Highest Paid Heroine: ఒక్క సినిమాకే రూ.600 కోట్ల రెమ్యునరేషన్.. ప్రపంచంలోనే అత్యధిక మొత్తం అందుకున్న ఈ హీరోయిన్ తెలుసా?
Highest Paid Heroine: ప్రపంచంలోనే అత్యధిక మొత్తం రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె ఒకే ఒక్క సినిమాకు ఏకంగా 70 మిలియన్ డాలర్లు సంపాదించడం విశేషం. ఈ మూవీలో నటించిన హీరో కంటే కూడా రెట్టింపు ఈ హీరోయిన్ సొంతమవడం విశేషం.
Highest Paid Heroine: హీరో కంటే హీరోయిన్ రెమ్యునరేషన్ తక్కువగా ఉండటం అనేది సాధారణమే. ఇప్పటికీ దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. మన దగ్గర హీరో తీసుకునే రెమ్యునరేషన్ లో పది శాతం కూడా హీరోయిన్ కు దక్కదు. కానీ హాలీవుడ్ కు చెందిన సాండ్రా బుల్లాక్ మాత్రం ప్రపంచంలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్ గా నిలవడం విశేషం. ఆమె ఒక్క సినిమాకే ఏకంగా 70 మిలియన్ డాలర్లు (ఇప్పటి విలువతో పోలిస్తే సుమారు రూ.600 కోట్లు) అందుకుందంటే నమ్మగలరా?
గ్రావిటీ మూవీ కోసం రికార్డు రెమ్యునరేషన్
2013లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ గ్రావిటీ. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఓ స్పేస్ స్టేషన్ ను రిపేర్ చేసే క్రమంలో గ్రహ శకలాలు అందులోని ఆస్ట్రోనాట్లను ఎలా చెల్లాచెదురు చేస్తాయన్నదే ఈ సినిమా స్టోరీ. ఈ మూవీలో సాండ్రా బుల్లాక్, జార్జ్ క్లూనీ నటించారు. జార్జ్ క్లూనీ హాలీవుడ్ లో ఓ టాప్ యాక్టర్. కానీ ఈ సినిమా కోసం అతని రెమ్యునరేషన్ కంటే రెట్టింపు మొత్తం సాండ్రాకు దక్కింది. మూవీ కోసం మొదట్లోనే 20 మిలియన్ డాలర్లు ఆమెకు చెల్లించారు. ఇది కాకుండా సినిమాకు వచ్చిన లాభాల్లోనూ 15 శాతం వాటా దక్కేలా ఆమె ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 730 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. లాభాల్లో 15 శాతం వాటాగా సాండ్రాకు మరో 50 మిలియన్ డాలర్లు దక్కాయి. అంటే మొత్తంగా ఒక్క సినిమాకు 70 మిలియన్ డాలర్లు ఆమె సొంతమయ్యాయి. 2013లో డాలర్ తో రూపాయి విలువ ప్రకారం చూసుకున్నా.. ఈ మొత్తం విలువ సుమారు రూ.395 కోట్లు కాగా.. తాజాగా రూపాయి విలువ ప్రకారం సుమారు రూ.600 కోట్లు కావడం గమనార్హం. ఇదే సినిమా కోసం జార్జ్ క్లూనీ అందుకున్న మొత్తం 35 మిలియన్ డాలర్లు మాత్రమే.
అత్యధిక రెమ్యునరేషన్ నటీమణులు
ప్రపంచంలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్లలో సాండ్రా బుల్లాక్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. ఆమె తర్వాత రెండో స్థానంలో మార్గట్ రాబీ తాను నటించిన బార్బీ మూవీ కోసం 50 మిలియన్ డాలర్లు అందుకుంది. అంటే సాండ్రా కంటే 20 మిలియన్ డాలర్లు తక్కువే.
ఇక మూడో స్థానంలో కామెరాన్ డయాజ్ ఉంది. ఆమె బ్యాడ్ టీచర్ మూవీ కోసం 42 మిలియన్ డాలర్లు సంపాదించింది. హాలీవుడ్ లో ఒక సినిమా కోసం మిలియన్ డాలర్లు వసూలు చేసిన తొలి హీరోయిన్ ఎలిజబెత్ టేలర్. ఆమె 1963లో వచ్చిన క్లియోపాత్రా సినిమా కోసం అప్పట్లో ఈ కళ్లు చెదిరే మొత్తాన్ని అందుకుంది.
టాపిక్