టీ20 వరల్డ్ కప్ 2024 మోస్ట్ రన్స్
"ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2007లో ప్రారంభమైంది. అప్పటి నుండి టోర్నమెంట్ ఆరు ఎడిషన్‌లు జరిగాయి. T20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌లలో ఇండియాకు చెందిన విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు కోహ్లి 27 మ్యాచ్‌లలో 81.50 సగటుతో 1141 పరుగులు చేశాడు. ఇందులో 130 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 14 అర్ధసెంచరీలు కూడా ఉన్నాయి. టోర్నమెంట్‌లో అతని అత్యధిక స్కోరు 89 నాటౌట్. టీ20 ప్రపంచకప్‌లో ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా భారత మాజీ కెప్టెన్ రికార్డు సృష్టించాడు. 2014 ఎడిషన్ టోర్నమెంట్‌లో అతను ఆరు మ్యాచ్‌లలో 319 పరుగులు చేశాడు. అందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. T20 ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగుల జాబితాలో మహేల జయవర్ధనే రెండో స్థానంలో నిలిచాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ 31 మ్యాచ్‌లలో 39.07 సగటు, 134.74 స్ట్రైక్ రేట్‌తో 1,016 పరుగులు చేశాడు. అతడు వెస్టిండీస్‌లో ఆడిన 2010 T20 ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా ఉన్నాడు. అక్కడ జయవర్దనె ఆరు మ్యాచ్‌లలో 60.40 సగటు, 159.78 స్ట్రైక్ రేట్‌తో 302 పరుగులు చేశాడు. అదే ఎడిషన్‌లో, టీ20 ప్రపంచకప్‌లో శతకం బాదిన తొలి శ్రీలంక ఆటగాడిగా జయవర్ధనే నిలిచాడు. జాబితాలో వెస్టిండీస్‌కు చెందిన ఓపెనర్ క్రిస్ గేల్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. గేల్ 33 మ్యాచ్‌లలో 965 పరుగులు చేశాడు. టీ20 వరల్డ్ కప్ ఒక్క ఎడిషన్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు ఎవరో ఇక్కడ చూడండి. 2007: మాథ్యూ హేడెన్ దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి ICC T20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ మాథ్యూ హేడెన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హేడెన్ ఆరు మ్యాచ్‌లలో 88.33 సగటు, 144.80 స్ట్రైక్ రేట్‌తో 265 పరుగులు సాధించాడు. హేడెన్ దూకుడుతో ఆస్ట్రేలియా సెమీస్ చేరినా.. అక్కడ ఇండియా చేతుల్లో ఓటమి తప్పలేదు. 2009: తిలకరత్నే దిల్షాన్ తిలకరత్నే దిల్షాన్ ఇంగ్లండ్‌లో జరిగిన 2009 ICC T20 ప్రపంచ కప్‌లో తన బ్యాటింగ్ సత్తా చాటాడు. టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. శ్రీలంక తరఫున దిల్షాన్ ఏడు మ్యాచ్‌లలో 52.83 సగటు, 144.74 స్ట్రైక్ రేట్‌తో 317 పరుగులు చేశాడు. లార్డ్స్‌లో జరిగిన ఫైనల్లో పాకిస్థాన్ చేతుల్లో శ్రీలంక ఓడినా.. అంత వరకూ వెళ్లింది కూడా దిల్షాన్ వల్లే అనడంలో సందేహం లేదు. 2012: షేన్ వాట్సన్ షేన్ వాట్సన్ ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్. శ్రీలంకలో జరిగిన 2012 ICC T20 ప్రపంచ కప్‌లో తన అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో ఆధిపత్యం చెలాయించాడు. వాట్సన్ ఆరు పరుగుల తేడాతో మహేల జయవర్ధనేని అధిగమించి టోర్నమెంట్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. ఆరు మ్యాచ్‌లలో 150 స్ట్రైక్ రేట్, 49.80 సగటుతో 249 పరుగులు చేసిన వాట్సన్.. ఆస్ట్రేలియా సెమీఫైనల్స్ వెళ్లడంలో కీలకపాత్ర పోషించాడు. 