కాళ్ల వాపులు అంటే ఎక్కువ సందర్భాల్లో మోకాలి కింద భాగంలో వచ్చే వాపులుగా భావించాలి.

By Bolleddu Sarath Chandra
Dec 17, 2024

Hindustan Times
Telugu

చీలమండల వాపు, పాదం వాపు కూడా కాళ్ల వాపుల్లో భాగమే. కొందరిలో శరీరం మొత్తం వాపులు కూడా వచ్చే సందర్భాలు ఉంటాయి. 

కాలి పాదాలపై  వేళ్లతో నొక్కితే కొన్ని సార్లు గుంట పడుతుంది.

కాళ్ల వాపుల్లో సాధారణంగా ఎక్కువ సేపు నిలబడినా, కూర్చున్నా, ప్రయాణాలు చేసినా కాళ్ల వాపులు వస్తుంటాయి.

శరీరంలోని కొన్ని అవయవాలు సక్రమంగా పనిచేయక పోవడం వల్ల జబ్బుల బారిన పడటం వల్ల కూడా కాళ్ల నొప్పులు రావొచ్చు.

కొన్ని సార్లు కాళ్లను గట్టిగా నొక్కినా గుంటలు పడవు

ఎక్కువ సేపు నిలబడటం, కూర్చునే వారిలో కాళ్ల వాపులు కనిపిస్తాయి.  ఇందులో కాళ్ల వాపులు తప్ప ఇంకేమి కనిపించవు. కొద్దిసేపు నడిచినా, కాళ్లు  ఎత్తులో పెట్టుకున్నా ఈ వాపులు తగ్గిపోతాయి

రోజుకు 30 నుంచి 60 నిమిషాల పాటు నడిచే వారికి  ఈ తరహా కాళ్ల వాపులు రావు. వాపులు వచ్చిన తర్వాత నడక అలవాటు చేసుకుంటే  ఇవి క్రమంగా తగ్గిపోతాయి. 

గుండె జబ్బులు ఉన్న వారిలో కూడా కాళ్ల వాపులు కనిపిస్తాయి.  గుండెలో కుడివైపు భాగం సక్రమంగా పనిచేయకపోతే శరీరం నుంచి గుండెకు చేరే రక్తాన్ని వచ్చిన రక్తాన్ని వచ్చినట్టు కుడి జఠరిక పుపుస ధమనికకు పంపలేదు. దీంతో కాళ్ల వాపులు వస్తాయి.

కాలేయం జబ్బులు బారిన పడిన వారిలో కూడా కాళ్ల వాపులు వస్తాయి.  లివర్ సిర్రోసిస్‌కు గురైన వారిలో పొట్టలోకి నీరు చేరుతుంది.  కాళ్ల వాపులు కూడా ఉంటాయి. 

మూత్ర పిండాల సమస్య ఉన్న వారిలో నిద్ర లేచిన వెంటనే ముఖం వాపు కనిపిస్తుంది.  ఇలాంటి వారిలో పొట్టలో నీరు కూడా చేరుతుంది.  కాళ్ల వాపులు కనిపిస్తాయి. 

రక్త హీనత సమస్య ఎదుర్కొంటున్న వారిలో కూడా కాళ్ల వాపులు ఉండొచ్చు.  

రక్తంలో మాంసకృతులు తగ్గినా కాళ్ల వాపులు వస్తాయి.

రక్త పోటు వల్ల  గుండె బలహీనమైతే కాళ్లవాపులు వస్తాయి. ఉప్పు ఎక్కువగా తీసుకునే వారిలో కూడా కాళ్ల వాపుల సమస్య ఎదురవుతుంది.

ఉప్పుతినడం తగ్గించడం, నిల్వ పచ్చళ్లను తినకపోవడం, కాళ్లను ఎత్తులో ఉంచి పడుకోవడం ద్వారా కాళ్ల వాపులు తగ్గించుకోవచ్చు. గుండె జబ్బులున్న వారు ఎత్తులో కాళ్లను పెట్టకూడదు. 

వ్యాయామం చేయడం ద్వారా ఈ సమస్యను అదిగమించవచ్చు. బరువు ఎక్కువగా ఉన్న వారు బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి.  ఎకకువ సేపు నిలబడటం, కూర్చోవడం చేయకూడదు. కొన్ని రకాల మందులు కూడా కాళ్ల వాపులకు దారి తీయవచ్చు. మూత్రం ఎక్కువగా చేసే మందుల వల్ల కూడా కాళ్ల వాపులు తగ్గించవచ్చు. 

ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒత్తిడి ప్రధానమైనది. ఈ సమస్యను అధిగమించడానికి దైనందిక జీవితంలో యోగా, వ్యాయామం వంటి పనులతో పాటు కొన్ని గ్రహాల అనుకూలత కూడా అవసరమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.  

Pixabay