Electric Scooter : ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. రూపాయి ఖర్చు లేకుండా 170 కి.మీ వెళ్లొచ్చు
iVOOMi JeetX ZE electric scooter : ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలి అని చూసేవారికి మంచి అవకాశం. కొత్త జీత్ ఎక్స్ జెడ్ఈ ఎలక్ట్రిక్ స్కూటీ గురించి తెలుసుకోండి. 170 కిలో మీటర్ల రేంజ్ ఇస్తుంది.
ఒకే ఛార్జ్‌పై 170 కిలో మీటర్ల రేంజ్‌ను అందించే కొత్త జీత్ ఎక్స్ జెడ్‌ఇ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం ఈవీ మార్కెట్‌లో సందడి చేస్తోంది. ఇది iVOOMi కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్. 3 KWH బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. మొబైల్ యాప్ కనెక్టివిటీతో ఉంటుంది. అత్యాధునిక స్మార్ట్ స్పీడోమీటర్‌తో ఆధునిక ఫీచర్లను కలిగి ఉంది. టర్న్-బై-టర్న్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్-మెసేజ్ నోటిఫికేషన్, ట్రిప్ డేటా, SOC అలర్ట్, బ్యాటరీ ఛార్జ్ స్టేటస్ బార్‌లో కనిపిస్తుంది.
ఈ స్కూటర్ కోసం బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఈ స్కూటర్ దాని అధునాతన ఫీచర్లు, ధరతో మిగిలిన ఈవీ స్కూటీలకు పోటీ ఇస్తుంది. దీని ధర రూ. 99,999, iVOOMi డీలర్‌షిప్‌ల వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
ఆసక్తి ఉన్న వినియోగదారులు తమ స్థానిక డీలర్లను సంప్రదించాలని కంపెనీ తెలిపింది. ఈ కొత్త స్కూటర్ 42 mm వ్యాసంతో ERW1 స్టీల్ ట్యూబ్‌తో నిర్మించిన అండర్‌బోన్ ఫ్రేమ్‌తో రూపొందించారు. నాణ్యత పరంగా ఇది బెస్ట్ అని కంపెనీ తెలిపింది. 63 kmph గరిష్ట వేగంతో సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తుంది. 75 మిమీ టెలిస్కోపిక్ సస్పెన్షన్ సౌకర్యవంతమైన ప్రయాణంతో ఉంటుంది. iVOOMi బ్యాటరీపై 5-సంవత్సరాల వారంటీ కూడా ఇస్తున్నారు. వేరియంట్ నాణ్యతకు హామీ ఇస్తున్నామని కంపెనీ పేర్కొంది.
JEET X ZE 3 KWH వేరియంట్‌లో ఎకో మోడ్, రైడర్ మోడ్, స్పీడ్ మోడ్ అనే మూడు విభిన్న రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. 170 కి.మీ పరిధి 'ఎకో మోడ్'లో అందుబాటులో ఉంది. ఇది నగర ప్రయాణాలకు, దూర ప్రయాణాలకు సరైన ఎంపికగా నిలుస్తుంది.
రైడర్ మోడ్‌లో 140 కి.మీ రేంజ్‌తో రోజువారీ ప్రయాణానికి అనువైనది. ఇది స్పీడ్ మోడ్‌లో 130 కి.మీ రేంజ్ అందిస్తుంది. ఈ రైడ్ మోడ్‌లు రైడర్‌లకు భిన్నమైన డ్రైవింగ్ అనుభూతిని అందజేస్తాయని కంపెనీ తెలిపింది. 'JEET X ZE 3 KWH వేరియంట్‌ను పరిచయం చేయడం అనేది మా కస్టమర్ల అవసరాలను తీర్చడం కోసం మా కృషిని తెలుపుతుంది. మేం అధునాతన సాంకేతికత, అత్యుత్తమ పనితీరు, విలువను అందించడానికి కట్టుబడి ఉన్నాం.' అని iVOOMi CEO, సహ వ్యవస్థాపకుడు అశ్విన్ భండారి చెప్పారు.