(1 / 5)
మహిళల టీ20 ప్రపంచకప్‍లో కీలకమైన పోరుకు భారత జట్టు రెడీ అయింది. పాకిస్థాన్‍తో హైవోల్టేజ్ సమరానికి సంసిద్ధమైంది. దుబాయి వేదికగా రేపు (అక్టోబర్ 6) మెగాటోర్నీలో టీమిండియా, పాక్ మధ్య గ్రూప్-ఏ మ్యాచ్ జరగనుంది.
(BCCI Women-X)(2 / 5)
ప్రపంచకప్‍లో తొలి మ్యాచ్‍లో న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడింది హర్మన్‍ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్. దీంతో సెమీస్ ఆశలు నిలువాలంటే పాకిస్థాన్‍తో రేపు మ్యాచ్ తప్పక గెలువాలి. దీంతో ఈ మ్యాచ్ మరింత ఆసక్తికరంగా ఉంది. తొలి మ్యాచ్‍లో లంకపై గెలిచి జోష్‍లో ఉంది పాక్.
(AP)(3 / 5)
ఈ టీ20 ప్రపంచకప్‍లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ రేపు (అక్టోబర్ 6) మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు మొదలవుతుంది. అందుకు గంట ముందే టాస్ ఉంటుంది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ సాగనుంది.
(AP)(4 / 5)
టీ20 వరల్డ్ కప్ మెగాటోర్నీలో టీమిండియా, పాకిస్థాన్ మధ్య ఈ మ్యాచ్‍ను స్టార్ స్పోర్ట్స్ నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ చూడొచ్చు. డిజిటల్ విషయానికి వస్తే డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ వీక్షించొచ్చు.
(AP)ఇతర గ్యాలరీలు