Yerneni Naveen: బెదిరింపుల వ్యవహారంలో మైత్రీ మూవీస్‌ అధినేత ‍యెర్నేని నవీన్‌పై కేసు నమోదు-mythri movies head yerneni naveen booked in case of threats ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Yerneni Naveen: బెదిరింపుల వ్యవహారంలో మైత్రీ మూవీస్‌ అధినేత ‍యెర్నేని నవీన్‌పై కేసు నమోదు

Yerneni Naveen: బెదిరింపుల వ్యవహారంలో మైత్రీ మూవీస్‌ అధినేత ‍యెర్నేని నవీన్‌పై కేసు నమోదు

Sarath chandra.B HT Telugu
Apr 15, 2024 11:14 AM IST

Yerneni Naveen: ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ Mythri Movies అధినేత ‍యెర్నేని నవీన్‌ yerneni Naveenపై పోలీస్ కేసు నమోదైంది. క్రియా హెల్త్‌ కేర్ షేర్ల అక్రమ బదలాయింపు వ్యవహారంలో నవీన్‌పై కేసు నమోదు చేశారు.

బెదిరింపులతో కంపెనీ బదలాయింపు వ్యవహారంలో ‍ఎర్నేని నవీన్‌పై కేసు నమోదు
బెదిరింపులతో కంపెనీ బదలాయింపు వ్యవహారంలో ‍ఎర్నేని నవీన్‌పై కేసు నమోదు (facebook)

Yerneni Naveen: మైత్రీ మూవీస్‌ అధినేత, Cine Producer యెర్నేని నవీన్‌పై హైదరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేవారు. క్రియా హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ షేర్ల బదలాయింపు Share Transfer వ్యవహారంలో నవీన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో బలవంతంగా షేర్ల బదాలయించడం, బెదిరింపులతో కంపెనీ యాజమాన్య మార్పిడి ఆరోపణలతో ప్రముఖ సినీ నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్‌ అధినేత నవీన్‌ యర్నేని కూడా ఉన్నారని పోలీసులు ప్రకటించారు.

yearly horoscope entry point

ఫోన్‌ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన కంపెనీ షేర్ల బదలాయింపు వ్యవహారం తెరపైకి వచ్చింది. టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్‌ రావు ప్రమేయంతో క్రియా హెల్త్ కేర్ Kria Health care చేతులు మారినట్టు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల జాబితాలో యెర్నేని నవీన్ కూడా ఉన్నట్లు ప్రకటించారు. జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపిన వివరా ల ప్రకారం ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, ఇన్‌స్పెక్టర్‌ గట్టుమల్లు, ఎస్సై మల్లికార్జున్‌ సహా పలువురు నిందితులపై పంజాగుట్ట స్టేషన్‌లో పలు కేసులు నమోదు అయ్యాయి. ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత కొన్నేళ్ల క్రితం తనకు జరిగిన అన్యాయంపై ఎన్‌ఆర్‌ఐ వ్యాపారవేత్త చెన్నుపాటి వేణుమాధవ్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులను సంప్రదించాడు.

ట్యాపింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు తనను కూడా బెదిరించినట్టు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఉన్న నిందితులు తనను గతంలో కిడ్నాప్‌ చేసి తన కంపెనీ షేర్లను బలవంతంగా బదలీ చేసుకున్నారని, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వారికి సహకరించారని ఫిర్యాదు చేశారు.

రాధాకిషన్‌రావుతో పాటు , గట్టుమల్లు, మల్లికార్జున్‌తో పాటు కృష్ణ, గోపాల్‌, రాజ్‌, రవి, బాలాజీ, చంద్రశేఖర్‌ వేగేతో పాటు మరికొందరిని నిందితులుగా పోలీసులు కేసు నమోదు చేశారు. తాను స్థాపించిన కంపెనీని బలవంతంగా బదలాయించిన వ్యవహారంలో పోలీసులతో పాటు తన కంపెనీలో నలుగురు డైరెక్టర్లకు సైతం లాభ పడ్డారని వేణుమాధవ్‌ ఫిర్యాదు చేశారు.

దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ సంస్థ ఎండీగా వ్యవహరించిన రాజశేఖర్‌ తలసిల, డైరెక్టర్లుగా ఉన్న గోపాలకృష్ణ సూరెడ్డి, నవీన్‌ యర్నేని, రవికుమార్‌ మందలపు, వీరమాచినేని పూర్ణచందర్‌రావులను నిందితుల జాబితాలో చేర్చారు. వీరంతా కలిసి ఉద్దేశపూర్వకంగా బెదిరింపులతో షేర్లను టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల సాయంతో బదిలీ చేసుకున్నారని గుర్తించారు.

డైరెక్టర్లకూ నోటీసులు ఇచ్చి వారిని విచారించేందుకు సిద్ధమవుతున్నారు. వేణుమాధవ్‌, చంద్రశేఖర్‌ వేగేల మధ్య ఆర్థికపరమైన విభేదాలతో ఇరువురు ఒకరిపై ఒకరు గతంలోపోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. చంద్రశేఖర్‌ మీద గతంలో పీడీ చట్టాన్ని ప్రయోగించారు. ఆ తర్వాత కోర్టు విచారణ క్రమంలో అడ్వైజరీ బోర్డు కొట్టేసింది.

జూబ్లీహిల్స్‌కు చెందిన ఎన్నారై వ్యాపారి చెన్నుపాటి వేణుమాదవ్‌ క్రియా హెల్త్‌ కేర్‌ను నెలకొల్పారు. అది లాభాలతో వృద్ధిలోకి వస్తున్న క్రమంలో టేకోవర్‌ చేసేందుకు సంస్థ డైరెక్టర్లు కొందరు ప్రముఖుల సాయంతో పథకం వేశారు. ఇందులో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

రాజకీయ ప్రముఖుల ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల సాయంతో వేణుమాధవ్‌ను కిడ్నాప్‌ చేసి కంపెనీని లాక్కున్నారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు 2018లో వేణుమాధవ్‌ను కిడ్నాప్‌ చేసి రూ.40 కోట్ల విలువ చేసే షేర్లను అక్రమంగా బదలాయించారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని రాధాకిషన్‌ రావు స్వయంగా బాధితుడిని బెదిరించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో టాస్క్‌ఫోర్స్‌ డీసీసీగా పనిచేసిన రాధాకిషన్‌రావు అరెస్టు కావడంతో వేణుమాదవ్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు.

వేణుగోపాల్‌ ఫిర్యాదుతో రాధాకిషన్‌రావు, అప్పటి టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ గట్టుమల్లు, ఎస్‌ఐ మల్లికార్జున్‌, గోల్డ్‌ఫిష్‌ సీఈవో చంద్రశేఖర్‌, క్రియా హెల్త్‌ కేర్‌ డైరెక్టర్లు గోపాల్‌, రాజ్‌, ‍యెర్నేని నవీన్‌, రవి, బాలాజీపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. దర్యాప్తులో నవీన్‌ ఎర్నేనితో పాటు మరికొందరి పాత్ర ఉన్నట్టు నిర్ధారణ అయ్యిందని పోలీసులు వివరించారు.

Whats_app_banner

సంబంధిత కథనం