Tata Tiago EV : టాటా టియాగో ఈవీలో కొత్త ఫీచర్స్.. మరింత అట్రాక్టివ్‌గా..!
Tata Tiago EV new features : టాటా టియాగో ఈవీలో కొత్త ఫీచర్స్‌ని యాడ్ చేసింది సంస్థ. కానీ ధరను మాత్రం పెంచలేదు. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..
Tata Tiago EV on road price Hyderabad : ఇండియాలో అతి చౌకైన ఎలక్ట్రిక్ వెహికిల్‌గా గుర్తింపు తెచ్చుకున్న టాటా టియాగో ఈవీలో సైలెంట్‌గా కొన్ని కొత్త ఫీచర్స్‌ని యాడ్ చేసింది టాటా మోటార్స్. ఎక్స్జెడ్+ టెక్ ఎల్ఆర్ వేరియంట్‌కు ఇప్పుడు ఆటో- డిమ్మింగ్ ఐఆర్వీఎం ఆప్షన్ వస్తోంది. అంటే.. ఐఆర్వీఎం స్విచ్ని మాటిమాటికి డ్రైవర్లు మార్చాల్సిన అవసరం లేదు. ఇక ఎక్స్జెడ్+ వేరియంట్లో 45 వాట్ యూఎస్బ పోర్ట్ వస్తోంది. మొబైల్ డివైజ్‌ల ఛార్జింగ్ మరింత ఫాస్ట్ అవుతుంది.
ఈ ఫీచర్స్ కూడా..!
పైన చెప్పిన వాటితో పాటు టాటా టియాగో ఈవీలో.. పోలెన్ ఎయిర్ ఫిల్టర్, ఆటో ఫోల్డ్ ఔట్‌సైడ్ రేర్‌వ్యూ మిర్రర్స్ వంటివి సైతం.. ఎక్స్జెడ్+ వేరియంట్లలో వస్తున్నాయి. ఇక టాటా టియాగో ఈవీ అన్ని వేరియంట్లలోనూ బ్లాక్ రూఫ్‌ని తొలగించేసింది టాటా మోటార్స్. వీటిని మినహయిస్తే.. పెద్దగా మార్పులు ఏవీ కనిపించడం లేదు.
కొత్త ఫీచర్స్‌ని యాడ్ చేసినా, టియాగో ఈవీ ధరను మాత్రం టాటా మోటార్స్ పెంచలేదు. ఈ ఎలక్ట్రిక్ కారు ఎక్స్‌షోరూం ధర రూ. 7.99లక్షలు- రూ. 11.89లక్షల మధ్యలో ఉంది.
Tata Tiago EV latest news : ఇక టాటా టియాగో ఈవీ మీడియం రేంజ్ వేరియంట్లలో 250కి.మీల రేంజ్ ఉంటుంది. లాంగ్ రేంజ్ వేరియంట్లను ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 315 కి.మీల దూరం ప్రయాణిస్తుంది. ఈ రెండు వర్షన్స్లోనూ.. 3ఏళ్లు లేదా 1,25,000 కి.మీల వెహికిల్ వారెంటీ వస్తోంది. బ్యాటరీ ప్యాక్‌పై 8ఏళ్లు లేదా 1,60,000 కి.మీల వరకు వారెంట్‌ని ఇస్తోంది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ.
ఈ టాటా టియాగో ఈవీలో 4 లెవల్స్ బ్రేక్ రీజనరేషన్, 2 డ్రైవింగ్ మోడ్స్ వస్తున్నాయి. మీడియం రేంజ్ వర్షెన్లోని మోటార్ 60 బీహెచ్పీ పవర్‌ని, 110 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఇక లాంగ్ రేంజ్‌లోని మోటార్.. 73 బీహెచ్పీ పవర్‌ని, 114 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది.
టాటా మోటార్స్.. సేఫ్టీకి పెట్టింది పేరు అన్న విషయం తెలిసిందే. ఇక టాటా టియాగో ఈవీలోనూ అనేక సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. అవి.. డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టెమ్, రేర్ పార్కింగ్ సెన్సార్, ఇంపాక్ట్ సమయంలో ఆటో బ్యాటరీ కట్ ఆఫ్, పంచర్ రిపైర్ కిట్.
Tata Tiago EV new features : సిట్రోయెన్ సీ3, ఎంజీ కామెట్ ఈవీలకు ఈ టాటా టియాగో ఈవీ గట్టిపోటీనిస్తోంది. వాటి ఎక్స్‌షోరూం ధరలు రూ. 11.61 లక్షల దగ్గర ప్రారంభమవుతాయి. ఈ విషయంలో టాటా టియాగో ఈవీకి కాస్త ఎడ్జ్ ఉందనే చెప్పుకోవాలి!
సంబంధిత కథనం