ChatGPT Pro : అత్యాధునిక ఏఐ ఫీచర్స్​తో చాట్​జీపీటీ ‘ప్రో’- అన్​లిమిటెడ్​ యాక్సెస్​ కావాలా?-chatgpt pro is here and it can think harder but openai will charge this much ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Chatgpt Pro : అత్యాధునిక ఏఐ ఫీచర్స్​తో చాట్​జీపీటీ ‘ప్రో’- అన్​లిమిటెడ్​ యాక్సెస్​ కావాలా?

ChatGPT Pro : అత్యాధునిక ఏఐ ఫీచర్స్​తో చాట్​జీపీటీ ‘ప్రో’- అన్​లిమిటెడ్​ యాక్సెస్​ కావాలా?

Sharath Chitturi HT Telugu
Dec 09, 2024 10:10 AM IST

చాట్​జీపీటీ ప్రో వర్షెన్​ని ఇటీవలే ఇండియాలోకి తీసుకొచ్చింది ఓపెన్​ఏఐ. కానీ ఇది కాస్త ఖరీదైన వ్యవహారమే! సబ్​స్క్రిప్షన్​ మోడల్​ యిన చాట్​జీపీని ప్రోని యాక్సెస్​ చేసుకావాలంటే రూ. నెలకు ఎంత ఖర్చవుతుందో తెలుసా?

అత్యాధునిక ఏఐ ఫీచర్స్​తో చాట్​జీపీటీ ‘ప్రో’
అత్యాధునిక ఏఐ ఫీచర్స్​తో చాట్​జీపీటీ ‘ప్రో’ (AFP)

నేటి టెక్​ యుగాన్ని చాట్​జీపీటీ ఎలా ఏలుతోందో మనందరికి తెలిసిందే. 2022లో తొలిసారి ప్రపంచానికి పరిచయమైన ఈ ఏఐ టూల్​.. ఇప్పుడు దాదాపు అన్ని రంగాల్లోకి ప్రవేశించింది. చాట్​జీపీటీ ఉచితమే అయినా, ఆ తర్వాత ఇండియాలో రూ. 1999 ధరకు చాట్​జీపీటీ ప్లస్​ని లాంచ్​ చేసింది సంస్థ. ఇక ఇప్పుడు కంపెనీ తన అడుగు ముందుకేసి చాట్​జీపీటీ ప్రోని ప్రవేశపెట్టింది. విషయం ఏంటంటే, దీనిని ఫ్రీగా యాక్సెస్​ చేయలేరు! ఇది చాలా ఖరీదైనదే అని చెప్పుకోవాలి. నెలకు 200 డాలర్లు అంటే దాదాపు రూ.17,000 చెల్లించి ఈ ప్రో వర్షెన్​ని వాడుకోవాల్సి ఉంటుంది. ధరకు తగ్గట్టుగానే ఇందులో అనేక కొత్త ఫీచర్స్​ వస్తున్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

చాట్​జీపీటీ 'ప్రో'లో కొత్తగా ఏముంది?

ఈ 200 డాలర్ల నెలవారీ సబ్​స్క్రిప్షన్ ద్వారా జీపీటీ-4ఓతో పాటు అత్యంత అధునాతన ఏఐ మోడల్ ఓపెన్​ఏఐ ఓ1కు అపరిమిత యాక్సెస్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రో సబ్​స్క్రిప్షన్​లో అడ్వాన్స్​డ్ వాయిస్ ఫీచర్లు, ఓ1 ప్రో మోడ్​కు యాక్సెస్ కూడా ఉన్నాయి. ఇది వినియోగదారులకు అధిక కంప్యూటేషనల్ పవర్​ని పొందడానికి అవకాశాన్ని ఇస్తుంది.

ఈ పెరిగిన గణన సామర్థ్యం నమూనా ఇంకా మెరుగ్గా ఆలోచించగలదని, సంక్లిష్ట సమస్యలకు పరిష్కారాలను అందించగలదని సంస్థ పేర్కొంది. భవిష్యత్తులో, ప్రో వర్షెన్​లో మరింత శక్తివంతమైన కంప్యూటింగ్ వనరులు, ఉత్పాదకత-కేంద్రీకృత అంశాలను కలిగి ఉంటుందని ఓపెన్ఎఐ పేర్కొంది.

రోజువారీ ఉత్పాదకతను పెంచడానికి రీసెర్చ్-గ్రేడ్ ఇంటెలిజెన్స్ అవసరమయ్యే పరిశోధకులు, ఇంజనీర్లు, నిపుణుల కోసం ఓపెన్ఎఐ చాట్​జీపీటీ ప్రోను ఒక సాధనంగా తీసుకొచ్చింది.

చాట్​జీపీటీ ప్రోని.. ఇతర వర్షెన్​తో పోల్చితే!

ఓపెన్ఏఐ ప్రకారం.. ఇప్పటివరకు ఉన్న వాటిల్లో అత్యంత ఇంటెలిజెంట్​ మోడల్​ ఈ చాట్​జీపీటీ ప్రో. సబ్​స్క్రిప్షన్​ ద్వారా యూజర్స్​కి అపరిమిత యాక్సెస్​ అందిస్తుంది. అత్యంత నమ్మదగిన రెస్పాన్స్​లను అందిస్తుంది. ముఖ్యంగా డేటా సైన్స్, ప్రోగ్రామింగ్, కేస్ లా అనాలసిస్ వంటి ప్రత్యేక విభాగాల్లో కచ్చితమైన, సమగ్రమైన రెస్పాన్సెస్​ని జనరేట్ చేయడానికి ఓ1 ప్రో మోడ్ ఉపయోగపడుతుంది. గణితం, సైన్స్, కోడింగ్ సహా పలు సబ్జెక్టుల్లో మెషిన్ లెర్నింగ్ బెంచ్ మార్క్​లలో ఓ1 ప్రో మోడ్ మెరుగైన పనితీరును కనబరిచిందని కంపెనీ పేర్కొంది.

చాట్ జీపీటీ ప్రో సబ్​స్క్రైబ్ చేసుకున్న యూజర్లు మోడల్ సెలెక్టర్ ద్వారా ఓ1 ప్రో మోడ్​ను యాక్సెస్ చేసుకోవచ్చు. ఏదేమైనా, ఇది కంప్యూట్-ఇంటెన్సివ్ మోడల్ కాబట్టి ప్రతిస్పందనలు ఎక్కువ సమయం పట్టవచ్చని గుర్తుపెట్టుకోవాలి. మోడల్ సమాధానాన్ని జనరేట్​ చేసేటప్పుడు వినియోగదారులు రెస్పాన్స్​ ఇండికేటర్​ని చూసి ఇంకెంత సమయం పడుతుందో తెలుసుకోవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం