టీ20 వరల్డ్ కప్ 2024 మోస్ట్ వికెట్స్
"టీ20 వరల్డ్ కప్ చరిత్రలో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ ప్రస్తుతం అత్యధిక వికెట్లు సాధించిన వారిలో అగ్రస్థానంలో ఉన్నాడు. 36 మ్యాచ్‌లలో 47 వికెట్లు తీశాడు. షకీబ్ సగటు 18.63. ఎకానమీ రేటు 6.78. అతను 2021 ఎడిషన్‌లో పపువా న్యూ గినియాపై 9 పరుగులకు 4 వికెట్లు తీసుకున్నాడు. మొత్తంగా టీ20 వరల్డ్ కప్ లలో మూడుసార్లు ఒకే మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీసుకున్న ఘనత సొంతం చేసుకున్నాడు. షకీబ్ తర్వాత పాకిస్థాన్ మాజీ ప్లేయర్ షాహిద్ అఫ్రిది 34 మ్యాచ్‌లలో 39 వికెట్లు, 6.71 ఎకానమీతో రెండవ స్థానాన్ని ఆక్రమించాడు. ఆఫ్రిది తర్వాత శ్రీలంక లెజెండరీ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ 31 మ్యాచ్‌లలో 7.43 ఎకానమీ రేటుతో 38 వికెట్లు పడగొట్టాడు. 2012లో ఇంగ్లండ్‌పై 31 పరుగులకు 5 వికెట్లు తీసిన మలింగ T20 ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన. నాలుగో స్థానంలో పాకిస్థాన్ మాజీ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్, శ్రీలంక మాజీ స్పిన్నర్ అజంతా మెండిస్ చెరో 35 వికెట్లతో నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నారు. టీమిండియా స్పిన్నర్ అశ్విన్ 24 మ్యాచ్ లలో 32 వికెట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు. 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్ నుంచి 2022 వరకు ఒక్కో ఎడిషన్ లో అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితా చూద్దాం. 2007: ఉమర్ గుల్ పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ ఉమర్ గుల్ ICC T20 ప్రపంచ కప్ 2007లో 13 వికెట్లు పడగొట్టాడు. ఇండియాతో జరిగిన ఫైనల్లోనూ గుల్ మూడు వికెట్లతో రాణించాడు. అయితే పాకిస్థాన్ మాత్రం ఓడిపోయింది. 2009: ఉమర్ గుల్ ICC T20 వరల్డ్ కప్ 2009లోనూ ఉమర్ గుల్ 13 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా వరుసగా రెండోసారి నిలిచాడు. అయితే, ఈసారి, ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి పాకిస్తాన్ T20 వరల్డ్ కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లోను శ్రీలంకను 8 వికెట్లతో పాక్ చిత్తు చేసింది. 2010: డిర్క్ నాన్స్ ICC T20 ప్రపంచ కప్ 2010లో ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ డిర్క్ నాన్స్ 14 వికెట్లతో టాప్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. ఆ టోర్నీలో బంగ్లాదేశ్ పై 18 పరుగులకే 4 వికెట్లు తీసుకున్నాడు. నాన్స్ కళ్లు చెదిరే బౌలింగ్ తో ఆస్ట్రేలియా ఫైనల్ చేరినా.. అక్కడ ఇంగ్లండ్ చేతుల్లో ఓటమి తప్పలేదు. 2012: అజంతా మెండిస్ శ్రీలంక ఆటగాడు అజంతా మెండిస్ 2012 టీ20 ప్రపంచకప్‌లో 15 వికెట్లు పడగొట్టాడు. జింబాబ్వేపై 8 పరుగులకు 6 వికెట్లు సాధించిన అతని అద్భుతమైన ప్రదర్శన టోర్నమెంట్‌కు నాంది పలికింది. వెస్టిండీస్‌తో జరిగిన ఫైనల్‌లో 12 పరుగులకే 4 వికెట్లు తీసినా.. శ్రీలంకకు ఓటమి తప్పలేదు. 