ಟಿ20 ವಿಶ್ವಕಪ್ ಪಾಯಿಂಟ್ಸ್ ಟೇಬಲ್ 2024
టీ20 వరల్డ్ కప్ 2024 పాయింట్ల పట్టిక
"ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 ఈసారి 20 జట్లతో జరగబోతోంది. జూన్ 1 నుంచి 29 వరకు అమెరికా, వెస్టిండీస్ లలో ఈ మెగా టోర్నీ జరుగుతుంది. మొత్తంగా 55 మ్యాచ్ లు జరుగుతాయి. జూన్ 1న డల్లాస్ లో యూఎస్ఏ, కెనడా మ్యాచ్ తో టోర్నీ ప్రారంభం కానుంది. జూన్ 29న బార్బడోస్ లో ఫైనల్ ఉంటుంది. ఈసారి వరల్డ్ కప్ లో టాప్ 10 టీమ్స్ తోపాటు కొత్తగా ఒమన్, పపువా న్యూ గినియా, యూఎస్ఏ, కెనడా, ఉగాండా, నమీబియా, ఐర్లాండ్, నేపాల్ లాంటి టీమ్స్ ఆడుతున్నాయి. వెస్టిండీస్, అమెరికా దేశాలు ఆతిథ్యమిస్తుండటంతో అవి రెండూ నేరుగా అర్హత సాధించాయి. ఇక టాప్ 8 ర్యాంకుల్లో ఉన్న ఇండియా, ఇంగ్లండ్, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్, శ్రీలంక కూడా నేరుగా క్వాలిఫై అయ్యాయి. ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ కూడా టోర్నీలోకి వచ్చాయి. యూరప్ నుంచి ఐర్లాండ్, స్కాట్లాండ్.. ఈస్ట్ ఏషియా-పసిఫిక్ నుంచి పపువా న్యూగినియా, అమెరికాస్ క్వాలిఫయర్ నుంచి కెనడా.. ఆషియా నుంచి నేపాల్, ఒమన్.. ఆఫ్రికా నుంచి నమీబియా, ఉగాండా అర్హత సాధించాయి. టీ20 వరల్డ్ కప్ 2024లో మొత్తం 20 టీమ్స్ పాల్గొంటున్నాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో ఐదు టీమ్స్ ఉంటాయి. గ్రూప్ ఎ - ఇండియా, పాకిస్థాన్, కెనడా, ఐర్లాండ్, యూఎస్ఏ గ్రూప్ బి - ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్ గ్రూప్ సి - న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్, పపువా న్యూ గినియా, ఉగాండా గ్రూప్ డి - సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ ఈ మెగా టోర్నీలో గ్రూప్ ఎలో భాగంగా లీగ్ స్టేజ్ లో టీమిండియా ఆడబోయే మ్యాచ్ ల వివరాలు, భారత కాలమానం ప్రకారం మ్యాచ్ జరిగే సమయాలు ఇక్కడ చూడొచ్చు. ఇండియా వెర్సెస్ ఐర్లాండ్ - జూన్ 5 రాత్రి 8 గంటలకు.. ( న్యూయార్క్) ఇండియా వెర్సెస్ పాకిస్థాన్ - జూన్ 9 రాత్రి 8 గంటలకు (న్యూయార్క్) ఇండియా వెర్సెస్ యూఎస్ఏ - జూన్ 12 రాత్రి 8 గంటలకు (న్యూయార్క్) ఇండియా వెర్సెస్ కెనడా - జూన్ 15 రాత్రి 8 గంటలకు (లాండర్‌హిల్) టీ20 వరల్డ్ కప్ 2024 పాయింట్ల టేబుల్ విషయానికి వస్తే ఈసారి లీగ్ స్టేజ్, సూపర్ 8, సెమీఫైనల్, ఫైనల్ ఫార్మాట్లో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. లీగ్ స్టేజ్ లో ఒక్క గ్రూపు నుంచి టాప్ 2 టీమ్స్ సూపర్ 8కు అర్హత సాధిస్తాయి. అక్కడ రెండు గ్రూపులుగా విడిపోయి తలపడే 8 టీమ్స్ లో ఒక్కో గ్రూపు నుంచి రెండేసి జట్లు సెమీఫైనల్ కు వెళ్తాయి. లీగ్ స్టేజ్ లో విజయానికి రెండు పాయింట్లు, మ్యాచ్ టై లేదా రద్దయితే ఒక్కో పాయింట్, ఓటమికి సున్నా పాయింట్లు ఉంటాయి. తర్వాతి రౌండ్ కు వెళ్లడానికి నెట్ రన్ రేట్ కూడా కీలకమే అవుతుంది. మొదట నాలుగు గ్రూపులు, సూపర్ 8లో రెండు గ్రూపుల పాయింట్ల టేబుల్ ప్రతి మ్యాచ్ కూ మారుతూ ఉంటుంది. ఈ పాయింట్ల టేబుల్లో అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు ప్రత్యేక టీ20 వరల్డ్ కప్ పేజీలో చూడొచ్చు."
