Adilabad Kawal Forest: ఆదిలాబాద్ కవ్వాల్ అభయారణ్యంలో విదేశీ పక్షుల సందడి, పర్యాటకులకు కనువిందు
Adilabad Kawal Forest: ఉమ్మడి ఆదిలాబాద్ లోని కవ్వాల్ అటవీ ప్రాంతంలో ప్రకృతి అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల బర్డ్, బటర్ ఫ్లై వాక్ నిర్వహించారు. కాగా అడవిలో పలు అరుదైన పక్షులు పర్యటకులను కనువిందు చేశాయి.
Adilabad Kawal Forest: కవ్వాల్ టైగర్ జోన్లోని జన్నారం అటవీ డివిజన్లో పక్షులు ఆవాసాలు ఏర్పాటు చేసుకుని చూపరులను ఆకట్టుకుంటున్నాయి. పక్షి ప్రేమికులు వాటిని తిలకించేందుకు అటవీశాఖ అధికారులు బర్డ్ వాక్ పేరిట అవకాశం కల్పిస్తున్నారు. రెండేళ్లుగా ఫిబ్రవరిలో బల్డ్విక్ నిర్వహించగా వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి అనేక మంది పక్షి ప్రేమికులు వచ్చి పక్షులను తమ కెమె రాల్లో బందించు కుంటున్నారు.
జన్నారం అటవీ డివిజన్ లోని కల్పకుంట, బైసన్ కుంట, మైసమ్మకుంట, తదితర ప్రాంతాల్లోని అడవుల్లో వివిధ రకాల పక్షులు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. విదే శాల నుంచి వచ్చిన పక్షులు కూడా ఇక్కడ కనిపి స్తాయి. ఎప్పుడూ చూడని అరుదైన పక్షులకు ఆవాసంగా జన్నారం అటవీ డివిజన్ ఉంది. అధి కారులు, సిబ్బంది పక్షుల రకాలు, వాటి శాస్త్రీయ నామాలు, వివరాలు తెలుసుకునేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. అప్పటి నుంచి కవ్వాల్ టైగర్ జోన్లోని జన్నారం అటవీ డివిజన్ ను పక్షు లకు కూడా ఆవాసంగా గుర్తించారు.
రెడ్ రీసెల్డ్ ల్యాప్ విగ్, వైట్ ఐ బెజార్డ్, ఫైడ్ కింగ్ ఫిషర్, వైట్ త్రోటెడ్ కింగ్ ఫిషర్ వంటి పక్షులు కనిపించాయని అధికారులు అటవీ శాఖ అధికారులు తెలిపారు.
బర్డ్ వాచ్.. పక్షి ప్రేమికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు :
కావ్వాల్ లో పక్షులను చూసేందుకు తమ కెమెరాల్లో బంధించేందుకు ఫోటోగ్రాఫర్లు అధిక సంఖ్యలో వస్తున్నందున అటవీ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. పక్షులని తమ కెమెరా లో బందించేందుకు తదితర ప్రాంతాల నుండి మహారాష్ట్ర, కాకినాడ, హైదరాబాద్, వరం గల్, కరీంనగర్, తదితర ప్రాంతాల నుంచి పక్షి ప్రేమికులు, ఫొటోగ్రాఫర్లు వచ్చి తమ కెమెరా లో బందిస్తున్నారు.
రాత్రి అక్కడే ఉండి ఉదయం పక్షులను తిలకించే వీలు కల్పిస్తు న్నారు. ఉదయం బర్ద్వక్ చేసు కునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం సమావేశం ఏర్పాటు చేసి వారి అనుభవాలను తెలుసుకుంటున్నారు. ఈ సందర్బంగా అడవుల్లో రెడ్ రీసెల్డ్ ల్యాప్ విగ్, వైట్ ఐ బెజార్డ్, ఫైడ్ కింగ్ ఫిషర్, వైట్ త్రోటెడ్ కింగ్ ఫిషర్ వంటి పక్షులు కనిపించాయని కవ్వాల్ పర్యాటకులను ఆకర్షిస్తోందని అధికారులు తెలిపారు.
బర్వాకా ఫెస్టివల్ కు వచ్చే ప్రకృతి ప్రేమికులకు అటవీశాఖ అధికారులు మంచి ఆతిథ్యం ఇస్తున్నారు. నేచర్ ఎంజాయ్ చేసే విధంగా వచ్చిన వారికి జన్నారం అటవీ డివిజన్ లోని బైనన్ కుంట, ఇండన్ పల్లి రేంజ్ లోని బర్తన్పేట్ బేస్ క్యాంప్లలో డేరాలు ఏర్పాటు చేసి అందులో బస చేసే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు
(రిపోర్టింగ్ : వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి,, హిందూస్తాన్ టైమ్స్ తెలుగు)