Brahmamudi May 30th Episode: బ్రహ్మముడి- మాయతో రాజ్ పెళ్లికి ఒప్పుకున్న కావ్య- అయినా అసహ్యించుకున్న అపర్ణ- షాక్‌లో అందరూ-brahmamudi serial 30th episode kavya accepts raj marriage with maaya swapna questions to aparna brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi May 30th Episode: బ్రహ్మముడి- మాయతో రాజ్ పెళ్లికి ఒప్పుకున్న కావ్య- అయినా అసహ్యించుకున్న అపర్ణ- షాక్‌లో అందరూ

Brahmamudi May 30th Episode: బ్రహ్మముడి- మాయతో రాజ్ పెళ్లికి ఒప్పుకున్న కావ్య- అయినా అసహ్యించుకున్న అపర్ణ- షాక్‌లో అందరూ

Sanjiv Kumar HT Telugu
May 30, 2024 07:22 AM IST

Brahmamudi Serial May 30th Episode: బ్రహ్మముడి సీరియల్ మే 30వ తేది ఎపిసోడ్‌లో మాయతో రాజ్‌ పెళ్లికి ఒప్పుకోమ్మని అపర్ణ నో ఆబ్జెక్షన్ విడాకులపై సంతకం చేయమని చెబుతుంది. నిజం చెప్పాల్సి వస్తుందని కావ్య సంతకం చేస్తుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ మే 30వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ మే 30వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో బాబుతో అవస్థలు పడుతుంటారు మాయగా వచ్చిన చిత్ర, రుద్రాణి. బాబు ఏడుస్తుంటే ఓాదర్చలేక సతమతం అవుతుంటారు. బాబు ఏడుపుకు చిత్ర చెవులు మూసుకుంటుంది. ఇంటలో స్వప్న వచ్చి బాబు అంతలా ఏడుస్తుంటే ఎద్దులా చూస్తున్నారేంటీ అని అడుగుతుంది. ఏడుపు ఆపేందుకే ప్రయత్నిస్తున్నామని రుద్రాణి అంటుంది.

పాలు ఇవ్వట్లేదు కదా

ఆపడం ఏంటీ బాబు తల్లి ఉందిగా.. బాబు ఏడుస్తుంటే అలా చూస్తావేంటీ.. నాకెందుకో అనుమానంగా ఉంది. అసలు నువ్వు తల్లివేనా అని స్వప్న అంటుంది. ఇద్దరు షాక్ అవుతారు. పాలు పట్టొచ్చుగా అని స్వప్న అడిగితే.. నాకు పాలు రావుగా అని చిత్ర నిజం చెప్పేస్తుంది. పాలు రాకపోవడం ఏంటీ అని స్వప్న అడిగితే.. అంటే చాలా రోజుల నుంచి పాలు ఇవ్వట్లేదు కదా. అందుకే రావడం లేదని రుద్రాణి కవర్ చేస్తుంది. డబ్బా పాలా. సరే ఏదో ఒకటి చేసి చావండి. తర్వాత నాకు జ్యూస్ పంపించు అని చెప్పి వెళ్లిపోతుంది స్వప్న.

కట్ చేస్తే హాల్లో అంతా ఉంటారు. అంతా అపర్ణను చూస్తుంటారు. స్కూల్ పిల్లలు బెల్ కొడితే వచ్చి లైన్‌లో నిల్చున్నట్లు తెల్లవారగానే ఇలా రావాల్సి వస్తుందని అనామిక విసుక్కుంటుంది. ఇన్ని రోజులు నీ పనికిమాలిన పంచాయతీ వల్లే మీ అత్త మా అత్త రాద్ధాంతం చేసేవాళ్లు. ఇప్పుడు వాళ్లంతా మా కావ్య మీద పడింది. ఏంటీ కోపంగా చూస్తున్నావ్. నువ్ ఇలాగే ఓవర్ యాక్షన్ చేస్తే రేపు నువ్ పంచాయతీ పెట్టిన ఎవరు రారు. మూసుకోని సైలెంట్‌గా ఉండు అని స్వప్న వార్నింగ్ ఇస్తుంది.

మంత్రిగా పెట్టుకుంటానని

ఏం చెప్తావో చెప్పు. ఇలా సైలెంట్‌గా ఉంటే ఎలా అని రుద్రాణి అంటుంది. అందరూ చెప్పాల్సింది చెప్పారు. ఇంకా దేనిగురించి అని సుభాష్ అంటాడు. మాయ మన కళ్లముందే ఉందిగా.. తనకు ఓ దారి చూపించకుండా అలాగే వదిలేస్తామా అని రుద్రాణి అంటుంది. ఈ విషయంలో మా అత్తకే ఎక్కువగా ఆరాటంగా ఉన్నట్లుంది. మాయ మహారాణి అయితే మంత్రిగా పెట్టుకుంటానని హామీ ఇచ్చిందా అని స్వప్న సెటైర్ వేస్తుంది.

