రెండు ఓటీటీల్లోకి ప్రేమలు..తెలుగు స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్

By Chatakonda Krishna Prakash
Apr 07, 2024

Hindustan Times
Telugu

మలయాళ బ్లాక్‍బస్టర్ ప్రేమలు సినిమా రెండు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో అందుబాటులోకి రానుంది. తెలుగులో ఓ ఓటీటీలో.. మలయాళం, తమిళం, హిందీ భాషల్లో మరో ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. 

ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్ ఏప్రిల్ 12వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. 

ప్రేమలు మూవీ మలయాళంతో పాటు తమిళం, హిందీ డబ్బింగ్ వెర్షన్‍లు ఏప్రిల్ 12వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. 

నెస్లెన్ కే గఫూర్, మమితా బైజూ హీరోహీరోయిన్లుగా నటించిన లవ్ కామెడీ మూవీ ప్రేమలు మలయాళంలో ఫిబ్రవరి 9న రిలీజై సెన్సేషనల్ హిట్ అయింది. మార్చి 8న ఈ చిత్రం తెలుగులోనూ థియేటర్లలోకి వచ్చింది. 

రూ.5 కోట్లలోపు బడ్జెట్‍తో రూపొందిన ప్రేమలు సినిమా రూ.135 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది భారీ బ్లాక్ బస్టర్ అయింది. తెలుగులోనూ వసూళ్లలో దుమ్మురేపింది. 

ప్రేమలు సినిమాకు గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించగా.. ఫాహద్ ఫాజిల్, దిలీశ్ పోతన్ శ్యాం పుష్కరన్ నిర్మించారు. ఏప్రిల్ 12 నుంచి తెలుగులో ఆహా ప్లాట్‍ఫామ్‍లో.. మలయాళం, హిందీ, తమిళంలో హాట్‍స్టార్ ఓటీటీలో ఈ చిత్రాన్ని చూడొచ్చు. 

Photo: Aha

హీట్ సమ్మర్‌లో కూల్‌గా ఎంజాయ్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్

Instagram