Manchu Lakshmi Yakshini OTT: మంచు లక్ష్మీ ఓటీటీ వెబ్ సిరీస్ యక్షిణి.. జ్వాలగా అదిరిపోయిన లుక్.. స్ట్రీమింగ్ అప్పుడే!
Yakshini Web Series OTT Manchu Lakshmi: మంచు లక్ష్మి నటిస్తున్న సరికొత్త ఓటీటీ వెబ్ సిరీస్ యక్షిణి. బాహుబలి నిర్మాతలు రూపొందిస్తున్న ఈ సోషియో ఫాంటసీ వెబ్ సిరీస్ నుంచి తాజాగా మంచు లక్ష్మీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో మంచు లక్ష్మీ జ్వాలగా నటిస్తోంది.

Manchu Lakshmi Yakshini Web Series OTT: మంచు వారి ఫ్యామిలీ నుంచి నటిగా ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ నటనతో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. విలన్‌గా, హీరోయిన్‌గా అనేక సినిమాల్లో నటించి తనదైన శైలిలో రాణించింది. అనగనగా ఓ ధీరుడు సినిమాలో ఐరేంద్రి వంటి పవర్ ఫుల్ రోల్ చేసి టాలీవుడ్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.
మంచు లక్ష్మీకి అనగనగా ఓ ధీరుడు తొలి తెలుగు చిత్రమైనప్పటికీ నటనలో అనేక ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత హీరోయిన్‌గా పలు సినిమాలు సైతం చేసింది. గుండెల్లో గోదారి, లక్ష్మీ బాంబ్, దొంగాట, వైఫ్ ఆఫ్ రామ్, బుడుగు వంటి సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించింది మంచు లక్ష్మీ. అలాగే చందమామ కథలు, పిట్ట కథలు వంటి ఓటీటీ సినిమాలతో పాటు మలయాళంలో కూడా నటించింది మంచువారి అమ్మాయి లక్ష్మీ.
తాజాగా మంచు లక్ష్మి నటిస్తున్న ఓటీటీ వెబ్ సిరీస్ యక్షిణి. సోషియో ఫాంటసీ జోనర్‌లో వస్తున్న ఈ సిరీస్‌ను బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్ నిర్మిస్తోంది. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఆర్కా మీడియా వర్క్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కాంబినేషన్‌లోనే ఈ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ యక్షిణి రూపొందుతోంది. ఈ వెబ్ సిరీస్‌ను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు.
యక్షిణి వెబ్ సిరీస్‌లో బ్యూటిపుల్ వేదిక, మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. యక్షిణి సిరీస్‌కు దర్శకుడు తేజ మార్ని తెరకెక్కిస్తున్నారు. సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా పాత్రల ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను విడుదల చేస్తున్నారు మేకర్స్. తాజాగా మంచు లక్ష్మీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. యక్షిణిలో మంచు లక్ష్మీ జ్వాలగా నటిస్తోంది. మిస్టీరియస్ జ్వాల అంటూ స్పెషల్ పోస్టర్ ద్వారా మంచు లక్ష్మి క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేశారు.
పోస్టర్‌లో చీర కట్టుకుని మంచు లక్ష్మీ చాలా అందంగా కనిపించింది. అలాగే మంచు లక్ష్మీ ఓ బంగ్లాలో ఉన్నట్లు ఆమె చుట్టూ వెలుతురు ప్రకాశిస్తున్నట్లు ఉంది. మంచు లక్ష్మీ మెడలో ఓ లాకెట్ కూడా ఉంది. అది సిరీస్‌లో ఏదైనా కీలకమైన వస్తువుగా ఉండే అవకాశం ఉంది. కాగా ఫాంటసీ, రొమాన్స్, కామెడీ అంశాలతో రూపొందిన "యక్షిణి" ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుందని తెలుస్తోంది.
డైరెక్టర్ తేజ మార్ని విజన్‌కు తగినట్లు భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో ఆర్కా మీడియా వర్క్స్ ఈ సిరీస్‌ను నిర్మించింది. జూన్‌లో యక్ష్మి వెబ్ సిరీస్‌ను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే, ఆర్కా మీడియా వర్క్స్, డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌ది సూపర్ హిట్ కాంబినేషన్. ఈ సంస్థలు కలిసి చేసిన పరంపర, పరంపర 2 వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల్ని ఆకట్టుకుని విజయం సాధించాయి.
ఇప్పుడు ఇదే కాంబోలో యక్షిణి అనే మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ రానున్నడటంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇదివరకు వేదిక ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు. అది చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. మొత్తానికి ఫస్ట్ లుక్ పోస్టర్స్‌తో యక్షిణి మంచి బజ్ క్రియేట్ చేస్తోంది.
టాపిక్