తెలుగు న్యూస్ / ఫోటో /
iOS 18.2 : ఈ వారమే ఐఓఎస్ 18.2 విడుదల.. ఇక ఏఐ టూల్స్‌తో ఐఫోన్ యూజర్ల రచ్చ రచ్చే!
iOS 18.2 Release : ఐఫోన్ యూజర్లు ఏఐ టూల్స్‌తో ఇక రచ్చ రచ్చ చేయనున్నారు. ఎందుకంటే పవర్‌ఫుల్ ఐఓఎస్ 18.2 అప్డేట్ వస్తుంది.
(1 / 5)
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)కి ప్రాధాన్యమిస్తూ అద్భుతమైన కొత్త ఫీచర్లను తీసుకొస్తూ ఐఓఎస్ 18.2 ఈ వారంలో విడుదల కానుంది. అధికారిక విడుదల తేదీని ధృవీకరించనప్పటికీ ఇది డిసెంబర్ 12కు వస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఐఫోన్ వినియోగదారులు కొద్ది రోజుల్లోనే అప్డేట్‌ను ఆశించవచ్చు.(9to5Mac)
(2 / 5)
అధునాతన ఏఐ టూల్స్‌ను ఇంటిగ్రేట్ చేయడం ఐఓఎస్ 18.2 ప్రత్యేకత. ఏఐ టెక్నాలజీతో ఎమోజీలను సృష్టించడానికి, కస్టమ్ ఇమేజ్లను జనరేట్ చేసే సామర్థ్యాన్ని వినియోగదారులకు అందించనున్నారు. ఇమేజ్ ప్లేగ్రౌండ్ వంటి సాధనాలను ప్రవేశపెట్టడం ద్వారా అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఆపిల్ అడుగు వేస్తోంది.(Shaurya Sharma - HT Tech)
(3 / 5)
ఐఓఎస్ 18.2లో వచ్చే సూపర్ అప్‌గ్రేడ్‌లలో ఒకటి చాట్ జీపీటీని సిరితో కలపడం. అంతకుముందు ఏదైనా కావాలంటే హే సిరి అంటూ చెప్పేవాళ్లం. ఇప్పుడు దీనిని చాట్ జీపీటీ అనుసంధానిస్తారు. అంటే ఏదైనా కావాలంటే చాట్ జీపీటీని ఈ వాయిస్‌తో వాడుకోవచ్చన్నమాట. ఇది లోతుగా అధ్యయనం చేసి మరింత సమాచారం ఇస్తుంది.(Apple)
(4 / 5)
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్లతో పాటు ఐఓఎస్ 18.2 ఆపిల్.. ఫోటోలు, మెయిల్ మెరుగుదలను కూడా తెస్తుంది. ఈ అప్డేట్స్ వినియోగదారు ఇంటర్‌ఫేస్‌ను మెరుగుపరచనుంది. తాజా అప్డేట్‌తో రైటింగ్ టూల్స్ కూడా మెరుగవుతాయి. మెసేజస్ యాప్ లేదా నోట్స్‌లోని సంభాషణల ఆధారంగా ఇమేజ్ కూడా తయారుచేసుకోవచ్చు.
(5 / 5)
అంతేకాదు ఐఓఎస్ కొత్త అప్డేట్‌తో కెమెరా కంట్రోల్, వీడియో, యాపిల్ పే, శాటిలైట్ మెసేజస్, పాస్‌వర్డ్ మెనేజర్‌తోపాటుగా మరికొన్ని ఫీచర్లు మెరుగవుతాయి. కొత్త ఏఐ ఫీచర్లకు అవసరమైన అధునాతన హార్డ్‌వేర్ కారణంగా ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 16 మోడళ్లకు మాత్రమే ఐఓఎస్ 18.2 అందుబాటులో ఉంటుంది. మిగతావాటికి ఉండకపోవచ్చు.
ఇతర గ్యాలరీలు