ఇందులో ఎవరి ప్రోద్భలం లేదు. నాకు నేనుగా న్యాయం, కర్తవ్యం గురించి అందరినీ ఒక్కచోటుకు రమ్మన్నాను అని అపర్ణ అంటుంది. అదేంటో చెప్పమని సుభాష్ నిలదీస్తాడు. నువ్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఏం పొందకపోయినా.. కాపురంలో ఎలాంటి సుఖశాంతులు కలుగకపోయినా.. మరో ఆడది బిడ్డతో వచ్చినా కృంగిపోకుండా నాకు నా భర్తే కావాలి. విడాకులు ఇవ్వను అన్నావు. ఇప్పటికీ అదే మాట మీద నిలబడ్డావా అని కావ్యను అడుగుతుంది అపర్ణ.

ఒప్పుకుంటున్నట్లు సంతకం

అత్తయ్య.. మాటి మాటికి నిర్ణయాలు మార్చుకోడానికి ఇది వ్యాపారం కాదు సంసారం. నేను మనస్ఫూర్తిగానే చెప్పాను. నా భర్త ఉన్న ఇల్లే నా ఇల్లు. అది అరణ్యమైన అంతపురమైన ఒక్కటే అని కావ్య అంటుంది. సరే అది నీ ఇష్టం. నీ ఇష్టం అమలు జరగాలంటే నేను పెట్టే షరతుకు నువ్ ఒప్పుకోవాలి అని అపర్ణ అంటుంది. నాకు కొడుకు మాయను పెళ్లి చేసుకోడానికి నువ్ ఒప్పుకుంటున్నట్లు ఈ నో ఆబ్జెక్షన్ పత్రాలపై సంతకం చేయి అని అపర్ణ అడుగుతుంది.

దానికి అంతా షాక్ అవుతారు. మాయ, రుద్రాణి సంతోషిస్తారు. స్వప్న ఏమంటుంది అని అనామిక అంటే.. వినపడలేదా చెవులు దొబ్బాయా.. నన్ను రెచ్చగొట్టకు చెబుతున్నా అని స్వప్న అంటుంది. గుడ్ వెరీ గుడ్.. విడాకులు అయిపోయాయి. ఇప్పుడు అనుమతి పత్రాలపై పడ్డావా. కావ్యకు మాత్రం ఎప్పుడు అన్యాయమే చేయాలని నిర్ణయించుకున్నావని తెలుస్తోంది అని సుభాష్ అంటాడు. ఏంటీ వదినా ఎప్పుడు కావ్యకే అన్యాయమే జరగాలా. మాయకు న్యాయం చేయాలంటే ఇంకో రూపంలో చేయొచ్చు కదా అని ప్రకాశం అంటాడు.

మాట్లాడే అర్హత లేదు

పెద్దమ్మా కావ్య వదినా ఎలాంటిది అని మీకు ఇంకా అర్థం కాలేదా. మళ్లీ ఆవిడకే ఇలాంటి పరీక్షలు పెడుతున్నావ్ అని కల్యాణ్ అంటాడు. నేను కావ్యను వెళ్లిపోమనట్లేదు. కళ్లెదురుగా బిడ్డ తల్లి నిల్చుని ఉంది. ఆ బిడ్డకు వారసత్వం కల్పించాలని రాజ్‌కు మాయను ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాను అని అపర్ణ చెబుతుంది. కానీ, నేను కదా మమ్మీ ఒప్పుకోవాలి. మాయ తాళి కట్టించుకునేందుకు సిద్ధంగా ఉన్నా. కళావతి పెళ్లి అనుమతి పత్రాలకు వెనుకంజ వేయకపోయినా నిర్ణయం తీసుకోవాల్సింది.. ఆ పెళ్లి చేసుకోవాల్సింది నేను కదా అని రాజ్ అంటాడు.

