MahaChandiDevi: మహాచండీ దేవి అలంకారంలో కనకదుర్గమ్మ.. దేవీ శరన్నవరాత్రుల్లో ఐదో రోజు ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు-kanakadurgamma in mahachandi devi alankaram ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mahachandidevi: మహాచండీ దేవి అలంకారంలో కనకదుర్గమ్మ.. దేవీ శరన్నవరాత్రుల్లో ఐదో రోజు ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

MahaChandiDevi: మహాచండీ దేవి అలంకారంలో కనకదుర్గమ్మ.. దేవీ శరన్నవరాత్రుల్లో ఐదో రోజు ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

Bolleddu Sarath Chandra HT Telugu
Oct 07, 2024 05:00 AM IST

MahaChandiDevi: ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా 5వ రోజైన సోమ‌వారం ఆశ్వ‌యుజ శుద్ధ పంచమి నాడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ మహా చండీ దేవిగా ద‌ర్శ‌న‌మిస్తుంది. ఈ ఏడాది కూడా శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో చండీ దేవి అలంక‌ర‌ణ ప్ర‌త్యేకం కానుంది.

మహాచండీ దేవి అలంకారంలో కనకదుర్గ అమ్మవారు.
మహాచండీ దేవి అలంకారంలో కనకదుర్గ అమ్మవారు.

MahaChandiDevi:జ‌గ‌జ్జ‌న‌నీ అయిన దుర్గామాత ఈ రోజున ఒక మెరుపు మెరిస్తే ఎంత వెలుగుగా ఉంటుందో అంత‌టి తేజోమ‌య‌మైన రూపంతో.. సింహం భుజ‌ముల‌పై భీష‌ణంగా కూర్చొని త‌న ఎనిమిది చేతుల యందు వివిధ ర‌కాల ఆయుధాల‌ను ద‌రించి, రాక్ష‌స సంహారం గావించి లోక క‌ళ్యాణం జ‌రిపించిన దివ్య‌మైన రూపంతో భ‌క్తుల‌ను బంగారు రంగు చీరలో సాక్షాత్క‌రిస్తుంది. ఈ రోజున చండీ పారాయ‌ణం, చండీ యాగం చేస్తారు. చండీ దేవిగా ద‌ర్శ‌న‌మిచ్చే జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు ఈ రోజున నైవేద్యంగా తెల్ల నువ్వులు కలిపిన బెల్లం పొంగలి, వడలు నివేదిస్తారు.

శరన్నవరాత్రుల్లో ఐదోరోజు అమ్మవారిని మంగళచండీదేవిగా అలంకరిస్తారు. ఈ మంగళ చండీ ఎవరు అనంటే? దేవీభాగవతం లోని తొమ్మిదో స్కంధంలో నారాయణఋషి, నారదుడితో ఇలాచెప్తాడు. “ఓ నారదా మంగళం అంటే శుభప్రదమైనది, చండీ అంటే ప్రతాపవంతమైనదని, మంగళచండీ అంటే శుభప్రదమైన ప్రతాపమూర్తి అని అర్థం.

సర్వకార్యాల్లో మనకి మంగళాన్ని చేకూర్చేది కాబట్టే ఈమె మంగళచండిక అయ్యింది. పూర్వం ఈ చండీదేవి, మనువంశానికి చెందిన మంగళుడు అనేరాజుచేత మొదటిసారిగా పూజించబడినందున ఈమె మంగళ చండీ అని ప్రసిద్ధిపొందింది.

మంగళోమన్యువంశశ్చ సప్తద్వీపధరాధిపతిః తస్యపూజ్యాం భీష్టదేవీ తేనమంగళ చండికా|| మూర్తిభేదేన సాదుర్గా మూలప్రకృతిరీశ్వరీ| కృపారూపాయితి ప్రత్యక్షా యోషితా మిష్టదేవతా|| ప్రధమేపూజితాసాచ శంకరేణ పరాత్పరా॥ తిపురస్యవధేఘోరే విష్ణునాప్రేరితేన చ ||

అటువంటి ఈ చండీదేవి ఎవరోకాదు సాక్షాత్తు మూలప్రకృతి దుర్గాదేవి అపరస్వరూపమే, స్త్రీలందరికీ ఆరాధ్యనీయురాలైన ఈ దేవిని విష్ణుమూర్తి ప్రేరణవల్ల మొదటిసారి ఆ పరమేశ్వరుడు త్రిపురాసుర సంహార సమయంలో ప్రార్థించి ఆ తల్లి అనుగ్రహంతో త్రిపురాసురుణ్ణి యుద్ధంలో సంహరించి, త్రిపురాంతకుడయ్యాడు'. ఇలా తన భక్తులందరికీ మంగళాన్ని ప్రసాదించే తల్లి ఈ మంగళచండిక.

ఆమెని పూజిస్తే సకలశుభాలు జరుగుతాయని” నారాయణముని చెప్తాడు. ఇలా మంగళాన్ని సౌభాగ్యాన్ని ప్రసాదించే దుర్గాదేవి అపర అవతారమైన మంగళ చండీదేవిని దసరాఉత్సవాల్లో దర్శించి ఆ తల్లిని “సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే" అని భక్తిగా ప్రార్థించి, ఆ దేవి దివ్య స్వరూపాన్ని ఈవిధంగా ధ్యానించండి.

"సుమంగళీ సుఖకరీ సువేషాఢ్యా సువాసినీ"

దేవీషోడశ వర్షీయాంశశ్వత్సుస్థిరయౌవనాం

బింబోష్టీంసుదతీం శుద్ధాం శరత్పద్మనిభాననమ్॥

శ్వేతచంపకవర్ణాభాం సునీలోత్పలలోచనామ్

జగద్ధాత్రీంచదాత్రీంచ సర్వేభ్యః సర్వసంపదా॥

ఓం శ్రీ మంగళచండీ దేవతాయైనమః అంటూ అమ్మవారిని ధ్యానించాలి.

Whats_app_banner