Krishna about Love: ప్రేమ గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన కొన్ని విషయాలు.. వింటే ఎవరైనా మారిపోతారు!
Krishna about Love: ప్రేమతో జీవించడం అనేది జీవితంలో సత్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, అనుభవాలను, శాంతిని ఆనందాన్ని నేర్పుతుందని భగవద్గీతలో శ్రీకృష్ణుడు తెలిపారు. బంధాలు బాగుండేందుకు, ప్రేమ శాశ్వతంగా నిలిచేందుకు శ్రీకృష్ణ భగవానుడు వివరించిన సూక్తుల గురించి తెలుసుకుందాం.
ప్రేమ గురించి మాట్లాడాలంటే మొదటగా గుర్తొచ్చేది కృష్ణుడు. పురాణాల్లో కూడా కృష్ణ భగవానుడిని ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. అపారమైన ప్రేమ, భక్తి, సహనం వంటి విషయాలను గురించి భగవద్గీతలో కృష్ణుడు ప్రధానంగా వివరించాడు. ప్రేమతో జీవించడం అనేది జీవితంలో సత్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, అనుభవాలను,శాంతిని ఆనందాన్ని నేర్పుతుందని ఆయన తెలిపారు.ప్రేమకు సహనం అనేది ముఖ్యంగా చెప్పాడు. బంధాలు బాగుండేందుకు, ప్రేమ శాశ్వతంగా నిలిచేందుకు శ్రీకృష్ణ భగవానుడు వివరించిన సూక్తుల గురించి తెలుసుకుందాం.
నిజమైన ప్రేమ:
నిజమైన ప్రేమ అనేది ఎటువంటి అంచనాలు లేకుండా, ఎటువంటి కారణాలు లేకుండా, ప్రయోజనం కోరకుండా ఉండాలని కృష్ణుడు తెలిపాడు.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎలాంటి స్వార్థం, ఆశ లేకుండా ఉండటం, వారి మనోభావాలను గౌరవం ఇవ్వడం బంధాల్లో ప్రేమను పెంచేందుకు సహాయడతాయి. ఒకరి పట్ల మరొకరు జాగ్రత్తగా వ్యవహరించడమే నిజమైన ప్రేమ.
ప్రేమే జగమంతా:
నన్నుఅంటే పరమాత్మను మీ సొంతం చేసుకోవాలంటే, కేవలం ప్రేమతోనే అది సాధ్యం. ప్రేమతో ఉంటే నేను సంతోషంగా మీ పరం అవుతాను. ప్రేమ అనేది జీవన శక్తి, ఇది ప్రపంచాన్ని నడిపించే శక్తి అని గీతలో కృష్ణుడు బోధించాడు.
ఎటువంటి బంధాలు లేకుండా జీవించండి:
ఏ బంధం శాశ్వతం కాదు అనుకనే బంధ విముక్తులు మాత్రమే ఇతరులను నిజంగా ప్రేమించగలరని కృష్ణుడు తెలిపాడు. ఆ ప్రేమ స్వచ్ఛంగా, శుద్ధిగా ఉంటుంది.అటువంటి ప్రేమనే స్వర్గధామంగా అనిపిస్తుంది.
ప్రేమ గురించి:
ఈ భూమిపై నిజమైన ప్రేమ ఏదైనా ఉంటే, అది కళ్లతో చూడకపోయినా, చెవులతో వినకపోయినా, కేవలం మనస్సుతో మాత్రమే ఫీల్ చేయడం. నిజమైన ప్రేమ అనేది మనసుతో అనుభవించేది, దృశ్యాల ద్వారా కాదు.
ప్రేమతో జీవించండి:
మీ వల్ల సాధ్యమైనంత ప్రతి పనిని ప్రేమతో చేయండి. అహంకారం, కామం, ద్వేషం వంటి ప్రతికూల గుణాలకు దూరంగా ఉండాలి. ప్రేమ, అనురాగం, దయ, భక్తి వంటి గుణాలతో మాత్రమే ఇతరులతో వ్యవహరించండి.
ప్రేమ మహిమ:
ఈ విశ్వంలో అత్యంత శక్తివంతమైన సాధనమేదైనా ఉందంటే, అది ప్రేమ మాత్రమే. ఎంతటి కఠిన మనుషులను కూడా ప్రేమ మార్చగలదు. ప్రేమకు మాత్రమే ఈ విశ్వాన్ని మార్చగల శక్తి ఉంది.
హద్దుల్లేని ప్రేమ:
నిజమైన ప్రేమ అంటే నిస్వార్థమైనది, ఎటువంటి కోరికలు, ఎలాంటి పరిమితులు లేని, అత్యున్నతమైన ప్రేమ. ఇది ఎటువంటి వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా, ఇతరుల కోసం మాత్రమే ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి.
ప్రేమ సంరక్షణ:
మనం ప్రేమిస్తున్న విషయం భాగస్వామికి స్పష్టంగా తెలియకపోవచ్చు, కానీ మనం చూపించే శ్రద్ధ, కేరింగ్ వల్లనే అవతలి వ్యక్తికి ఆ ప్రేమ అర్థమవుతుంది. ప్రేమ సృష్టించేదే కాదు, దానిని సంరక్షించడంలో కూడా శక్తి ఉంటుంది.
ప్రేమ అనేది ఒక శక్తివంతమైన సాధన, అది అన్ని ఇతర శక్తుల కంటే గొప్పది. ప్రేమ జీవితంలోని అన్ని అడ్డంకులను అధిగమించడానికి మార్గాన్ని అందిస్తుంది.