Yakshini OTT: ఓటీటీలోకి వస్తున్న తెలుగు హారర్ వెబ్ సిరీస్ యక్షిణి.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. అప్పుడే సీజన్ 2 కూడా!-yakshini ott streaming on disney plus hotstar socio fantasy telugu web series yakshini ott release vedhika manchu laxmi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Yakshini Ott: ఓటీటీలోకి వస్తున్న తెలుగు హారర్ వెబ్ సిరీస్ యక్షిణి.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. అప్పుడే సీజన్ 2 కూడా!

Yakshini OTT: ఓటీటీలోకి వస్తున్న తెలుగు హారర్ వెబ్ సిరీస్ యక్షిణి.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. అప్పుడే సీజన్ 2 కూడా!

Sanjiv Kumar HT Telugu
May 25, 2024 12:18 PM IST

Yakshini Web Series OTT Streaming Date: ఓటీటీలోకి సరికొత్త తెలుగు సోషియో ఫాంటసీ, హారర్ వెబ్ సిరీస్ యక్షిణి వచ్చేస్తోంది. మంచు లక్ష్మి, వేదిక నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను తాజాగా మేకర్స్ రివీల్ చేశారు. మరి యక్షిణి ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ? అనే వివరాల్లోకి వెళితే..

ఓటీటీలోకి వస్తున్న సోషియో ఫాంటసీ వెబ్ సిరీస్ యక్షిణి.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. అప్పుడే సీజన్ 2 కూడా!
ఓటీటీలోకి వస్తున్న సోషియో ఫాంటసీ వెబ్ సిరీస్ యక్షిణి.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. అప్పుడే సీజన్ 2 కూడా!

Yakshini OTT Release: మంచువారి అమ్మాయి మంచు లక్షి, బ్యూటిఫుల్ హీరోయిన్ వేదిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తెలుగు వెబ్ సిరీస్ యక్షిణి. సోషియో ఫాంటసీ అండ్ హారర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌లో కోటా బొమ్మాళి ఫేమ్ రాహుల్ విజయ్ హీరోగా చేస్తున్నాడు. పాపులర్ యాక్టర్ అజయ్ మరో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు.

సోషియో ఫాంటసీ తరహాలో తెలుగులో సినిమాలు, వెబ్ సిరీసులు రావడం చాలా అరుదు. అలాంటిది చాలా కాలం తర్వాత యక్షిణి వస్తోంది. ఇదివరకు మంచు లక్ష్మి విలన్‌గా చేసిన అనగనగా ఓ ధీరుడు సోషియో ఫాంటసీ మూవీనే. ఇక హీరోయిన్ వేదిక చాలా కాలం గ్యాప్ తర్వాత డిజిటల్ ఎంట్రీ ఇస్తోంది. ముని, కాంచన 3, విజయదశమి, రూలర్ సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన వేదిక ఇటీవలే రజాకార్ మూవీతో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చింది.

ఇప్పుడు యక్షిణి వెబ్ సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ ఇస్తోంది. ఆర్కా మీడియా వర్క్స్, డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్ కలయికలో అత్యంత భారీ వ్యయంతో యక్షిణి రూపొందింది. డైరెక్టర్ తేజ మార్ని తెరకెక్కించిన ఈ యక్షిణి వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. జూన్ 14 నుంచి యక్షిణి వెబ్ సిరీస్‌ను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో డిజిటల్ ప్రీమియర్ చేయనున్నారు.

తెలుగులో అతి అరుదుగా వచ్చే ఈ సోషియో ఫాంటసీ థ్రిల్లర్‌ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే, ఆర్కా మీడియా, హాట్‌స్టార్ కాంబోలో ఇదివరకు నవీన్ చంద్ర హీరోగా పరంపర వెబ్ సిరీస్ వచ్చింది. జగపతిబాబు, శరత్ కుమార్, ఆకాంక్ష సింగ్ నటించిన ఈ సిరీస్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనికి మించిన రెస్పాన్స్ యక్షిణికి రావాలని ఆశిస్తున్నట్లు మే 24న జరిగిన ట్రైలర్ లాంచ్‌లో నిర్మాత ప్రసాద్ దేవినేని ఆకాక్షించారు.

అలాగే బడ్జెట్ విషయంలో చాలా ఫ్రీడమ్ ఇచ్చినట్లు, ఇది పూర్తిగా డైరెక్టర్ తేజ మార్ని విజన్ అని, కామెడీ, డ్రామా, రొమాన్స్ వంటి అంశాలతో యక్షిణి ఉంటుందని, యక్షిణి వెబ్ సిరీస్ 2 కోసం కూడా ప్లానింగ్ మొదలు పెట్టినట్లు నిర్మాత ప్రసాద్ దేవినేని పేర్కొన్నారు. కాగా యక్షిణి ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నటుడు అజయ్ తన అభిప్రాయాలు పంచుకున్నారు.

"వెబ్ సిరీస్‌లు నటీనటులకు ఒక వరం లాంటివి. ఒక పాత్రను అర్థం చేసుకుని వీలైనంత బాగా పర్‌ఫార్మ్ చేసే అవకాశం వెబ్ సిరీస్‌లలో దొరుకుతుంది. ఎక్కువ కాలం ఆ క్యారెక్టర్స్‌తో ట్రావెల్ చేయగలుగుతాం. యక్షిణి నాకు అలాంటి అవకాశం ఇచ్చింది. ఫాంటసీ ఎలిమెంట్స్‌తో వచ్చే కమర్షియల్ వెబ్ సిరీస్‌లు తెలుగులో చాలా తక్కువ. యక్షిణి అలాంటి జానర్‌తో తెరకెక్కింది" అని నటుడు అజయ్ తెలిపారు.

"ప్రేక్షకులకు మంచి ఫీల్ ఇచ్చే సిరీస్ ఇది. కన్ఫర్మ్‌గా బాగుంటుంది. మా టీమ్ అందరి ముఖాల్లోని కాన్ఫిడెన్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. విరూపాక్ష తర్వాత మాంత్రికుడి క్యారెక్టర్స్ చాలా వచ్చాయి. కానీ, అవన్నీ రిజెక్ట్ చేశాను. దానికి కాస్త దగ్గరగా ఉన్న రోల్ యక్షిణిలో చేశాను" అని పాపులర్ యాక్టర్ అజయ్ చెప్పుకొచ్చారు.

టీ20 వరల్డ్ కప్ 2024