్ణ అంటుంది. మన బిడ్డని అడ్డం పెట్టుకుని ఎందుకు ఇలా చేస్తుందోనని మురారి కూడా అనుకుంటాడు. ఇలాంటి ఆడదాని కడుపులో మన బిడ్డ పెరుగుతుంది. తన నుంచి మన బిడ్డని ఎలా కాపాడుకోవాలోనని ఇద్దరూ టెన్షన్ పడతారు.
మీరా గర్భం ఉంచుకుందని తన నోటితో తనే చెప్పేలా చేయాలని కృష్ణ డిసైడ్ అవుతుంది. పెళ్లి ఎక్కడ చేయాలా అనే దాని గురించి భవానీ ఆలోచిస్తూ ఉంటే కృష్ణ డల్ గా కిందకు రావడం చూసి పిలుస్తుంది. పెళ్లి ఎక్కడ చేద్దామని కృష్ణని అడుగుతుంది.
మీరాని రెచ్చగొట్టిన కృష్ణ
అక్కడ ముకుంద ఉండటం చూసి కావాలని తనని ఇరికిస్తుంది. వాళ్ళు ఎంతో ఇష్టపడి చేసుకుంటున్నారని వాళ్ళనే అడగండి అని మీరాని పిలుస్తుంది. పెళ్లి ఎక్కడ చేసుకోవాలనే ఫాంటసీ ఏమైనా ఉందా చెప్పు అని కృష్ణ అడుగుతుంది. పెళ్లిది ఏముంది ఎక్కడ చేసుకుంటున్నామని కాదు ఎవరిని చేసుకుంటామనేది ముఖ్యం కాదని అంటుంది.
ఆదర్శ్ ముకుంద కంటే మీరాని ఎక్కువ ఇష్టపడుతున్నాడు. ఈ పెళ్లి వాళ్ళకి జీవితాంతం గుర్తుండిపోవాలి. అంటూ కావాలని మీరాని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది. పెళ్లి ఎక్కడ చేయాలో మీరు డిసైడ్ చేస్తే బాగుంటుందని మీరా అనేసి వెళ్ళిపోతుంది.
ఎందుకు మీరాని రెచ్చగొడుతున్నావని మురారి కృష్ణని అడుగుతాడు. తిక్కలేస్తే నీకు గర్భం లేదని చెప్పేస్తుందేమోనని అంటాడు. తను చెప్పదు నిజం బయట పెట్టి మనల్ని బుక్ చేయాలని అనుకుంటే ఎప్పుడో చెప్పేది. వేరే ప్లాన్ ఏదో ఉంది అందుకే ఇలా నాటకం ఆడుతుందని చెప్తుంది.
వామ్మో ఇది సామాన్యురాలు కాదు
పెళ్ళికి ఎవరెవరిని పిలవాలో లిస్ట్ రాయమని భవానీ ముకుందని పిలుస్తుంది. అప్పుడే కృష్ణ, మురారి వస్తారు. మీరా యాక్టింగ్ చూసి ఇది సామాన్యురాలు కాదని ఎంత త్వరగా తేల్చుకుంటే అంత మంచిదని అనుకుంటారు. కృష్ణ హాస్పిటల్ కి వెళ్తున్నానని చెప్తుంది.
మీరా నువ్వు కూడా నాతో వస్తావా అని అడుగుతుంది. వచ్చేటప్పుడు చిన్న షాపింగ్ ఉందని చేసుకుంటామని చెప్తుంది. ఆదర్శ్ వచ్చి ఎక్కడికని అడిగితే షాపింగ్ కి వెళ్తున్నామని అంటుంది. మనం వెళ్దామని అనుకున్నాం కదాని ఆదర్శ్ అంటాడు.
నువ్వు ఇప్పుడే ఇలా ఉన్నావ్ అంటే పెళ్లి అయితే ముకుంద కొంగు వదిలేలా లేవని నందిని వాళ్ళు ఆటపట్టిస్తారు. ముకుంద కృష్ణ జాగ్రత్త అసలే ఒట్టి మనిషి కూడా కాదని భవానీ జాగ్రత్త చెప్తుంది. కృష్ణ మీరాని తీసుకుని రెస్టారెంట్ కి తీసుకొస్తుంది.
ఏమైంది ఇక్కడకి తీసుకొచ్చావని ముకుంద ఏం తెలియనట్టు అడుగుతుంది. నువ్వు ఏదో మాట్లాడటానికే ఇక్కడికి రమ్మన్నావ్ కానీ షాపింగ్ అని అబద్ధం చెప్పావ్ కదా అంటుంది. నాకోసం ఆలోచించి గర్భం తీయించుకున్నానని అన్నావ్ కదా అంటుంది.
మేం మళ్ళీ సరోగసికి వెళ్తున్నాం
అవును లేకపోతే బిడ్డని నా కడుపులో పెట్టుకున్న దాన్ని తొమ్మిది నెలలు మోసి నీ చేతిలో పెట్టడానికి నాకేంటి ప్రాబ్లం అంటుంది. కానీ మీ బిడ్డని ఇవ్వకపోతున్నందుకు చాలా బాధగా ఉందని నటిస్తుంది. మరీ అంత బాధపడకు. ఎందుకంటే మా బిడ్డ ఎక్కడికీ పోలేదని అనేసరికి ముకుంద షాక్ అవుతుంది.
నేను గర్భం తీయించుకోలేదని తెలిసిపోయిందా ఏంటని టెన్షన్ పడుతుంది. మేం మళ్ళీ సరోగసికి వెళ్దామని డిసైడ్ అయ్యామని కృష్ణ చెప్తుంది. వీళ్ళు ఇంకెవరితోనో బిడ్డని కంటే నా ఆటలు ఎలా సాగుతాయని అనుకుంటుంది.
సరోగసికి వెళ్తున్నాం కదా అందుకే మా బిడ్డ ఎక్కడికి పోలేదని అంటున్నానని చెప్తుంది. ఎందుకు టెన్షన్ పడుతున్నావని కృష్ణ అడుగుతుంది. ఇంకేమైనా చెప్పాలా అని కృష్ణ రెట్టించి అడుగుతుంది. ఏం లేదని అంటే కృష్ణ లాగిపెట్టి చెంప పగలగొడుతుంది. అక్కడితో నేటి కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.
తరువాయి భాగంలో..
ఎందుకు ఆదర్శ్ ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావని కృష్ణ నిలదీస్తుంది. ఒక్కొక్కసారి అబద్ధాలు వినడానికి హాయిగా ఉంటాయి. కానీ కొన్ని నిజాలు వింటే మాత్రం కష్టంగా ఉంటుంది. నీకు ఎవరి పేరు చెప్తే కోపం చిరాకు పుట్టుకు వస్తాయో, ఎవరిని చూస్తే ఒళ్ళంతా తేళ్ళు జర్రులు పాకుతున్నట్టు అనిపిస్తుందో ఆ పేరు ముకుంద.. ఆ ముకుందని నేనే అని చెప్పేస్తుంది.
టాపిక్