Hibiscus Flowers: పూజలో వాడిన మందార పూలను పడేయకండి, వాటిని ఇలా అందానికి, ఆరోగ్యానికి వాడండి
Hibiscus Flowers: నవరాత్రులలో దుర్గాదేవి పూజలో మందార పువ్వులను ఖచ్చితంగా సమర్పించాలి. అయితే అలా సమర్పించిన పూలను పడేయాల్సిన అవసరం లేదు. వాటిని మీ ఆరోగ్యానికి, అందానికి వినియోగించుకోవచ్చు.
పూజలో పువ్వులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మందార పువ్వు దుర్గాదేవికి చాలా ప్రియమైనది. నవరాత్రులలో 9 రోజుల పూజలో మందార పువ్వు ఖచ్చితంగా సమర్పించేవారు ఎంతో మంది. పూజ పూర్తయ్యాక ఎన్నో మందార పూలను బయట పడేస్తారు. నిజానికి వాటిని వినియోగించుకుని, ఆరోగ్యాన్ని అందాన్ని పెంచుకోవచ్చు. ఈ మందార పువ్వులను విసిరే బదులు అనేక విధాలుగా ఎలా వాడుకోవాలో తెలుసుకోండి.
మందార పువ్వులు ఔషధంతో సమానమైనవి. దీనిని అందం నుండి ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. మందారం యొక్క పాత పువ్వులను ఎలా తిరిగి ఉపయోగించాలో తెలుసుకోండి.
మందార పూలు మాల్చేసి కుటుంబానికి చెందిన మొక్కలు. ఇవి మనదేశంతో పాటూ చైనా, మలేషియా, సూడాన్ వంటి వేడి ఉష్ణ మండల దేశాల్లోనే కనిపిస్తాయి. మందార పూలే కాదు ఆ చెట్టులోని ప్రతి భాగంలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.
ఎన్నో ఆయుర్వేద ఔషధాల తయారీలో కూడా మందార చెట్టుకు సంబంధించిన భాగాలను వాడతారు. వాటిలో కాల్షియం, ప్రొటీన్, రాగి, మెగ్నీషియం, ఇనుము, జింక్, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ కె వంటి పోషకాలు ఉంటాయి.
మందార పూవుల్లో యాంటీ మైక్రోబయల్, యాంటీ జెనోటాక్సిక్, యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చాలా ఎక్కువ. ఇది చర్మాన్ని సంరక్షిస్తుంది. ఎన్నో అనారోగ్యాలను తగ్గిస్తుంది.
మందార పువ్వు టీ
మందార పువ్వుతో తయారు చేసిన టీ అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వాడేసిన మందారపూలను ఎండబెట్టి పొడి చేసుకుని దాచుకోండి. ప్రతిరోజూ ఒకసారి ఆ పొడితో టీ తయారు చేసి తాగితే ఎంతో మంచిది. శరీరం తేమ వంతంగా ఉండేందుకు, పొట్టలో చికాకు వంటివి రాకుండా అడ్డుకునేందుకు, రక్త ప్రసరణ సమస్యలు రాకుండా, శ్వాస సమస్యలు తగ్గించేందుకు ఎంతో ఉపయోగపడుతుంది.
జుట్టుకు
జుట్టు మృదువుగా, మెరిసిపోవాలంటే మందార పువ్వుతో మాస్క్ తయారు చేసుకుని జుట్టుకు అప్లై చేయాలి. ఇది జుట్టును సిల్కీగా, మృదువుగా చేస్తుంది. మందార పూల మాస్క్ తయారు చేయడానికి పువ్వులను గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఆ పేస్టులో పెరుగు, ఉసిరి పొడి కలపాలి. ఈ పేస్ట్ ను జుట్టుకు పట్టిస్తే వెంట్రుకల మూలాలు బలంగా మారుతాయి.
మందార ఫేస్ మాస్క్
మందార పూలతో ఫేస్ మాస్క్ లు తయారు చేసుకోవచ్చు. మందార పువ్వులను పేస్టులా చేసి అందులో తేనే కలుపుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇది ముఖానికి నేచురల్ గ్లో ఇవ్వడానికి సహాయపడుతుంది. చర్మంపై పొడిబారడం, మచ్చలు రావడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. మందారను పేస్ట్ లా చేసి పెరుగు లేదా తేనెలో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. దీనివల్ల చర్మం సహజంగా మెరిసిపోతుంది. మందారపూలను ఎండబెట్టి పొడిలా చేసి దాచుకుని… దాంతో అప్పుడప్పుడు ఫేస్ మాస్క్ పయత్నించవచ్చు.
మందారలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఎక్కువ. అతినీలలోహిత కిరణాల వల్ల చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది. కాలిన గాయాలు త్వరగా తగ్గేలా చేస్తుంది. చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. దీని వల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. సహజ సిద్ధమైన మెరుపును సంతరించుకుంటుంది.
మందార పూలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి పూజలో వాడిన పూలను పడేయకండి. వాటిని ఎండబెట్టి పొడి చేసి దాచుకుని... పైన చెప్పిన విధంగా వినియోగించుకోండి.
టాపిక్