T20 World Cup Schedule - టీ20 వరల్డ్ కప్ 2024 షెడ్యూలు, Team, Player List, Venue, Time Table | T20 World Cup Schedule on HT Telugu
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  టీ20 వరల్డ్ కప్  /  టీ20 వరల్డ్ కప్ 2024 షెడ్యూలు

టీ20 వరల్డ్ కప్ 2024 షెడ్యూలు

"ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ 2024 అమెరికా, వెస్టిండీస్ లలో జూన్ 1 నుంచి జూన్ 29 వరకు జరగనుంది. మొత్తం 20 టీమ్స్ ఈ మెగా టోర్నీలో పాల్గొంటున్నాయి. ఈ ఏడాది జనవరిలోనే టీ20 వరల్డ్ కప్ 2024 షెడ్యూల్ అనౌన్స్ చేశారు. మొత్తంగా ఈసారి అమెరికా, వెస్టిండీస్ లలోని 9 స్టేడియాల్లో టోర్నీ జరగనుంది. అమెరికాలోని మూడు, వెస్టిండీస్ లోని ఆరు స్టేడియాలు ఆతిథ్యమిస్తున్నాయి. ఫైనల్ మ్యాచ్ జూన్ 29న బార్బడోస్ లో జరుగుతుంది. ఇండియా తన తొలి మ్యాచ్ ను జూన్ 5న ఐర్లాండ్ తో తలపడనుండగా.. జూన్ 9న పాకిస్థాన్ తో ఆడాల్సి ఉంది. లీగ్ స్టేజ్ లో ఇండియా తన మూడు మ్యాచ్ లను న్యూయార్క్ లో, ఒక మ్యాచ్ ను లాండర్‌హిల్లో ఆడనుంది. జూన్ 1 నుంచి జూన్ 29 వరకు మొత్తంగా ఈ మెగా టోర్నీలో భాగంగా 55 మ్యాచ్ లు జరుగుతాయి. టీ20 వరల్డ్ కప్2024 గ్రూప్స్, ఫార్మాట్ టీ20 వరల్డ్ కప్ 2024లో మొత్తం 20 టీమ్స్ పాల్గొంటున్నాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో ఐదు టీమ్స్ ఉంటాయి. గ్రూప్ ఎ - ఇండియా, పాకిస్థాన్, కెనడా, ఐర్లాండ్, యూఎస్ఏ గ్రూప్ బి - ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్ గ్రూప్ సి - న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్, పపువా న్యూ గినియా, ఉగాండా గ్రూప్ డి - సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ ప్రతి గ్రూపులో ఒక్కో టీమ్ మిగిలిన అన్ని టీమ్స్ తో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అంటే గరిష్ఠంగా అన్ని మ్యాచ్ లు గెలిచిన జట్టుకు 8 పాయింట్లు వస్తాయి. ఒక్కో గ్రూపు నుంచి రెండు టీమ్స్ సూపర్ 8 స్టేజ్ కు వెళ్తాయి. సూపర్ 8లో రెండు గ్రూపులుగా విడిపోయి తలపడతాయి. అందులో ఒక్కో గ్రూపు నుంచి రెండేసి టీమ్స్ సెమీఫైనల్స్ కు వెళ్తాయి. వెస్టిండీస్, అమెరికా దేశాలు ఆతిథ్యమిస్తుండటంతో అవి రెండూ నేరుగా అర్హత సాధించాయి. ఇక టాప్ 8 ర్యాంకుల్లో ఉన్న ఇండియా, ఇంగ్లండ్, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్, శ్రీలంక కూడా నేరుగా క్వాలిఫై అయ్యాయి. ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ కూడా టోర్నీలోకి వచ్చాయి. యూరప్ నుంచి ఐర్లాండ్, స్కాట్లాండ్.. ఈస్ట్ ఏషియా-పసిఫిక్ నుంచి పపువా న్యూగినియా, అమెరికాస్ క్వాలిఫయర్ నుంచి కెనడా.. ఆషియా నుంచి నేపాల్, ఒమన్.. ఆఫ్రికా నుంచి నమీబియా, ఉగాండా అర్హత సాధించాయి. టీ20 వరల్డ్ కప్ 2024 వేదికలు టీ20 వరల్డ్ కప్ 2024 వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్ లోని మొత్తం 9 స్టేడియాల్లో జరుగుతాయి. అందులో ఆరు వెస్టిండీస్ లో, మూడు అమెరికాలో ఉన్నాయి. వెస్టిండీస్ లో సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం, కెన్సింగ్టన్ ఓవల్, ప్రావిడెన్స్ స్టేడియం, డారెన్ సామి క్రికెట్ గ్రౌండ్, ఆర్నోస్ వేల్ స్టేడియం, బ్రియాన్ లారా క్రికెట్ అకాడెమీ స్టేడియాల్లో మ్యాచ్ లు జరుగుతాయి. ఇక అమెరికాలో సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్, నాసౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, గ్రాండ్ ప్రాయిరీ స్టేడియంలో మ్యాచ్ లు ఉంటాయి. ఫైనల్ మ్యాచ్ జూన్ 29న బార్బడోస్ లోని కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియంలో జరుగుతుంది. టీ20 వరల్డ్ కప్ 2024 కోసం ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్లుగా టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్, ఒలింపిక్ ఛాంపియన్ ఉసేన్ బోల్ట్ లను నియమించింది. టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా షెడ్యూల్ ఇదీ ఈ మెగా టోర్నీలో గ్రూప్ ఎలో భాగంగా లీగ్ స్టేజ్ లో టీమిండియా ఆడబోయే మ్యాచ్ ల వివరాలు, భారత కాలమానం ప్రకారం మ్యాచ్ జరిగే సమయాలు ఇక్కడ చూడొచ్చు. ఇండియా వెర్సెస్ ఐర్లాండ్ - జూన్ 5 రాత్రి 8 గంటలకు.. ( న్యూయార్క్) ఇండియా వెర్సెస్ పాకిస్థాన్ - జూన్ 9 రాత్రి 8 గంటలకు (న్యూయార్క్) ఇండియా వెర్సెస్ యూఎస్ఏ - జూన్ 12 రాత్రి 8 గంటలకు (న్యూయార్క్) ఇండియా వెర్సెస్ కెనడా - జూన్ 15 రాత్రి 8 గంటలకు (లాండర్‌హిల్)"