2014: ఇమ్రాన్ తాహిర్, ఎహసాన్ మాలిక్ ICC T20 వరల్డ్ కప్ 2014లో దక్షిణాఫ్రికాకు చెందిన ఇమ్రాన్ తాహిర్, నెదర్లాండ్స్‌కు చెందిన ఎహసాన్ మాలిక్ 12 వికెట్లు తీశారు. ఈ ఇద్దరూ ఒకరి జట్టుపై మరొకరు రాణించారు. నెదర్లాండ్స్ పై తాహిర్ 4 వికెట్లు, సౌతాఫ్రికాపై మాలిక్ 5 వికెట్లు తీశాడు. 2016: మహ్మద్ నబీ ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు మహ్మద్ నబీ T20 ప్రపంచ కప్ 2016లో 12 వికెట్లతో టాప్ లో నిలిచాడు. అయినా ఆఫ్ఘనిస్థాన్ మాత్రం లీగ్ దశ దాటలేకపోయింది. 2021: వానిందు హసరంగా శ్రీలంక ఆటగాడు వానిందు హసరంగ 2021 టీ20 ప్రపంచకప్‌లో 16 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అయితే ఆ టీమ్ మాత్రం గ్రూప్ స్టేజ్ కూడా దాటలేకపోయింది. 2022: వానిందు హసరంగా 2022లో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనూ శ్రీలంక లెగ్‌స్పిన్నర్ వానిందు హసరంగానే టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఈసారి అతడు 15 వికెట్లు తీయడం విశేషం. అయినా లంక మాత్రం కప్పు గెలవలేకపోయింది."
Player | T | W | Avg | Ovr | R | BBF | EC | SR | 3w | 5w | Mdns |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1Fazalhaq Farooqi | 17 | 9 | 25 | 160 | 5/9 | 6 | 8 | 3 | 1 | 0 | |
2Arshdeep Singh | 17 | 12 | 30 | 215 | 4/9 | 7 | 10 | 3 | 0 | 0 | |
3Jasprit Bumrah | 15 | 8 | 29 | 124 | 3/7 | 4 | 11 | 2 | 0 | 2 | |
4Anrich Nortje | 15 | 13 | 35 | 201 | 4/7 | 5 | 14 | 1 | 0 | 0 | |
5Rashid Khan | 14 | 12 | 29 | 179 | 4/17 | 6 | 12 | 3 | 0 | 0 | |
6Rishad Hossain | 14 | 13 | 25 | 194 | 3/22 | 7 | 10 | 3 | 0 | 0 | |
7Naveen-ul-Haq | 13 | 12 | 26 | 160 | 4/26 | 6 | 12 | 2 | 0 | 0 | |
8Kagiso Rabada | 13 | 15 | 31 | 195 | 3/18 | 6 | 14 | 1 | 0 | 2 | |
9Adam Zampa | 13 | 14 | 28 | 187 | 4/12 | 6 | 12 | 1 | 0 | 0 | |
10Alzarri Joseph | 13 | 13 | 24 | 177 | 4/19 | 7 | 11 | 1 | 0 | 0 |
Standings are updated with the completion of each game
- T:Teams
- Wkts:Wickets
- Avg:Average
- R:Run
- EC:Economy
- O:Overs
- SR:Strike Rate
- BBF:Best Bowling Figures
- Mdns:Maidens
టీ20 వరల్డ్ కప్ తరచూ అడిగే ప్రశ్నలు
A. శ్రీలంకకు చెందిన వానిందు హసరంగ 16 వికెట్లు పడగొట్టాడు. 2021 వరల్డ్ కప్ లో ఈ ఘనత సాధించాడు.
A. టీ20 ప్రపంచకప్ చరిత్రలో షకీబ్ అల్ హసన్ అత్యధిక వికెట్లు (47) తీసుకున్నాడు.
A. రవిచంద్రన్ అశ్విన్ టీ20 ప్రపంచకప్‌లలో అత్యధికంగా 32 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్.
A. 2022 టీ20 ప్రపంచకప్‌లో హసరంగా 15 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.