మరి నా అనుమతి, అభిప్రాయం ఏం అవసరం లేదా అని కావ్య అంటుంది. నువ్ మాట్లాడే అర్హత కోల్పోయావ్ రాజ్. నువ్ చేసిన తప్పిది. దాన్ని నేను సరిదిద్దుతున్నాను. నీకు మాట్లాడే హక్కు లేదు. ఇప్పుడు మాట్లాడాల్సింది కేవలం కావ్య మాత్రమే. చెప్పు కావ్య.. సంతకం చేస్తావా అని అపర్ణ అడుగుతుంది. అప్పుడు ఒక్క నిమిషం అని స్వప్న అంటుంది. నేను సంతకం చేయాలి ఎక్కడ చేయాలి అని అడుగుతుంది స్వప్న. నీకేం సంబంధముందని రుద్రాణి అంటే.. మరి మా కావ్యకేం సంబంధం ఉందని సంతకం చేయాలని స్వప్న అడుగుతుంది.

నిలదీసిన స్వప్న

నువ్ మధ్యలో మాట్లాడకు అత్త.. ఇంతకాలం నేను దుగ్గిరాల కుటుంబ సమస్యల్లో పట్టించుకోలేదు. కానీ నా చెల్లికి అన్యాయం జరుగుతుంటే ఊరుకోలేను. రాజ్ తప్పు చేస్తే కావ్యకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు. పెళ్లయిన సంతోషం లేదని అన్నారు. అలాంటప్పుడు న్యాయం జరగాల్సింది కావ్యకే కదా. ఎందుకు కావ్య బలి కావాలి అని అపర్ణతోపాటు ఇంటిల్లిపాది నిలదీస్తుంది స్వప్న.

ఇప్పుడు నేను సంతకం పెట్టను అంటే మాయను ఎందుకు తీసుకొచ్చారు అంటారు. అప్పుడు నిజం చెప్పాల్సి వస్తుంది. సంతకం పెడితే పెళ్లికి టైమ్ ఉంటుంది. అప్పుడు నిజం బయటపెట్టొచ్చు అని కావ్య అనుకుంటుంది. నేను సంతకం చేస్తాను అని కావ్య అంటుంది. దాంతో అంతా షాక్ అయి చూస్తారు. నా భర్తకు మాయను ఇచ్చి పెళ్లి చేయడానికి నేను అంగీకరిస్తున్నాను. అనుమతినిస్తున్నాను. అభ్యంతరం లేదని రాసి ఇస్తాను అని కావ్య చెబుతుంది.

నా మీద ఒట్టు

హేయ్.. కళావతి ఏమైంది నీకు.. అని రాజ్ అంటాడు. అమ్మా కావ్య తొందరపడకు అని సుభాష్ అంటాడు. ఒసేయ్ మతిపోయిందా నీకు ఏం చేస్తున్నావ్ అని స్వప్న అంటుంది. ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే విషయం కాదు. ఆలోచించు అని ప్రకాశం అంటాడు. నేను అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. దయచేసి నన్ను ఆపకండి. ఎవరైనా అడ్డు చెబితే నా మీద ఒట్టు అని కావ్య అంటుంది. కావ్య కష్టంగా సంతకం పెట్టేందుకు వెళ్తుంది.

రాజ్‌ను చూస్తూ పెన్ తీసుకుంటుంది కావ్య. ఏడుస్తూ సంతకం చేస్తుంది కావ్య. పేపర్స్ అపర్ణకు ఇస్తుంది. ఈ సంతకం చేయగానే నువ్ ఆకాశమంతా ఎత్తు ఎదిగిపోయావని అనుకుంటున్నావేమో. ఇప్పుడు నువ్ నా దృష్టిలో పాతాళంలో నిలబడ్డావ్. ఇన్ని రోజులు రుద్రాణి చెబుతుంటే నమ్మలేదు. నీకు ఎవరు ఎలా పోతే ఏంటీ.. నీకు కావాల్సింది ఆస్తి. దుగ్గిరాల ఇంటి కోడలు అన్న హోదా. కేవలం డబ్బు కోసమే నువ్ అన్నింటికి సిద్ధపడ్డావ్. నీకు ఏ బంధాలు అక్కర్లేదు. అందుకే సంతకం చేశావ్ అని అపర్ణ అసహ్యించుకుంటుంది.

ఇందిరాదేవి ఎంట్రీ

బాగా చెప్పావ్ అని ఇందిరాదేవి ఎంట్రీ ఇస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో ఎందుకు సంతకం చేశావ్. నువ్ కాదంటే మనకు ఇంకాస్తా సమయం దొరికేది. నువ్వే ఈ రొంపిలోకి నెట్టేసావ్ అని రాజ్ అంటాడు. మీకు మాయతో పెళ్లి జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా. ఏం చేయాలో అదే చేస్తాను అని కావ్య వెళ్లిపోతుంది.

Whats_app_banner