Teams
Canada
USA
Papua New Guinea
West Indies
Oman
Namibia
Sri Lanka
South Africa
Afghanistan
Uganda
Scotland
England
Nepal
Netherlands
Ireland
India
Australia
Pakistan
New Zealand
Bangladesh
Venues
Grand Prairie Cricket Stadium, Dallas
Guyana National Stadium, Guyana
Kensington Oval, Bridgetown, Barbados
Nassau County International Cricket Stadium, New York
Sir Vivian Richards Stadium, North Sound, Antigua
Central Broward Park & Broward County Stadium, Lauderhill, Florida
Brian Lara Cricket Academy, Tarouba
Arnos Vale Ground, Arnos Vale, St Vincent
Daren Sammy National Cricket Stadium, Gros Islet, St Lucia
ABANDONEDMatch 23, Florida, June 11, 2024
SL
NEP
Match Abandoned without toss
ABANDONEDMatch 30, Florida, June 14, 2024
USA
IRE
Match Abandoned without toss
ABANDONEDMatch 33, Florida, June 15, 2024
IND
CAN
Match Abandoned without toss

టీ20 వరల్డ్ కప్ తరచూ అడిగే ప్రశ్నలు

Q. T20 ప్రపంచ కప్ 2024 ఎక్కడ జరుగుతుంది?

A. జూన్ 1-29 వరకు USA, వెస్టిండీస్ T20 ప్రపంచ కప్ 2024కి ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

Q. T20 ప్రపంచ కప్ 2024 ఏ ఫార్మాట్‌ లో జరుగుతుంది?

A. T20 వరల్డ్ కప్ జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు జట్లు సూపర్ 8 దశకు చేరుకుంటాయి. వాటిని రెండేసి గ్రూపులుగా విభజిస్తారు. రెండు గ్రూపుల నుంచి టాప్ 2 టీమ్స్ సెమీఫైనల్స్ కు వెళ్తాయి.

Q. T20 వరల్డ్ కప్ 2024లో సూపర్ 8 కాన్సెప్ట్‌ ఏంటి?

A. లీగ్ స్టేజ్ లో నాలుగు గ్రూపుల నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 8 దశకు చేరుకుంటాయి. వాటిని రెండేసి గ్రూపులుగా విభజిస్తారు. రెండు గ్రూపుల నుంచి టాప్ 2 టీమ్స్ సెమీఫైనల్స్ కు వెళ్తాయి.

Q. T20 ప్రపంచ కప్ 2024 కోసం ఎన్ని మ్యాచ్‌లు ఆడనున్నారు?

A. 2024 టీ20 ప్రపంచకప్‌లో 55 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

Q. T20 వరల్డ్ కప్ 2024 షెడ్యూల్ కోసం అధికారిక వెబ్ సైట్ ఏది?

A. T20 ప్రపంచ కప్ 2024 షెడ్యూల్ ICC వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. మీరు హిందుస్థాన్ టైమ్స్ తెలుగు వెబ్ సైట్ లో టీ20 వరల్డ్ కప్ ప్రత్యేక పేజీలోనూ ఈ సమాచారం చూడొచ్చు.