TG Weather Updates : తెలంగాణలో వర్షాలు - హైదరాబాద్ లో మారిన వాతావరణం, ఈదురుగాలులతో కూడిన భారీ వర్ష సూచన!-ap and telangana is likely to receive heavy rain for 2 days imd latest weather updates ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Tg Weather Updates : తెలంగాణలో వర్షాలు - హైదరాబాద్ లో మారిన వాతావరణం, ఈదురుగాలులతో కూడిన భారీ వర్ష సూచన!

TG Weather Updates : తెలంగాణలో వర్షాలు - హైదరాబాద్ లో మారిన వాతావరణం, ఈదురుగాలులతో కూడిన భారీ వర్ష సూచన!

Jun 13, 2024, 03:12 PM IST Maheshwaram Mahendra Chary
Jun 13, 2024, 03:12 PM , IST

  • Telangana AP Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. రుతుపవనాల రాకతో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. రుతుపవనాల రాకతో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 

(1 / 6)

 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. రుతుపవనాల రాకతో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. (@APSDMA Twitter)

జూన్ 13వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ ఉదయం 08.30 గంటల వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

(2 / 6)

జూన్ 13వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ ఉదయం 08.30 గంటల వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

జూన్ 15 నుంచి జూన్ 19వ తేదీ వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని పేర్కొంది. 

(3 / 6)

జూన్ 15 నుంచి జూన్ 19వ తేదీ వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని పేర్కొంది. 

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గురువారం పలు జిల్లాల్లో వర్షాలు కురువనున్నాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

(4 / 6)

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గురువారం పలు జిల్లాల్లో వర్షాలు కురువనున్నాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.(photo source unshplash.com)

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మరో రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. గురువారం(జూన్ 13) విజయనగరం, మన్యం, అల్లూరి, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది.

(5 / 6)

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మరో రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. గురువారం(జూన్ 13) విజయనగరం, మన్యం, అల్లూరి, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది.(photo source unshplash.com)

శుక్రవారం(జూన్ 14) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.

(6 / 6)

శుక్రవారం(జూన్ 14) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.(@APSDMA Twitter)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు