Johnny master Case : జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్ట్.. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు సుమలత ఫిర్యాదు-a new twist in the case of johnny master who is accused of sexual assault ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Johnny Master Case : జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్ట్.. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు సుమలత ఫిర్యాదు

Johnny master Case : జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్ట్.. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు సుమలత ఫిర్యాదు

Basani Shiva Kumar HT Telugu
Sep 28, 2024 12:33 PM IST

Johnny master Case : జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. జానీ మాస్టర్ భార్య బాధితురాలిపై ఫిర్యాదు చేసింది. తనకు ఐదేళ్లు నరకం చూపించిందని ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పుడు ఈ ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ ఏం చేయబోతోందనే ఉత్కంఠ నెలకొంది.

జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్ట్
జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్ట్

జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. జానీ మాస్టర్‌పై కేసు పెట్టిన బాధితురాలపై.. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు జానీ మాస్టర్ భార్య సుమలత ఫిర్యాదు చేశారు. కొరియోగ్రాఫర్‌గా పని చేయడం కోసం.. తన భర్తను ట్రాప్ చేసి.. ప్రేమ పేరుతో పేధింపులకు గురి చేసిందని ఫిర్యాదులో ఆరోపించారు. ఐదు సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో చూపించిందని.. తాను ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు తీసుకెళ్లిందని ఆరోపించారు.

అటు జానీ మాస్టర్‌‌‌ను పోలీసులు ఇంటరాగేట్ చేశారు. లాయర్ సమక్షంలో జానీ మాస్టర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. కేసులో కీలమైన టెక్నికల్‌ ఎవిడెన్స్‌ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బాధితురాలి నుంచి రెండుసార్లు స్టేట్‌మెంట్లు రికార్డ్ చేసిన పోలీసులు.. ఇప్పుడు జానీ మాస్టర్‌ నుంచి సమాచారం రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

పోలీసుల విచారణలో జానీ మాస్టర్ కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. బాధితురాలు సమర్పించిన ఆధారాలను ముందుపెట్టి.. జానీ మాస్టర్‌ను పోలీసులు ప్రశ్నించినట్టు సమాచారం. అయితే.. బాధితురాలే తనను వేధించిందని జానీ మాస్టర్‌ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఒక షో సమయంలో బాధితురాలు తనకు తానే పరిచయం చేసుకున్నట్లు పోలీసులకు జానీ మాస్టర్ చెప్పినట్టు సమాచారం.

తనపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని జానీ మాస్టర్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. బాధితురాలు మైనర్‌గా ఉన్న సమయంలో తాను లైంగిక దాడి చేశానన్నది అబద్ధమని చెప్పినట్టు సమాచారం. కేవలం ఆ యువతి ట్యాలెంట్‌ను గుర్తించి.. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇచ్చినట్లు జానీ మాస్టర్ చెప్పినట్టు తెలిసింది. తనను పెళ్లి చేసుకోవాలని బాధితురాలే హింసించేదని.. ఈ విషయంలో చాలాసార్లు బెదిరింపులకు దిగినట్లు పోలీసు విచారణలో వెల్లడించారు. ఈ విషయాన్ని ఓ దర్శకుడికి కూడా చెప్పినట్టు జానీ మాస్టర్ పోలీసులకు చెప్పారని సమాచారం.