Zomato: 10 రూపాయల వాటర్ బాటిల్ ను రూ.100కు అమ్ముతారా?.. జొమాటోపై టెక్కీ ఆగ్రహం; జొమాటో ఇలా స్పందించింది-techie accuses zomato of selling rs 10 water bottle for rs 100 company responds ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Zomato: 10 రూపాయల వాటర్ బాటిల్ ను రూ.100కు అమ్ముతారా?.. జొమాటోపై టెక్కీ ఆగ్రహం; జొమాటో ఇలా స్పందించింది

Zomato: 10 రూపాయల వాటర్ బాటిల్ ను రూ.100కు అమ్ముతారా?.. జొమాటోపై టెక్కీ ఆగ్రహం; జొమాటో ఇలా స్పందించింది

Sudarshan V HT Telugu
Dec 19, 2024 08:03 PM IST

Zomato: వాటర్ బాటిల్స్ కోసం జొమాటో అధిక ఛార్జీలు వసూలు చేస్తోందని ఆరోపిస్తూ ఒక టెక్కీ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. అంతేకాదు, ఆ పోస్ట్ కు స్పందనగా జొమాటో ఇచ్చిన సమాధానం కూడా చాలా మందికి రుచించలేదు. ఈ పోస్ట్ పై నెటిజన్ల స్పందనను చూడండి..

10 రూపాయల వాటర్ బాటిల్ ను రూ.100కు అమ్ముతారా?
10 రూపాయల వాటర్ బాటిల్ ను రూ.100కు అమ్ముతారా? (X/@indyan)

Zomato: ఒక ఈవెంట్ లో అధిక ఛార్జీలు వసూలు చేశారంటూ ఓ టెక్కీ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రూ.10 వాటర్ బాటిళ్లను రూ.100కు విక్రయిస్తున్న జొమాటోపై ఆ ఎక్స్ యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రెండు వాటర్ బాటిల్స్ కు తనకు వేసిన బిల్లును, బాటిల్ పై ఉన్న ఎంఆర్పీని కూడా ఆయన షేర్ చేశారు. ఈ పోస్ట్ కు జొమాటో నుంచి స్పందన వచ్చింది.

రూ. 10 బాటిల్ రూ. 100 కా?

సొంత బాటిళ్లు తీసుకురావడానికి ఎవరికీ అనుమతి లేని ఆ ఈవెంట్ లో రూ.10 ధర కలిగిన వాటర్ బాటిల్ ను రూ.100కు జొమాటో విక్రయిస్తోందని పల్లబ్ దే అనే ఎక్స్ యూజర్ తెలిపారు. అంత అత్యధిక ధరలకు ఎలా విక్రయిస్తారని ప్రశ్నించారు. ఎక్స్ యూజర్ రెండు వాటర్ బాటిల్స్ కోసం ఎంత చెల్లించారో ఒక ఫొటోను కూడా షేర్ చేశాడు. తన పోస్ట్ కు తెలంగాణ హైకోర్టు న్యాయవాదిని ట్యాగ్ చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.

జొమాటో ఎలా స్పందించింది?

ఈ పోస్ట్ కు సంబంధించిన కామెంట్స్ సెక్షన్ లో జొమాటో స్పందించింది. "హాయ్ పల్లాబ్, మీ అనుభవానికి క్షమించండి. మేము ఈవెంట్ ఆర్గనైజర్లం కాదు. మేం టికెటింగ్ భాగస్వామి మాత్రమే. అయినప్పటికీ, మేము మీ ఫీడ్ బ్యాక్ ను గమనించాము. మా స్వంత ఈవెంట్లను ముందుకు తీసుకెళ్లడానికి ఇది మాకు సహాయపడుతుంది" అని కంపెనీ సమాధానం ఇచ్చింది. ఆ ఈవెంట్ ను ఈవా లైవ్ అనే సంస్థ ఆర్గనైజ్ చేసింది. ఆ సంస్థను కూడా పల్లబ్ దే ట్యాగ్ చేశారు. తాను కొనుగోలు చేసిన బాటిల్ పై ఉన్న ఎంఆర్పీ ఫొటోను కూడా షేర్ చేశాడు. బాటిల్ పై ఎంఆర్పీ రూ.10 గా ఉంది.

సోషల్ మీడియా స్పందన

ఈ పోస్ట్ కు నెటిజన్లు (social media)చాలామంది స్పందించారు. చాలా మంది టెక్కీకి మద్దతుగా కామెంట్ చేయగా, మరికొందరు జొమాటో (ZOMATO) పై విమర్శలు గుప్పించారు. మరికొందరు సరదాగా కామెంట్స్ చేశారు. ‘‘ఇది పూర్తిగా దోపిడీ. ప్రతి ఒక్కరూ ఈ వ్యక్తులకు వ్యతిరేకంగా గళం విప్పాలి" అని ఒక యూజర్ స్పందించాడు. ‘‘బాటిల్ పై ఎమ్మార్పీ రూ.10 ఉంటే వారిపై కేసు వేయండి’’ అని మరొకరు సూచించారు. "వారు రాత్రికి రాత్రే ఎంఆర్పి నిర్వచనాన్ని గరిష్ట స్థాయి నుండి కనీస రిటైల్ ధరకు మారుస్తారు" అని మూడవ వ్యక్తి చమత్కరించాడు. బాటిల్ పై ఎంఆర్పీని రూ.100 గా మార్చడం వారు మర్చిపోయారని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. మరో వ్యక్తి ఇలా రాశాడు, "మీకు దాహం వేసినప్పుడు, మీ పర్సు ఖాళీ అవుతుంది!"

ఎమ్మార్పీ అంటే ఏమిటి?

MRP అంటే గరిష్ట రిటైల్ ధర, ఇది భారతదేశంలో వినియోగదారులకు ఒక ఉత్పత్తిని, పన్నులతో సహా, విక్రయించగల అత్యధిక ధర. విక్రయదారుడు ఎంఆర్పీకి మించి ధరను వసూలు చేయరాదు. ఎంఆర్పీని ఉత్పత్తి ప్యాకేజింగ్ పై ముద్రించాలి. రిటైలర్లు ఎమ్మార్పీ కంటే ఎక్కువ వసూలు చేయలేరు. అలా చేస్తే అది చట్టం ప్రకారం నేరమవుతుంది.

Whats_app_banner