Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్-premalu telugu version crosses 125 streaming minutes on aha ott platform ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Premalu Telugu Ott: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్

Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్

Chatakonda Krishna Prakash HT Telugu
May 06, 2024 05:41 PM IST

Premalu Telugu OTT Streaming: ప్రేమలు సినిమా ఓటీటీలో ఇంకా జోరు కొనసాగిస్తోంది. తెలుగు వెర్షన్ దూసుకెళుతోంది. తాజాగా ఈ రొమాంటిక్ కామెడీ మూవీ మరో మైలురాయి దాటింది.

Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్
Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్

Premalu Telugu OTT Streaming: ప్రేమలు సినిమా మలయాళ బాక్సాఫీస్‍ను షేక్ చేసింది. తక్కువ బడ్జెట్‍తో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ సినిమా భారీ కలెక్షన్లను సాధించింది. నెస్లన్ గఫూర్, మమితా బైజూ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో మలయాళంలో రిలీజై పాజిటివ్ టాక్‍తో అదరగొట్టింది. భారీ వసూళ్లతో ఆశ్చర్యపరిచింది. హైదరాబాద్ బ్యాక్‍డ్రాప్‍లో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో మార్చి 8న విడుదలైంది. మంచి కలెక్షన్లను సాధించింది. తెలుగులో ఓటీటీలోనూ ప్రేమలు సినిమా దుమ్మురేపుతోంది.

yearly horoscope entry point

మరో మైల్‍స్టోన్

ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్ ఏప్రిల్ 12వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తెలుగులోనూ ఈ చిత్రానికి ఫుల్ బజ్ ఉండటంతో మొదటి నుంచే మంచి వ్యూస్ దక్కించుకుంది. తెలుగు చిత్రాలతో పోటీ పడుతూ ఆహా ఓటీటీలో ఈ డబ్బింగ్ మూవీ ట్రెండింగ్‍లోకి వచ్చింది.

ఆహా ఓటీటీలో ప్రేమలు తెలుగు వెర్షన్ తాజాగా మరో మైల్‍స్టోన్ దాటింది. ఈ చిత్రం 125 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను దాటిందని ఆహా నేడు (మే 6) వెల్లడించింది. “జేకే (జస్ట్ కిడ్డింగ్) లవర్స్ అందరికీ ఇది అంకితం. ప్రేమలు 125 మిలియన్ నిమిషాలను సెలెబ్రేట్ చేస్తున్నాం” అని ఆహా నేడు ట్వీట్ చేసింది.డబ్బింగ్ మూవీకి ఈ రేంజ్‍లో వ్యూస్ దక్కడం విశేషమే.

ప్రేమలు సినిమా మలయాళంతో పాటు హిందీ, తమిళంలో డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ భాషల్లోనూ ప్రేమలు మంచి వ్యూస్ దక్కించుకుంటోంది.

బ్లాక్‍బస్టర్‌గా ప్రేమలు

ప్రేమలు సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‍బస్టర్ అయింది. దాదాపు రూ.5కోట్ల బడ్జెట్‍తో రూపొందించిన ఈ మూవీ సుమారు రూ.136 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ మూవీ తెలుగు వెర్షన్ కూడా థియేటర్లలో సుమారు రూ.15కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ మూవీని తెలుగులో దర్శక ధీరుడు రాజమౌళి కుమారుడు కార్తీకేయ రిలీజ్ చేశారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ ఈవెంట్‍కు రాజమౌళి కూడా హాజరయ్యారు. దీంతో చాలా బజ్ ఏర్పడింది.

ప్రేమలు సినిమాకు గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించారు. కామెడీ ప్రధానంగా ఈ లవ్ మూవీని తెరకెక్కించారు. సరదాగా సాగే ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీలో సచిన్ పాత్రలో నెస్లెన్ గఫూర్, రేణుగా మమితా బైజూస్ యాక్టింగ్ కూడా అదిరిపోయింది. ఈ మూవీతో మమితా చాలా పాపులర్ అయ్యారు.

ప్రేమలు మూవీలో సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల్ భార్గవన్, మాథ్యు థామస్, మీనాక్షి రవీంద్రన్ కీరోల్స్ చేశారు. ఈ చిత్రాన్ని మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాజిల్, దిలీశ్ పోతన్, శ్యామ్ పుష్కరన్ నిర్మించగా.. విష్ణు విజయ్ సంగీతం అందించారు. ఈ మూవీ తెలుగు వెర్షన్‍కు 90s వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ డైలాగ్స్ రాశారు.

కాగా, మలయాళ ఇండస్ట్రీలో ఆల్‍టైమ్ రికార్డు సృష్టించిన మంజుమ్మల్ బాయ్స్ సినిమా కూడా తాజాగా ఓటీటీలో అడుగుపెట్టింది. మే 5వ తేదీన ఈ చిత్రం మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.

Whats_app_banner