తెలుగు న్యూస్ / ఫోటో /
Cyclone Chido : చిన్న ద్వీపంపై ప్రకృతి ప్రకోపం- తుపానుకు 22మంది బలి, వేల మందికి గాయాలు..
- మడగాస్కర్- ఆఫ్రికా ఖండం మధ్య 320,000 మందికి పైగా ప్రజలు నివసించే జనసాంద్రత కలిగిన ద్వీపం మయోట్టే. ఈ ప్రాంతంపై తుపాను విరుచుకుపడింది. ఈ ఘటనలో 22మంది ప్రాణాలు కోల్పోయారు.
- మడగాస్కర్- ఆఫ్రికా ఖండం మధ్య 320,000 మందికి పైగా ప్రజలు నివసించే జనసాంద్రత కలిగిన ద్వీపం మయోట్టే. ఈ ప్రాంతంపై తుపాను విరుచుకుపడింది. ఈ ఘటనలో 22మంది ప్రాణాలు కోల్పోయారు.
(1 / 7)
మయోట్టే ఆఫ్రికా తీరంలోని ఒక చిన్న ఫ్రెంచ్ ద్వీపం. చీడో తుపాను శనివారం మయోట్టే ద్వీపాన్ని తాకింది.
(2 / 7)
రాజధానిలోని మముత్సోలో పాఠశాలలు, ఆసుపత్రులు, రెస్టారెంట్లు, కార్యాలయాలు ధ్వంసమయ్యాయి. చెట్లు నేలకూలాయి, ఇళ్లపై పైకప్పులు విరిగిపోయాయి.(AFP)
(3 / 7)
ఈ తుఫాను కారణంగా 70 శాతం మంది తీవ్రంగా ప్రభావితమయ్యారని ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి బ్రూనో రెయిలీ తెలిపారు.(via REUTERS)
(5 / 7)
ద్వీపసమూహం అంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. టెలికమ్యూనికేషన్స్ కు తీవ్ర అంతరాయం కలిగింది. తాగు నీటి సేవలపైనా ప్రభావం పడింది.(AP)
(6 / 7)
'ఇది ఊహించలేని విపత్తు, రెస్క్యూ సిబ్బంది ఇంకా మృతదేహాల కోసం వెతుకుతున్నారు, మయోట్టే ఏకైక విమానాశ్రయం దెబ్బతింది, కొన్ని ప్రాంతాలకు అత్యవసర బృందాలను పంపడం అసాధ్యం,' అని ఫ్రెంచ్ రెడ్ క్రాస్ తెలిపింది.(via REUTERS)
ఇతర గ్యాలరీలు