టీ20 వరల్డ్ కప్ 2024 గణాంకాలు
"టీ20 ప్రపంచకప్‌లో 20 దేశాలు పాల్గొనడం ఇదే తొలిసారి. ఏ క్రికెట్ టోర్నమెంట్ అయినా గణాంకాలు, రికార్డులతో ముడిపడి ఉంటుంది. ఏ పెద్ద ఈవెంట్ దగ్గరపడుతున్నా వాటి గురించి అభిమానులు వెతుకుతూ ఉంటారు. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ 2024 విషయంలోనూ అదే జరుగుతుంది. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ చరిత్ర, రికార్డులు, గణాంకాలను ఒకసారి చూద్దాం. టోర్నమెంట్ చరిత్ర: 2007లో ప్రారంభమైనప్పటి నుండి, T20 ప్రపంచ కప్ తన స్పీడ్, రికార్డులతో క్రికెట్ అభిమానులను ఆకర్షించింది. ఈ నేపథ్యంలో వివిధ వరల్డ్ కప్ ఎడిషన్లలో నమోదైన రికార్డులు, గణాంకాలను ఇప్పుడు చూద్దాం. 2007 టీ20 వరల్డ్ కప్: దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చిన ప్రారంభ T20 ప్రపంచ కప్‌లో MS ధోని నాయకత్వంలో ఇండియా ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇంగ్లండ్‌పై యువరాజ్ సింగ్ ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టడం ఆ మెగా టోర్నీలో హైలైట్. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ ఐదు పరుగులతో విజయం సాధించింది. 2009 టీ20 వరల్డ్ కప్: తొలి ఎడిషన్ లో ఇండియా చేతుల్లో ఓటమి తర్వాత 2009 వరల్డ్ కప్ లో విజయం సాధించింది. ఈసారి ఫైనల్లో శ్రీలంకను 8 వికెట్లతో చిత్తు చేసి ట్రోఫీ అందుకుంది. 2010 టీ20 వరల్డ్ కప్: నాటకీయంగా జరిగిన ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లండ్ కరీబియన్ దీవులలో తమ తొలి T20 ప్రపంచ కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. టోర్నీ మొత్తం కెవిన్ పీటర్సన్ అద్భుతమైన ఫామ్ ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించింది. 2012 టీ20 వరల్డ్ కప్: టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ ఆధిపత్యానికి నాంది పలికింది. ఫైనల్‌లో ఆతిథ్య శ్రీలంకపై 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2014 టీ20 వరల్డ్ కప్: ఈసారి శ్రీలంక.. భారత్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి తమ మొట్టమొదటి T20 ప్రపంచ కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. లసిత్ మలింగ నేతృత్వంలోని శ్రీలంక పొట్టి ఫార్మాట్‌లో తమ సత్తా చాటింది. 2016 టీ20 వరల్డ్ కప్: ఇండియాలో జరిగిన ఈ టోర్నీలో వెస్టిండీస్ తమ రెండవ T20 ప్రపంచ కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్‌లో కార్లోస్ బ్రాత్‌వైట్ ఆఖరి ఓవర్‌లో వరుసగా నాలుగు సిక్స్ లు కొట్టి విండీస్ కు ఊహించని విజయాన్ని సాధించి పెట్టాడు. 2021 టీ20 వరల్డ కప్: ఆస్ట్రేలియా తొలిసారి టీ20 విశ్వవిజేతగా నిలిచిన టోర్నీ ఇది. 2021 ఎడిషన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో ఆస్ట్రేలియా గెలిచింది. టోర్నీ చరిత్రలో టీ20 ప్రపంచకప్ గెలవని ఫైనలిస్టులు న్యూజిలాండ్ మాత్రమే. 2022 టీ20 వరల్డ్ కప్: ఇంగ్లండ్ మరోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచింది. ఫైనల్లో పాకిస్థాన్ ను ఓడించింది. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతోంది. రికార్డులు పుష్కలంగా.. టీ20 ప్రపంచకప్‌లో ఎన్నో రికార్డులు బద్దలు కావడం మనం చూశాం. మరి ఇప్పటి వరకూ నమోదైన ఆ రికార్డులు ఏవో ఇక్కడ చూడండి.. ఎక్కువ రన్స్ చేసిన బ్యాటర్: ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2007లో ప్రారంభమైంది. అప్పటి నుండి టోర్నమెంట్ ఆరు ఎడిషన్‌లు జరిగాయి. T20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌లలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లి 27 మ్యాచ్‌లలో 81.50 సగటుతో 1141 పరుగులు చేశాడు. ఇందులో 14 అర్ధసెంచరీలు కూడా ఉన్నాయి. టీ20 ప్రపంచకప్‌లో ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా భారత మాజీ కెప్టెన్ రికార్డు సృష్టించాడు. 2014 ఎడిషన్ లో అతడు ఆరు మ్యాచ్‌లలో 319 పరుగులు చేశాడు. అందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్: బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ ప్రస్తుతం T20 ప్రపంచ కప్‌లలో అత్యధిక వికెట్లు తీసిన వారిలో అగ్రస్థానంలో ఉన్నాడు. 36 మ్యాచ్‌ల్లో 47 వికెట్లు తీశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు: 2012 ఎడిషన్‌లో పల్లెకెలెలో బంగ్లాదేశ్‌పై బ్రెండన్ మెకల్లమ్ 58 బంతుల్లో 123 పరుగులు చేశాడు. T20 ప్రపంచ కప్‌లో ఒక బ్యాటర్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరుగా మిగిలిపోయింది."
Highest Score
SR: Strike Rate, Mat: Matches, Inn: Innings, NO: Not Out, HS: Highest Score, Avg: Average, RS: Run Scored, VS: Vs Team, BF: Ball faced, TS: Team Score, BBF: Best Bowling Figures, Wkts: Wickets, RG: Runs Given, Ovr: Overs, Mdns: Maidens, EC: Economy, T-SC: Team Score, Vnu: Venue.
Best Strike Rate

Most Fifties

Most Hundreds
Player | Team | 100s | Mat | సగటు | స్ట్రైక్ రేట్ | చేసిన పరుగులు | 4s | 6s | ఇన్నింగ్స్ | 30s | 50s |
---|
SR: Strike Rate, Mat: Matches, Inn: Innings, NO: Not Out, HS: Highest Score, Avg: Average, RS: Run Scored, VS: Vs Team, BF: Ball faced, TS: Team Score, BBF: Best Bowling Figures, Wkts: Wickets, RG: Runs Given, Ovr: Overs, Mdns: Maidens, EC: Economy, T-SC: Team Score, Vnu: Venue.
Most 4s

Most 6s

Most Thirties

Best figures

Best Bowling Strike Rate

Most Expensive Bowler

Highest Team Total

Lowest Team Total

టీ20 వరల్డ్ కప్ తరచూ అడిగే ప్రశ్నలు
A. ఇంగ్లండ్, వెస్టిండీస్‌లు రెండుసార్లు టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్నాయి.
A. టీ20 ప్రపంచకప్ చరిత్రలో విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేశాడు.
A. టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ ఆటగాడు షకీబ్ అల్ హసన్ అత్యధిక వికెట్లు పడగొట్టాడు.
A. బ్రెండన్ మెకల్లమ్ చేసిన 123 పరుగులే ఒక బ్యాట్స్‌మన్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు.