Brahmamudi Serial: దుగ్గిరాల ఫ్యామిలీ రూల్స్ మార్చేసిన కావ్య - ఫాలో కావాల్సిందేనంటూ వార్నింగ్ - అపర్ణ హ్యాపీ
Brahmamudi Serial: బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ప్రోమోలో కావ్య నుంచి డబ్బులు దండుకోవాలనే రుద్రాణి, ధాన్యలక్ష్మి కలలకు బ్రేక్ పడుతుంది. ఇక నుంచి తీసుకునే ప్రతి రూపాయికి లెక్క చెప్పాలని దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్‌కు వార్నింగ్ ఇస్తుంది కావ్య. ఇట్స్ మై ఆర్డర్ అని చెబుతుంది.
Brahmamudi Serial: చిట్‌ఫండ్ కంపెనీకి సంబంధించి తాతయ్య ఇచ్చిన ష్యూరిటీ కారణంగా వంద కోట్లు బ్యాంకుకు కట్టాల్సి వచ్చిన విషయం కావ్యకు చెబుతాడు రాజ్. గడువులోగా డబ్బు చెల్లించకపోతే ఆస్తి జప్తు చేస్తామని బ్యాంకువాళ్లు చెబుతున్నారని అంటాడు. వారు ఇచ్చిన గడువు పూర్తయిందని టెన్షన్ పడతాడు. ఈ సమస్య నుంచి గట్టెక్కడంలో సహాయం చేయమని కావ్యను అడుగుతాడు. ఆస్తి జప్తు కాకుండా కుటుంబ రోడ్డున పడకుండా తాతయ్య ఇచ్చిన మాట నిలబడేలా చేయమని కావ్యను కోరుతాడు రాజ్. భర్త మాటలు విని కావ్య షాకవుతుంది.
రాజ్ టెన్షన్
రుద్రాణి, ధాన్యలక్ష్మికి ఈ విషయంలో తెలిస్తే గొడవలు మరింత పెరుగతాయని రాజ్ టెన్షన్ పడతాడు.ఈ సమస్యను పరిష్కరించడం కోసం రాజ్‌తో కలిసి ఆఫీస్‌కు వెళుతుంది కావ్య. రాజ్, కావ్య ఆఫీస్‌కు కలిసి వెళ్లడం చూసి సుభాజ్, అపర్ణ హ్యాపీగా ఫీలవుతారు. ధాన్యలక్ష్మి మాత్రం షాకవుతుంది. ఇద్దరు కలిసి ఆఫీస్‌కు వెళ్లడం వెనుక ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుందని అనుమానపడుతుంది. డిజైన్స్ కోసమే ఆఫీస్‌కు వెళుతున్నట్లు కావ్య అబద్ధం ఆడుతుంది.
ఆపర్ణ ఆనందం...
రాజ్‌లో వచ్చిన మార్పు చూసి అపర్ణ ఆనందంతో పొంగిపోతుంది. అహాన్ని పక్కనపెట్టి కావ్యను భార్యగా ఒప్పుకున్నాడని, ఇన్నాళ్లు తాను పడిన కష్టం ఫలించిందని సంబరపడిపోతుంది.
స్వప్న చేతికి తాళాలు...
కావ్య ఆఫీస్‌కు బయలుదేరుతూ ఇంటి తాళాలను స్వప్నకు ఇస్తుంది. నన్ను నమ్మి నువ్వు ఇంటి తాళాలు ఇచ్చి నప్పుడు నీ పరువు కాపాడటం నా బాధ్యత అని చెల్లికి స్వప్న మాటిస్తుంది. రాజ్, కావ్య కలిసి ఒకే కారులో ఆఫీస్‌కు వెళ్లడం రుద్రాణి సహించలేకపోతుంది. వాళ్లిద్దరు కలిసిపోవడం ఏంటి అని తెగ బాధపడిపోతుంది. రాజ్, కావ్యలను విడదీసేందుకు ఇన్నాళ్లు తాను వేసిన ఎత్తులన్నీ వృథాగా మారిపోవడంతో తెగ బాధపడుతుంది.
రాహుల్ బ్లాక్‌మెయిల్..
బ్యాంకు చెల్లించాల్సిన వంద కోట్లను ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో చెల్లించేలా బ్యాంకు వాళ్లను ఒప్పిస్తుంది కావ్య. ఆమె మాటలతో బ్యాంకు అధికారులు కన్వీన్స్ అవుతారు. డబ్బుల కోసం స్వప్నను బ్లాక్‌మెయిల్ చేస్తారు రుద్రాణి, రాహుల్. వారి మాటలను భరించలేక అడిగినంత మొత్తం ఇవ్వడానికి రెడీ అవుతుంది స్వప్న. వారికి స్వప్న డబ్బులు ఇవ్వకుండా కావ్య అడ్డుకుంటుంది.
లెక్క చెప్పాల్సిందే...
డబ్బు అవసరమై ఎవరు అడిగిన తీసుకున్న ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సిందేనని కావ్య అంటుంది. ఆఖరుకు కారులో పెట్రోల్ పోయించిన తనకు బిల్ తెచ్చివాల్సిందేనని ఆర్డర్ వేస్తుంది. ఈ రూల్‌ను ఇంట్లో అందరూ స్ట్రిక్ట్‌గా పాటించాలని వార్నింగ్ ఇస్తుంది. ఇట్స్ మై ఆర్డర్ అని చెబుతుంది. కావ్య మాటలతో రుద్రాణి, ధాన్యలక్ష్మి షాకవుతారు. అపర్ణ ఆనందపడినట్లు బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ప్రోమోలో చూపించారు.