Tata Punch facelift : టెస్ట్ రన్ దశలో టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్.. లాంచ్ ఎప్పుడు?
Tata Punch facelift 2024 : టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌పై కీలక అప్డేట్! టెస్ట్ రన్ దశలో ఉన్న పంచ్ కొత్త వర్షెన్ ఇండియా రోడ్ల మీద కనిపించింది. పూర్తి వివరాలు..
Tata Punch facelift 2024 launch date : ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీగా ఉన్న టాటా పంచ్‌కి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ని తీసుకొస్తోంది టాటా మోటార్స్. ఈ విషయంపై కొన్ని నెలలుగా బజ్ నెలకొంది. ఇక ఇప్పుడు.. ఈ టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌పై కీలక అప్డేట్ బయటకి వచ్చింది. ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌కి చెందిన ప్రోటోటైప్ మోడల్.. టెస్ట్ డ్రైవ్ చేస్తూ కనిపించింది! ఈ నేపథ్యంలో.. ఈ మోడల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- ఈ విషయాలు తెలుసుకోండి..
2021 అక్టోబర్‌లో టాటా పంచ్‌ని లాంచ్ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్. ఈ మైక్రో- ఎస్యూవీ.. వెంటనే సూపర్ హిట్ అయిపోయింది. టాటా మోటార్స్‌కు బెస్ట్ సెల్లింగ్‌గా నిలిచింది. గత నెలలో.. టాటా నెక్సాన్ని వెనక్కి నెట్టి మరీ.. బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీల్లో మొదటి స్థానాన్ని సంపాదించుకుంది.
ఈ నేపథ్యంలో.. టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి. దీని డిజైన్ ఎలా ఉంటుంది? అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే లాంచ్ అయిన టాటా పంచ్ ఈవీ డిజైన్ అదిరిపోయింది! ఈవీ వర్షెన్ డిజైన్‌నే.. సంస్థ టాటా పంచ్ ఐసీఈ ఇంజిన్ ఫేస్‌లిఫ్ట్‌కి కూడా వాడుతున్నట్టు టాక్ నడుస్తోంది. లుక్స్ షార్ప్‌గా, బోల్డ్‌గా ఉంటాయని సమాచారం.
Tata Punch facelift launch date : అయితే.. ఎలక్ట్రిక్ వర్షెన్‌లో ఉన్నట్టు.. ఐసీఈ పవర్డ్ ఇంజిన్ మోడల్లో.. ఫుల్ విడ్త్ ఎల్ఈడీ లైట్ బార్ ఉండకపోవచ్చని తెలుస్తోంది. టెస్ట్ రన్ దశలో కనిపించిన టాటా పంచ్‌లో అలాయ్ వీల్స్ డిజైన్ కొత్తగా కనిపిస్తున్నాయి.
ఇక టాటా పంచ్ ఎస్యూవీ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్‌లో చాలా కొత్త ఫీచర్స్ ఉంటాయని, ఇవి.. టాటా పంచ్ ఈవీకి భిన్నంగా ఉంటాయని టాటా మోటార్స్ ఇప్పటికే స్పష్టం చేసింది. టాటా నెక్సన్, టాటా నెక్సాన్ ఈవీ ఎక్విప్మెంట్స్ విషయంలోనూ ఇదే జరిగింది!
ఈవీ వర్షెన్లోని కొన్ని ఫీచర్స్ ఉన్నప్పటికీ.. ఐసీఈ ఇంజిన్‌లో మరిన్న అడ్వాన్స్డ్ ఫీచర్స్ వస్తాయని టాక్ నడుస్తోంది.
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- లాంచ్ ఎప్పుడు?
Tata Punch facelift 2024 price : ప్రస్తుతం ఉన్న టాటా పంచ్‌కి, టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌కి మధ్య ఇంజిన్ విషయంలో మార్పు కనిపించకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న ఎస్‌యూవీలో.. 1.2 లీటర్, 3 సిలిండర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది.. 86 బీహెచ్పీ పవర్‌ని, 113 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మేన్యువల్, 5 స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్ ఉంటుంది.
ఈ టాటా పంచ్‌కి సీఎన్జీ వేరియంట్ కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే.. ఐసీఈ, ఎలక్ట్రిక్, సీఎన్జీ వేరియంట్లు ఉన్న ఏకైక మోడల్.. టాటా పంచ్ ఎస్యూవీ.
ఇక.. ఈ టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్.. 2025 మధ్యలో లాంచ్ అవ్వొచ్చని టాక్ నడుస్తోంది. దీనిపై సంస్థ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
కాగా.. సబ్- కాంపాక్ట్ ఎస్‌యూవీలోని హ్యుందాయ్ ఎక్స్టర్, సిట్రోయెన్ సీ3కి.. ఇప్పటికే బీభత్సమైన పోటీని ఇస్తోంది టాటా పంచ్. ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ కూడా.. అంచనాలు తగ్గతని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
సంబంధిత కథనం