ChatGPT: చాట్ జీపీటీ ఇక వాట్సాప్ లో కూడా.. కాల్ చేసి లేదా టెక్స్ట్ పంపి కూడా సమాచారం పొందవచ్చు..-chatgpt is now on whatsapp and it is just a call or text away heres everything you need to know ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Chatgpt: చాట్ జీపీటీ ఇక వాట్సాప్ లో కూడా.. కాల్ చేసి లేదా టెక్స్ట్ పంపి కూడా సమాచారం పొందవచ్చు..

ChatGPT: చాట్ జీపీటీ ఇక వాట్సాప్ లో కూడా.. కాల్ చేసి లేదా టెక్స్ట్ పంపి కూడా సమాచారం పొందవచ్చు..

Sudarshan V HT Telugu
Dec 19, 2024 06:51 PM IST

ChatGPT: చాట్ జీపీటీ ని ఇక వాట్సాప్ లో కూడా పొందవచ్చు. అంతే కాదు, కాల్ చేసి లేదా టెక్ట్స్ చేసి కావాల్సిన సమాచారం పొందవచ్చు. ఈ విషయాలను చాట్ జీపీటీ యాజమాన్య సంస్థ ఓపెన్ఏఐ వెల్లడించింది. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి..

చాట్ జీపీటీ ఇక వాట్సాప్ లో కూడా
చాట్ జీపీటీ ఇక వాట్సాప్ లో కూడా (Pexels)

ChatGPT: 1-800-చాట్ జీపీటీని ప్రవేశపెడ్తున్నట్లు ఓపెన్ఎఐ ప్రకటించింది. తన "12 డేస్ ఆఫ్ ఓపెన్ఎఐ" ఈవెంట్ లో 10 వ రోజును ఈ ప్రకటనతో ముగించింది. వినియోగదారులు ఇకపై ఏఐ చాట్ బాట్ ‘చాట్ జీపీటీ’ కి ఉచితంగా కాల్ లేదా టెక్స్ట్ చేసి అవసరమైన సమాచారం పొందవచ్చని వెల్లడించింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా చాట్ జీపీటీ వినియోగదారులకు మరింత అందుబాటులోకి రానుంది. అంటే యూజర్లు ఏ క్షణంలోనైనా చాట్ జీపీటీ (chatgpt) కి కాల్ చేసి ఏఐతో వాయిస్ సంభాషణలు జరిపి తమ సందేహాలకు సమాధానాలు రాబట్టుకుంటారు.

వాట్సాప్ లో కూడా చాట్ జీపీటీ

ఇది ఇకపై వాట్సాప్ (whatsapp) లో కూడా అందుబాటులో ఉండనుంది. అంటే, తమకు కావాల్సిన సమాచారం కోసం వినియోగదారులు చాట్ జీపీటీ యాప్ లేదా వెబ్ వెర్షన్ కు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ 1-800-చాట్ జీపీటీ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.

1-800-చాట్ జీపీటీ అంటే ఏమిటి?

1-800-చాట్ జీపీటీ అనేది ఒక కొత్త ప్రయోగాత్మక ఫీచర్. ఇది 1-800-242-8478 డయల్ చేయడం ద్వారా ఏఐ చాట్ బాట్ కు కాల్ చేయడానికి లేదా టెక్స్ట్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. వినియోగదారులు వివరణాత్మక వాయిస్ సంభాషణలను పొందవచ్చు. లేదా వాట్సాప్ లో చాట్ జీపీటీ కి సందేశాన్ని (టెక్స్ట్ ప్రాంప్ట్) పంపి, కావాల్సిన సమాచారం పొందవచ్చు.

అన్ని ఫోన్లకు ఈ సదుపాయం

1-800-చాట్ జీపీటీని ఏ ఫోన్ ద్వారానైనా డయల్ చేయవచ్చని ఓపెన్ ఏఐ లైవ్ స్ట్రీమ్ లో ఒక డెమో ద్వారా చూపించింది. వినియోగ పరంగా, ఓపెన్ఎఐ తన ఏఐ సాధనాన్ని అన్ని విధాలుగా అందుబాటులో ఉంచాలని మరియు దాని డెమోగ్రాఫిక్ పరిధిని విస్తరించాలని కోరుకుంటోంది. వృద్ధులు కూడా చాట్ జీపీటీతో వాయిస్ సంభాషణ చేసేటప్పుడు ఈ నంబర్ కు డయల్ చేసి తమ సందేహాలను తీర్చుకోవచ్చు. ఇప్పుడు వినియోగదారులు కాల్, టెక్స్ట్, యాప్, వెబ్ ద్వారా చాట్ జీపీటీ ని యాక్సెస్ చేయవచ్చు. ఇది కాకుండా, చాట్ జీపీటీ ని ఆపిల్ (apple) ఇంటెలిజెన్స్ ద్వారా ఐఫోన్ పరికరాలలో కూడా ఇంటిగ్రేట్ చేశారు.

1-800-చాట్ జీపీటీ లభ్యత

ప్రస్తుతానికి, 1-800-చాట్ జీపీటీ ని అమెరికా, కెనడాలలో ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ వెర్షన్ ను భారతదేశంతో సహా ఎంపిక చేసిన ప్రాంతాలలో విడుదల చేశారు. వినియోగదారులు ప్రతి నెలా 15 నిమిషాల వాయిస్ సంభాషణను ఉచితంగా పొందవచ్చు. వాట్సప్ లో రోజువారీ టెక్స్ట్ లేదా క్వైరీ లకు కూడా లిమిటేషన్స్ ఉంటాయి. అందువల్ల, ఈ ఫీచర్ ను అపరిమితంగా ఉపయోగించాలంటే చాట్ జీపీటీ ప్రో లేదా ప్లస్ సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలి.

Whats_app_banner