Plastic bottle DIY: పాత ప్లాస్టిక్ బాటిల్స్ వాడి.. పనికొచ్చే వస్తువులు తయారు చేసేయండిలా-know how to reuse old plastic bottles for diy and decorative pieces ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Plastic Bottle Diy: పాత ప్లాస్టిక్ బాటిల్స్ వాడి.. పనికొచ్చే వస్తువులు తయారు చేసేయండిలా

Plastic bottle DIY: పాత ప్లాస్టిక్ బాటిల్స్ వాడి.. పనికొచ్చే వస్తువులు తయారు చేసేయండిలా

Koutik Pranaya Sree HT Telugu
Jul 15, 2024 12:30 PM IST

Plastic bottle DIY: మనందరి ఇళ్లలో ప్లాస్టిక్ బాటిళ్లు నిరుపయోగంగా పడి ఉంటాయి. ఈ ప్లాస్టిక్ బాటిల్స్ వాడి ఉపయోగపడే వస్తువులను ఎలా తయారు చేయాలో తెల్సుకోండి.

ప్లాస్టిక్ బాటిళ్లతో డీఐవై
ప్లాస్టిక్ బాటిళ్లతో డీఐవై (shutterstock)

ప్రతి ఇంట్లో ఎన్నో కొన్ని ప్లాస్టిక్ బాటిళ్లు ఉంటాయి. కూల్ డ్రింక్స్ లేదా వాటర్ బాటిల్స్ ఉపయోగించిన తరువాత,వాటిని చెత్తలో పడేస్తారు. కానీ ఇప్పటి నుంచి అలా పడేయకుండా భద్రపర్చండి. వాటికి మంచి రూపం ఇచ్చి పనికొచ్చే వస్తువులు తయారు చేయొచ్చు. శ్రావణ మాసం తొందర్లో మొదలవబోతుంది. ఇల్లు మొత్తం శుభ్రం చేయడం ఇప్పటికే మొదలుపెట్టి ఉంటారు. అప్పుడు గానీ పాత సీసాలు ఏమైనా దొరకితే వాటిని పక్కన పెట్టండి. వాటిని ఎలా ఉపయోగించాలో తెల్సుకోండి.

yearly horoscope entry point
పిగ్గీ బ్యాంక్
పిగ్గీ బ్యాంక్ (pinterest)

పిగ్గీ బ్యాంక్:

ప్లాస్టిక్ బాటిల్ ను అడ్డంగా చూడండి. అచ్చం పిగ్గీ బ్యాంక్ ఆకారం ఉంటుంది. అందుకే దానికి మంచి గులాబీ రంగుతో పెయింట్ వేసి, మధ్యలో పై వైపున డబ్బులు వేసుకునేలా ఒక గాటు పెట్టండి. పిగ్గీ బ్యాంక్ రెడీ.

పూల కుండీలు:

ఇంట్లో ఉండే పచ్చని మొక్కలు ఇంటి అందానికి జీవం పోస్తాయి. మొక్కలు నాటేందుకు మార్కెట్ నుంచి ఖరీదైన కుండీలు కొంటున్నాం. ఆ ఖర్చు అక్కర్లేకుండా ప్లాస్టిక్ సీసాలనే సగం కట్ చేసి కుండీల్లాగా వాడుకోవచ్చు. దీంట్లో అందమైన మొక్కలు నాటి బాల్కనీలో, గార్డెన్ లో, ఇంట్లోనూ పెట్టుకోవచ్చు.

బాటిల్ ను సగానికి కట్ చేసి పైన కాస్త అగ్గిపుల్లతోనో, లైటర్ తోనే కాల్చినట్లు చేస్తే దానికుండే పదును పోతుంది. దానికి మంచి రంగులు, బొమ్మలు వేసి అందులో మట్టి నింపి మొక్కలు పెట్టేయండి చాలు. పిల్లలకు అయితే ఇది మంచి యాక్టివిటీ అవుతుంది.

మొక్కలకు నీల్లు పోయడానికి:

ఆరుబయట మొక్కలకు కాస్త నీళ్లు ఎక్కువగా పోస్తాం. కానీ ఇంటి లోపల మొక్కలు పెంచుకుంటే వాటిలో ఎక్కువగా నీళ్లు పోస్తే కారిపోయి ఇల్లు అశుభ్రంగా అవుతుంది. దానికోసం బాటిల్ మూతకు చిన్న చిన్న రంధ్రాలు చేస్తే చాలు. దీంతో నీళ్లు పోస్తే కొద్ది కొద్దిగా పడతాయి. వాటర్ క్యాన్ రెడీ అయినట్లే.

టేబుల్ స్టాండ్:

ఇంట్లో పెన్నులు, పెన్సిళ్లు పెట్టడానికి, తాళాలు, మేకప్ బ్రష్ లు లాంటివి ఉంచడానికి ప్లాస్టిక్ బాటిల్ తో స్టాండ్ లాగా చేయొచ్చు. బాటిల్ ను 1/3 నిష్పత్తిలో కత్తిరించండి. దానికి మంచి పెయింటింగ్ వేయండి. మీ పిళ్లల టేబుల్ మీద పెట్టేట్లయితే దానికి మీ పిల్లలతోనే పెయింటింగ్ వేయించండి. దాంతో వాళ్ల వస్తువులను అందులో చక్కగా పెట్టుకోవాలనే ఆసక్తి కూడా పెరుగుతుంది.

Whats_app_banner