Satya Nadella: ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ అనే పదమే సత్య నాదెళ్లకు నచ్చదట: ఏమని పిలవాలో కూడా ఆయనే చెప్పారు..
Satya Nadella: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదమే నచ్చదట. అది సరైన అర్థం ఇవ్వడం లేదని సత్య నాదెళ్ల ఇటీవల వ్యాఖ్యానించారు. అది ఒక టూల్ మాత్రమే అని వివరించారు. ఆ టూల్ ను ‘ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్’ అని కాకుండా ‘డిఫరెంట్ ఇంటలిజెన్స్’ అని పిలవాలని సూచించారు.
కృత్రిమ మేధ (Artificial Intelligence) అనే పదం తనకు అంతగా నచ్చదని, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. యంత్రాలకు మానవ లక్షణాలను ఆపాదించే పద్ధతి సరి కాదన్నారు. అది ఒక టూల్ మాత్రమేనని, దాన్ని‘డిఫరెంట్ ఇంటలిజెన్స్ (different intelligence)’ అంటే బావుంటుందని వ్యాఖ్యానించారు.
1950 నుంచి..
1950వ దశకంలో "కృత్రిమ మేధస్సు (Artificial Intelligence)" అనే పదాన్ని సృష్టించారు. ఈ పేరుపై ఇటీవల మైక్రో సాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తన అయిష్టతను వ్యక్తం చేశారు. ‘‘అత్యంత దురదృష్టకరమైన పేర్లలో ఒకటి 'కృత్రిమ మేధస్సు' అని నేను అనుకుంటున్నాను. మనం దానిని 'డిఫరెంట్ ఇంటెలిజెన్స్' అని పిలిస్తే బాగుండేది. ఎందుకంటే మనుషులకు ఇంటలిజెన్స్ ఉంటుంది. వారికి కృత్రిమ మేధస్సు అవసరం లేదు’’ అని వివరించారు.
భవిష్యత్తులో ఏఐ మరింత వృద్ధి చెందుతుంది
కృత్రిమ మేధను మానవ పరిభాషలో వర్ణించే సహజ ధోరణిని సత్య నాదెళ్ల అంగీకరించారు. సాఫ్ట్వేర్ పనితీరును వివరించడానికి "లెర్నింగ్" వంటి సాపేక్ష పదాలను ఉపయోగించి సాఫ్ట్వేర్ వెనుక ఉన్న సంక్లిష్ట అల్గారిథమ్ లను ను అర్థం చేసుకోవడానికి ప్రజలు వివిధ మార్గాలను అన్వేషిస్తారని ఆయన చెప్పారు. రియల్ టైమ్ సంభాషణ సామర్థ్యం కలిగిన అధునాతన ఏఐని కంపెనీలు విడుదల చేయడంతో భవిష్యత్తులో ఏఐ (AI) మరింత బలపడే అవకాశం ఉందన్నారు.
మానవ మేధస్సుతో సమానం కాదు
ఏఐ సాఫ్ట్ వేర్ ప్రదర్శించే సామర్థ్యాలు మానవ మేధస్సుతో సమానం కాదని సత్య నాదెళ్ల అన్నారు. ‘‘ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (Artificial Intelligence) అనేది అది ఒక సాధనం లేదా టూల్ మాత్రమే. దానికి కూడా తెలివితేటలు ఉన్నాయి. అయితే, అవి మానవ మేథస్సుకు సరిసమానమైనవి కాదు. అవి మానవుడు వాటికి అందించిన పరిమితమైన తెలివితేటలు మాత్రమే’’ అని సత్య నాదెళ్ల అన్నారు.