2014: విరాట్ కోహ్లీ 2014లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ చెరగని ముద్ర వేశాడు. కోహ్లీ ఆరు మ్యాచ్‌లలో 106.33 సగటు, 129.14 స్ట్రైక్ రేట్‌తో 319 పరుగులు చేశాడు. నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే ఫైనల్‌లో శ్రీలంక చేతిలో భారత్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. 2016: తమీమ్ ఇక్బాల్ బంగ్లాదేశ్ డైనమిక్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ఇండియాలో జరిగిన 2016 ICC T20 ప్రపంచ కప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తమీమ్ ఆరు మ్యాచ్‌లలో 73.75 సగటు, 142.51 స్ట్రైకింగ్ రేట్‌తో 295 పరుగులు చేశాడు. అయితే బంగ్లాదేశ్ టోర్నమెంట్ సూపర్ 10 దశను దాటి ముందుకు వెళ్లలేకపోయింది. 2021: బాబర్ ఆజం యూఏఈ, ఒమన్‌లలో జరిగిన 2021 ICC T20 ప్రపంచ కప్‌లో, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అతడు ఆరు మ్యాచ్‌లలో 60.60 సగటు, 126.25 స్ట్రైక్ రేట్‌తో 303 పరుగులు చేశాడు. నాలుగు అర్ధ సెంచరీలు కూడా చేయడం విశేషం. 2022: విరాట్ కోహ్లీ భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ICC T20 ప్రపంచ కప్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. 2022 ఎడిషన్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కోహ్లి ఆరు గేమ్‌లలో 98.66 సగటు, 136.40 స్ట్రైక్ రేట్‌తో 296 పరుగులు చేశాడు. నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి."
Player | T | R | SR | Mat | Inn | NO | HS | Avg | 30s | 50s | 100s | 6s |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1Rahmanullah Gurbaz | 281 | 124 | 8 | 8 | 0 | 80 | 35 | 1 | 3 | 0 | 16 | |
2Rohit Sharma | 257 | 156 | 8 | 8 | 1 | 92 | 36 | 0 | 3 | 0 | 15 | |
3Travis Head | 255 | 158 | 7 | 7 | 1 | 76 | 42 | 3 | 2 | 0 | 15 | |
4Quinton de Kock | 243 | 140 | 9 | 9 | 0 | 74 | 27 | 1 | 2 | 0 | 13 | |
5Ibrahim Zadran | 231 | 107 | 8 | 8 | 0 | 70 | 28 | 2 | 2 | 0 | 4 | |
6Nicholas Pooran | 228 | 146 | 7 | 7 | 1 | 98 | 38 | 1 | 1 | 0 | 17 | |
7Andries Gous | 219 | 151 | 6 | 6 | 1 | 80* | 43 | 1 | 2 | 0 | 11 | |
8Jos Buttler | 214 | 158 | 8 | 7 | 2 | 83* | 42 | 1 | 1 | 0 | 10 | |
9Suryakumar Yadav | 199 | 135 | 8 | 8 | 1 | 53 | 28 | 2 | 2 | 0 | 10 | |
10Heinrich Klaasen | 190 | 126 | 9 | 8 | 2 | 52 | 31 | 2 | 1 | 0 | 13 |
Standings are updated with the completion of each game
- T:Teams
- Wkts:Wickets
- Avg:Average
- R:Run
- EC:Economy
- O:Overs
- SR:Strike Rate
- BBF:Best Bowling Figures
- Mdns:Maidens
టీ20 వరల్డ్ కప్ తరచూ అడిగే ప్రశ్నలు
A. విరాట్ కోహ్లి 1141 పరుగులు చేశాడు. టీ20 ప్రపంచకప్‌లలో అత్యధిక పరుగుల వీరుడు అతడే.
A. బ్రెండన్ మెకల్లమ్ చేసిన 123 పరుగులే టీ20 ప్రపంచకప్‌లో ఓ బ్యాట్స్‌మెన్ చేసిన అత్యధిక స్కోరు.
A. టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా సురేష్ రైనా నిలిచాడు.
A. టీ20 ప్రపంచకప్‌లో ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు.