NTA CMAT 2025: సీ మ్యాట్ 2025 నోటిఫికేషన్ విడుదల.. డిసెంబర్ 13 వరకు దరఖాస్తుల స్వీకరణ
NTA CMAT 2025: దేశంలోని ప్రతిష్టాత్మక మేనేజ్‌మెంట్ విద్యాసంస్థలో ప్రవేశాల కోసంమ్యాట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది.నవంబర్ 14 నుంచి డిసెంబర్ 13వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. సీమ్యాట్ 2025 స్కోర్ ద్వారా దేశంలో ఐఐఎంలతో పాటు ప్రతిష్టాత్మక మేనేజ్‌మెంట్ విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
NTA CMAT 2025: ఐఐఎంలు సహా దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే మ్యాట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఏఐసిటిఇ గుర్తింపు పొందిన విద్యా సంస్థలతో పాటు యూనివర్శిటీలు, అనుబంధ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు మ్యాట్ స్కోర్‌ను పరిగణలోకి తీసుకుంటారు.
2025 సీ మ్యాట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా నిర్వహిస్తారు. ఇందులో క్వాంటియేటివ్ టెక్నిక్స్, లాజికల్ రీజనింగ్, లాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్ వంటి సామర్ధ్యాలను పరీక్షిస్తారు. 2025-26 విద్యా సంవత్సరంలో మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం సీ మ్యాట్ నిర్వహిస్తున్నారు. సీమ్యాట్ నిర్వహణలో పాల్గొంటున్న విద్యా సంస్థలు ప్రవేశాలకు సీ మ్యాట్ స్కోర్‌ను పరిగణలోకి తీసుకుంటాయి.
సీ మ్యాట్ 2025 స్కోర్ ఆధారంగా అయా విద్యా సంస్థల్లో వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దేశంలోని ప్రతిష్టాత్మక మేనేజ్‌మెంట్ విద్యా సంస్థలు కట్‌ఆఫ్ స్కోర్ విడివిడిగా నిర్ణయిస్తాయి. అయా విద్యా సంస్థల్లో ప్రవేశాలు కోరుకునే విద్యార్థులు నిర్దేశిత స్కోర్ సాధించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అయా విద్యా సంస్థల ప్రమాణాలకు అనుగుణంగా అర్హతలను పూర్తి చేయాల్సి ఉంటుంది. గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూల ద్వారా ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ముఖ్యమైన తేదీలు...
- ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ నవంబర్ 14 నుంచి డిసెంబర్ 13వ తేదీ రాత్రి 9.50వరకు స్వీకరిస్తారు.
- దరఖాస్తు రుసుమును డిసెంబర్ 14వ తేదీ రాత్రి 11.50వరకు చెల్లించవచ్చు.
- దరఖాస్తులను డిసెంబర్ 15 నుంచి 17వరకు సరిచేసుకోవచ్చు.
- జనవరి 17వ తేదీన పరీక్షా కేంద్రాలను ప్రకటిస్తారు.
- 2025 జనవరి 25న మ్యాట్ 2025 పరీక్ష నిర్వహిస్తారు. మూడు గంటల పాటు మ్యాట్ పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయాన్ని తర్వాత ఖరారు చేస్తారు.
సీ మ్యాట్ ప్రవేశపరీక్ష కేవలం ఇంగ్లీష్‌లో మాత్రమే జరుగుతుంది. నోటిఫికేషన్ కోసం ఈ లింకును అనుసరించండి. https://exams.nta.ac.in/CMAT/
కామన్ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ పరీక్ష విధానం, అర్హతలు, ఇతర సమాచారం కోసం సీ మ్యాట్ 2025 ఇన్ఫర్మేషన్ బ్రోచర్ పరిశీలించండి. https://exams.nta.ac.in/CMAT/
దరఖాస్తుల స్వీకరణ...
కామన్ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2025 దరఖాస్తులు కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరిస్తారు. https://exams.nta.ac.in/CMAT/ లో మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న అన్ని నిబంధనల్ని అభ్యర్థులు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.
అభ్యర్థులు దరఖాస్తులో పేర్కొన్న మెయిల్ ఐడీ సొంతదై ఉండాలి లేదా పేరెంట్స్, గార్డియన్స్‌ది అయ్యుండాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పంపే అన్ని రకాల సమాచారం మెయిల్‌ఐడీలకు, రిజిస్టర్డ్ ఫోన్ నంబర్లకు మాత్రమే పంపుతారు.
సీ మ్యాట్ 2025పై అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా 011 40759000, 69227700 నంబర్లను సంప్రదించాల్సి ఉంటుంది. cmat@nta.ac.inకు మెయిల్ చేయవచ్చు.