2024 Top 10 Malayalam Movies OTT: ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్-10 మలయాళ చిత్రాలు ఇవే.. ఏ ఓటీటీల్లో చూడొచ్చు?-premalu to manjummal boys aavesham top 10 malayalam movies in 2024 and their ott streaming platforms ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  2024 Top 10 Malayalam Movies Ott: ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్-10 మలయాళ చిత్రాలు ఇవే.. ఏ ఓటీటీల్లో చూడొచ్చు?

2024 Top 10 Malayalam Movies OTT: ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్-10 మలయాళ చిత్రాలు ఇవే.. ఏ ఓటీటీల్లో చూడొచ్చు?

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 22, 2024 05:21 PM IST

2024 Top 10 Malayalam Movies OTT: ఈ ఏడాది మలయాళ ఇండస్ట్రీకి అదరగొట్టింది. ఓ ఇండస్ట్రీ హిట్ పడింది. మరిన్ని తక్కువ బడ్జెట్ చిత్రాలు బిగ్ హిట్స్ అయ్యాయి. ఈ ఏడాది కలెక్షన్లలో టాప్-10లో నిలిచిన మలయాళ చిత్రాలు ఏవంటే..

2024 Top 10 Malayalam Movies OTT: ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్-10 మలయాళ చిత్రాలు ఇవే.. ఏ ఓటీటీల్లో చూడొచ్చు?
2024 Top 10 Malayalam Movies OTT: ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్-10 మలయాళ చిత్రాలు ఇవే.. ఏ ఓటీటీల్లో చూడొచ్చు?

ఈ ఏడాది 2024 మలయాళ సినీ ఇండస్ట్రీకి చాలా బాగా కలిసి వచ్చింది. అదిరిపోయే హిట్‍లను మాలీవుడ్ చూసింది. తక్కువ బడ్జెట్‍తో వచ్చిన కొన్ని సినిమాలు ఆశ్చర్యపరిచేలా కలెక్షన్లు దక్కించుకున్నాయి. నేషనల్ వైడ్‍గా పాపులర్ అయ్యాయి. మంజుమ్మల్ బాయ్స్, ప్రేమలు సహా మరిన్ని చిత్రాలు అంచనాలకు మించి భారీ వసూళ్లు దక్కించుకున్నాయి. కొత్త రికార్డులు నెలకొన్నాయి. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్-10 మలయాళ సినిమాలు ఏవో.. ప్రస్తుతం ఏ ఓటీటీల్లో స్ట్రీమ్ అవుతున్నాయో ఇక్కడ తెలుసుకోండి.

మంజుమ్మల్ బాయ్స్

మంజుమ్మల్ బాయ్స్ సినిమా మలయాళ ఇండస్ట్రీలో కొత్త రికార్డులు సృష్టించింది. రూ.200 కోట్ల కలెక్షన్ల మార్క్ దాటిన తొలి మలయాళ మూవీగా చరిత్ర లిఖించింది. ఫిబ్రవరి 22న రిలీజైన ఈ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం మొత్తంగా సుమారు రూ.242 కోట్ల కలెక్షన్లు సాధించి ఆల్‍టైమ్ హిట్‍గా నిలిచింది. చిదంబరం దర్శకత్వంలో రూ.20కోట్ల బడ్జెట్‍తో రూపొందిన మంజుమ్మల్ బాయ్స్ భారీ బ్లాక్‍బస్టర్ అయింది. ఈ మూవీ డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.

ది గోట్ లైఫ్

పృథ్విరాజ్ సుకుమార్ ప్రధాన పాత్ర పోషించిన ‘ది గోట్ లైఫ్ - ఆడుజీవితం’ మూవీ రూ.160 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుంది. గల్ఫ్ దేశాల్లో జీవన పోరాటం చేసిన ఓ వ్యక్తి నిజ జీవితం ఆధారంగా బ్లెస్సీ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా ఈ ఏడాది మార్చి 28న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రస్తుతం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ది గోట్ లైఫ్ స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది.

ఆవేశం

ఫాహద్ ఫాజిల్ హీరోగా నటించిన ఆవేశం చిత్రం సుమారు రూ.156కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుంది. ఈ యాక్షన్ కామెడీ చిత్రం ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాను ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీల్లో చూడొచ్చు.

ప్రేమలు

ప్రేమలు సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ఈ ఏడాది ఫిబ్రవరి 9న విడుదలైంది. రూ.8కోట్లలోపు బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం ఏకంగా రూ.136 కోట్ల వసూళ్లతో దుమ్మురేపింది. ఈ ఏడాది మలయాళంలో అత్యధిక లాభాలను గడించిన చిత్రంగా నిలిచింది. ప్రేమలు చిత్రంలో నస్లెన్ కే గఫూర్, మమితా బైజూ హీరోహీరోయిన్లుగా నటించగా.. గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగులో ఆహాలో, హిందీ, మలయాళం, తమిళంలో డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో ఉంది.

ఏఆర్ఎం

టొవినో థామస్ హీరోగా నటించిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఏఆర్ఎం (ఆజయంతే రందం మోషనం) సుమారు రూ.100 కోట్ల కలెక్షన్లు దక్కించుకుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజైంది. ప్రస్తుతం డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.

గురువాయూర్ అంబలనదయిల్

కామెడీ మూవీ ‘గురువాయూర్ అంబలనదయిల్’ రూ.90కోట్ల వసూళ్లతో అదరగొట్టింది. పృథ్విరాజ్ సుకుమారన్, బాసిల్ జోసెఫ్, నిఖిల విమల్ లీడ్ రోల్స్ చేసిన ఈ చిత్రం మే 16న థియేటర్లలో అడుగుపెట్టింది. ఈ మూవీ డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

భ్రమయుగం

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించిన భ్రమయుగం చిత్రం సుమారు రూ.85కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ పీరియడ్ హారర్ థ్రిల్లర్ చిత్రం ఫిబ్రవరి 15న థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను మెప్పించింది. ఈ చిత్రం సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.

వర్షంగల్కు శేషం

కామెడీ డ్రామా మూవీ వర్షంగల్కు శేషం సుమారు రూ.80కోట్ల కలెక్షన్లు దక్కించుకుంది. ప్రణవ్ మోహన్ లాల్, ధ్యాన్ శ్రీనివాసన్ నటించిన ఈ లో బడ్జెట్ మూవీ ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు ఉంది.

కిష్కింద కాండం

సుమారు రూ.7కోట్ల బడ్జెట్‍తో రూపొందిన కిష్కింద కాండం చిత్రం రూ.75కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. ఆసిఫ్ అలీ హీరోగా నటించిన ఈ మిస్టరీ మూవీ సెప్టెంబర్ 12 థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రం ప్రస్తుతం డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.

టర్బో

మలయాళ సీనియర్ స్టార్ హీరో మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించిన టర్బీ చిత్రం రూ.70కోట్ల కలెక్షన్లు దక్కించుకుంది. ఈ చిత్రం మే 23వ తేదీన విడుదలైంది. ఈ చిత్రం సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

వీటిలో ఆవేశం మినహా మిగిలిన చిత్రాలు ఆయా ఓటీటీల్లో తెలుగు వెర్షన్‍లో కూడా అందుబాటులో ఉన్నాయి.

Whats_app_banner