ChatGPT : ఎలాన్​ మస్క్​ ఇండియాకి వస్తారా? చాట్​ జీపీటీ ‘సెర్చ్​’ ఏం చెప్పిందంటే..-we tested chatgpt search with a question on elon musk heres how it did ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Chatgpt : ఎలాన్​ మస్క్​ ఇండియాకి వస్తారా? చాట్​ జీపీటీ ‘సెర్చ్​’ ఏం చెప్పిందంటే..

ChatGPT : ఎలాన్​ మస్క్​ ఇండియాకి వస్తారా? చాట్​ జీపీటీ ‘సెర్చ్​’ ఏం చెప్పిందంటే..

Sharath Chitturi HT Telugu
Nov 03, 2024 09:28 AM IST

ఓపెన్ఎఐ చాట్​ జీపీటకి కొత్త శోధన విధుల సెట్ను జోడించింది, ప్రత్యేక ఉత్పత్తిని ప్రారంభించడానికి బదులుగా ఈ ఫీచర్ను చాట్బాట్లో ఇంటిగ్రేట్ చేయడానికి ఎంచుకుంది.

ఎలాన్​ మస్క్​పై చాట్​ జీపీటి ప్రశ్న..
ఎలాన్​ మస్క్​పై చాట్​ జీపీటి ప్రశ్న.. (File photo)

సెర్చ్ ఇంజిన్ స్పేస్​లో దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న గూగుల్​కి పోటీగా ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ సెర్చ్​ను విడుదల చేసింది. ఈ ఏఐ దిగ్గజం తన పాపులర్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ చాట్​ జీపీటీకి కొత్త సెర్చ్ ఫంక్షన్ల సెట్​ని తీసుకొచ్చింది. సపరేట్​ ప్రాడక్ట్​గా తీసుకురాకుండా, ఈ ఫీచప్​ని చాట్​బాట్​లోనే ఇంటిగ్రేట్ చేసింది.

చాట్​ జీపీటీ సర్చ్​ ఇంజిన్​ ‘వెబ్​ సోర్స్​ లింక్స్​తో సహా వేగంగా సమాధానాలు ఇవ్వగలుగుతుంది,’ అని ఓపెన్​ఏఐ చెబుతోంది. అయితే ఫలితాల కచ్చితత్వంపై ఇంకా సందేహాలు ఉన్నాయి.

HT.com చాట్ జీపీటీ సెర్చ్​ ఇంజిన్​ని వినియోగించింది. ఇది ఎలా స్పందించిందో ఇక్కడ తెలుసుకోండి..

టెస్టింగ్ చాట్ జీపీటీ..

ప్రశ్న: "ఎలాన్ మస్క్ భారత పర్యటన గురించి చెప్పండి."

చాట్ జీపీటీ సెర్చ్ స్పందనపై ఓ లుక్కేయండి..

"టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ భారత్ లో తన వెంచర్లను విస్తరించేందుకు ఆసక్తి చూపుతున్నారు. జూన్ 2023లో, ఆయన న్యూయార్క్​లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి, దేశంలో టెస్లా- స్టార్​లింక్​ సేవలను ప్రారంభించడానికి సానుకూలత వ్యక్తం చేశారు.

వీటిపై చర్చించేందుకు మస్క్ 2024 ఏప్రిల్​లో భారత్​లో పర్యటించాలని భావించారు. అయితే టెస్లా బాధ్యతలు చాలా ఎక్కువగా ఉండటంతో ఈ ఏడాది చివరికి రీషెడ్యూల్ చేయాలనే ఉద్దేశంతో ఆయన తన భారత పర్యటనను వాయిదా వేసుకున్నారు.

2024 అక్టోబర్​లో మస్క్​కి చెందిన స్టార్​లింక్​ శాటిలైట్ స్పెక్ట్రమ్ కేటాయింపులకు సంబంధించి భారత్​లో రెగ్యులేటరీ సవాలును ఎదుర్కొంది. భారత టెలికాం దిగ్గజాలు ముకేశ్ అంబానీ, సునీల్ భారతీ మిట్టల్ వేలం ఆధారిత కేటాయింపులను సమర్థించగా, మస్క్ అంతర్జాతీయ పద్ధతులకు అనుగుణంగా పరిపాలనా కేటాయింపులకు పిలుపునిచ్చారు. కాగా స్పెక్ట్రమ్​ని పరిపాలనాపరంగా కేటాయించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్యను మస్క్ స్వాగతించారు.

నవంబర్ 2024 నాటికి, నిర్దిష్ట కాలపరిమితి ధృవీకరించనప్పటికీ, మస్క్ కంపెనీలు భారతదేశంలో అవకాశాలను అన్వేషిస్తూనే ఉన్నాయి. ఇది సమీప భవిష్యత్తులో భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి నిబద్ధతను సూచిస్తుంది," అని చాట్​ జీపీటీ సెర్చ్​ ఇంజిన్​ చెప్పింది.

చాట్ జీపీటీ సెర్చ్ వర్సెస్ గూగుల్ సెర్చ్..

గూగుల్ సెర్చ్​లో అదే ప్రాంప్ట్ ను ఉపయోగించింది HT.com. అది కూడా ఇదే విధమైన సమాధానాన్ని ఇచ్చింది. ఎలన్ మస్క్ ఏప్రిల్​లో తన భారత పర్యటనను రద్దు చేసుకున్నారని చెప్పింది.

చాట్ జీపీటీ.. సెర్చ్ యూజర్లు అడిగే వాటి ఆధారంగా వెబ్​లో వెతకడానికి ఎంచుకుంటుందని, సంబంధిత వెబ్ సోర్సెస్​కు లింక్​లతో వేగవంతమైన, సకాలంలో సమాధానాలు ఇస్తుందని శామ్ ఆల్ట్ మన్ నేతృత్వంలోని ఓపెన్ ఏఐ తెలిపింది.

ఇంటర్నెట్ నుంచి సమాచారాన్ని రియల్ టైమ్ యాక్సెస్ చేసే ఏఐ ఆధారిత సెర్చ్ ఇంజిన్ ప్రోటోటైప్ సెర్చ్ జీపీటీని జులైలో కంపెనీ ప్రారంభించింది.

 

Whats_app_banner