T20 World Cup Points Table 2024 - Super Eight GROUP 1
Pos | Teams |
---|---|
1 | indindia |
2 | afgafghanistan |
3 | ausaustralia |
4 | banbangladesh |
Matches | Won | Lost | Tied | NR | Points | NRR | Series Form |
---|---|---|---|---|---|---|---|
3 | 3 | 0 | 0 | 0 | 6 | +2.017 | WWW |
3 | 2 | 1 | 0 | 0 | 4 | -0.305 | WWL |
3 | 1 | 2 | 0 | 0 | 2 | -0.331 | LLW |
3 | 0 | 3 | 0 | 0 | 0 | -1.709 | LLL |
Pos: Position, Pld: Played, Pts: Points, NRR: Net Run Rate
T20 World Cup Points Table 2024 - Super Eight GROUP 2
Pos | Teams |
---|---|
1 | sasouth africa |
2 | engengland |
3 | wiwest indies |
4 | usausa |
Matches | Won | Lost | Tied | NR | Points | NRR | Series Form |
---|---|---|---|---|---|---|---|
3 | 3 | 0 | 0 | 0 | 6 | +0.599 | WWW |
3 | 2 | 1 | 0 | 0 | 4 | +1.992 | WLW |
3 | 1 | 2 | 0 | 0 | 2 | +0.963 | LWL |
3 | 0 | 3 | 0 | 0 | 0 | -3.906 | LLL |
Pos: Position, Pld: Played, Pts: Points, NRR: Net Run Rate
T20 World Cup Points Table 2024 - Group A
Pos | Teams |
---|---|
1 | indindia |
2 | usausa |
3 | pakpakistan |
4 | cancanada |
5 | ireireland |
Matches | Won | Lost | Tied | NR | Points | NRR | Series Form |
---|---|---|---|---|---|---|---|
4 | 3 | 0 | 0 | 1 | 7 | +1.137 | AWWW |
4 | 2 | 1 | 0 | 1 | 5 | +0.127 | ALWW |
4 | 2 | 2 | 0 | 0 | 4 | +0.294 | WWLL |
4 | 1 | 2 | 0 | 1 | 3 | -0.493 | ALWL |
4 | 0 | 3 | 0 | 1 | 1 | -1.293 | LALL |
Pos: Position, Pld: Played, Pts: Points, NRR: Net Run Rate
T20 World Cup Points Table 2024 - Group B
Pos | Teams |
---|---|
1 | ausaustralia |
2 | engengland |
3 | scoscotland |
4 | namnamibia |
5 | omaoman |
Matches | Won | Lost | Tied | NR | Points | NRR | Series Form |
---|---|---|---|---|---|---|---|
4 | 4 | 0 | 0 | 0 | 8 | +2.791 | WWWW |
4 | 2 | 1 | 0 | 1 | 5 | +3.611 | WWLA |
4 | 2 | 1 | 0 | 1 | 5 | +1.255 | LWWA |
4 | 1 | 3 | 0 | 0 | 2 | -2.585 | LLLW |
4 | 0 | 4 | 0 | 0 | 0 | -3.062 | LLLL |
Pos: Position, Pld: Played, Pts: Points, NRR: Net Run Rate
T20 World Cup Points Table 2024 - Group C
Pos | Teams |
---|---|
1 | wiwest indies |
2 | afgafghanistan |
3 | nznew zealand |
4 | ugauganda |
5 | pngpapua new guinea |
Matches | Won | Lost | Tied | NR | Points | NRR | Series Form |
---|---|---|---|---|---|---|---|
4 | 4 | 0 | 0 | 0 | 8 | +3.257 | WWWW |
4 | 3 | 1 | 0 | 0 | 6 | +1.835 | LWWW |
4 | 2 | 2 | 0 | 0 | 4 | +0.415 | WWLL |
4 | 1 | 3 | 0 | 0 | 2 | -4.510 | LLWL |
4 | 0 | 4 | 0 | 0 | 0 | -1.268 | LLLL |
Pos: Position, Pld: Played, Pts: Points, NRR: Net Run Rate
T20 World Cup Points Table 2024 - Group D
Pos | Teams |
---|---|
1 | sasouth africa |
2 | banbangladesh |
3 | slsri lanka |
4 | nednetherlands |
5 | nepnepal |
Matches | Won | Lost | Tied | NR | Points | NRR | Series Form |
---|---|---|---|---|---|---|---|
4 | 4 | 0 | 0 | 0 | 8 | +0.470 | WWWW |
4 | 3 | 1 | 0 | 0 | 6 | +0.616 | WWLW |
4 | 1 | 2 | 0 | 1 | 3 | +0.863 | WALL |
4 | 1 | 3 | 0 | 0 | 2 | -1.358 | LLLW |
4 | 0 | 3 | 0 | 1 | 1 | -0.542 | LLAL |
Pos: Position, Pld: Played, Pts: Points, NRR: Net Run Rate
A.టీ20 వరల్డ్ కప్ 2024 పాయింట్ల టేబుల్లో ఒక్కో గ్రూపు నుంచి టాప్ లో నిలిచే రెండు టీమ్స్ తర్వాతి రౌండ్ కు అర్హత సాధిస్తాయి.
A. గ్రూప్ స్టేజ్ లో ఒక్కో జట్టు విజయానికి రెండు పాయింట్లు, మ్యాచ్ టై లేదా రద్దయితే ఒక పాయింట్, ఓడితే సున్నా పాయింట్లు ఇస్తారు.
A. రెండు జట్లకు ఒకే పాయింట్లు ఉంటే.. వాటిలో నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉన్న జట్టు ముందడుగు వేస్తుంది.
A. టీ20 వరల్డ్ కప్ ను వెస్టిండీస్, ఇంగ్లండ్ టీమ్స్ రెండేసిసార్లు గెలిచాయి.