Hyundai Creta EV spied : సూపర్ ఫీచర్స్‌తో హ్యుందాయ్ క్రేటా ఈవీ.. లాంచ్ ఎప్పుడు?
Hyundai Creta EV 2024 : హ్యుందాయ్ క్రేటా ఈవీకి సంబంధించిన ఫొటోలు లీక్ అయ్యాయి. ఫలితంగా.. ఈ ఎలక్ట్రిక్ వెహికిల్‌పై అంచనాలు మరింత పెరిగాయి.
Hyundai Creta EV : హ్యుందాయ్ క్రేటా ఈవీ కోసం నిరీక్షణ కొనసాగుతోంది. ఈ ఎలక్ట్రిక్ వెహికిల్‌పై ఇప్పటికే చాలా బజ్నెలకొంది. ఇక ఇప్పుడు.. క్రేటా ఈవీ మోడల్..సౌత్ కొరియాలో దర్శనమిచ్చింది. టెస్ట్ రన్ దశలో ఉన్న ఈ మోడల్.. ఇప్పటికే ఉన్న అంచనాలను మరింత పెంచేసింది. ఈ నేపథ్యంలో.. ఈ ఎలక్ట్రిక్ వెహికిలప్పై ఇప్పటి వరకు ఉన్న వివరాలను ఓసారి చూసేద్దాము..
హ్యుందాయ్ క్రేటా ఈవీ..
ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీల్లో క్రేటా ఒకటి. హ్యుందాయ్‌కి కూడా ఈ ఎస్యూవీ.. బెస్ట్ సెల్లింగ్ మోడల్! ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ని ఇండియాలో ఇటీవలే లాంచ్ చేసింది. ఇక దీనికి ఎలక్ట్రిక్ వర్షెన్ వస్తుందని ఎప్పటి నుంచే వార్తలు ఉన్నాయి. క్రేటా ఈవీపై టెస్ట్ రన్ కూడా చాలాసార్లు జరిగింది.
ఇక తాజాగా కనపడిన స్పై షాట్స్ ప్రకారం.. ఈ ఎస్యూవీ ఫ్రంట్ ప్రొఫైల్ మొత్తాన్ని కవర్ చేసే విధంగా.. ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్ (డీఆర్ఎల్) ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో అమ్మకానికి ఉన్న క్రెటా ఐసీఈ వేరియంట్ మాదిరిగానే ఈ కారులో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ సహా స్టైలింగ్ అంశాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఎలక్ట్రిక్ కారు కావడంతో కొత్తగా లాంచ్ చేసిన క్రెటా ఫేస్‌లిఫ్ట్‌లో కనిపించే సంప్రదాయ రేడియేటర్ గ్రిల్‌కు బదులుగా.. క్లోజ్డ్ ప్యానెల్ ఉండొచ్చు. ఎలక్ట్రిక్ క్రెటా 17-ఇంచ్ ఏయిరో-డిజైన్ అలాయ్ వీల్స్ పొందుతుందని స్పైషాట్ ద్వారా తెలుస్తోంది. ఇది ప్రత్యేకంగా ఈవీ కోసం తయారు చేసినట్టు కనిపిస్తోంది. ఐసీఈ వేరియంట్‌తో పోల్చితే.. అత్యంత మెరుగైన మార్పుగా దీనిని పరిగణించవచ్చు.
Hyundai Creta EV spied in India : హ్యుందాయ్ క్రెటా ఈవీలో.. రీపోజిషన్డ్ బ్రాండ్ లాగ్, ఫ్రంట్-ఫెండర్ మౌంటెడ్ ఛార్జింగ్ పోర్ట్ ఉండొచ్చు. అలాగే, ట్వీక్డ్ రేడియేటర్ గ్రిల్‌తో స్మూత్ బంపర్ ఉంటుంది. ఎలక్ట్రిక్ ఎస్యూవీ సైడ్, రేర్ ప్రొఫైల్‌లో డిజైన్ మార్పులను కలిగి ఉంటుందని సమాచారం.
ఫీచర్ల విషయానికొస్తే.. హ్యుందాయ్ క్రెటా ఈవీ ఎలక్ట్రిక్ వెహికిల్‌లో భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, కొత్త గ్రాఫిక్స్‌తో కూడిన ఆల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రీ-డెవలప్డ్ సెంటర్ కన్సోల్‌తో వస్తుందని సమాచారం. 360 డిగ్రీల సరౌండ్ కెమెరా, లెవల్ 2 ఏడీఏఎస్ సూట్ కూడా ఇందులో ఉండనున్నాయి. ఫ్రంట్ ప్రొఫైల్‌లో.. నోస్ పార్ట్‌లో ఫ్రెంట్ కెమెరా రానుంది.
దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం నుంచి రాబోయే ఎలక్ట్రిక్ కారు స్పెసిఫికేషన్ల గురించి ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు. అయితే, ఇది 55-60 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుందని, ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 450 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
Hyundai Creta EV spied : ఇక ఈ హ్యుందాయ్ క్రేటా ఈవీ ఫీచర్స్, బ్యాటరీ, లాంచ్ వంటి వివరాలపై త్వరలోనే ఓ అప్టేడ్ వస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ధరపై కూడా త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
సంబంధిత కథనం