Microsoft new web app store: కొత్తగా వెబ్ యాప్ స్టోర్ ను ప్రారంభించిన మైక్రో సాఫ్ట్; యూజర్లకు ఇక మరింత సులువుగా..-microsoft launches web app store for windows finding apps and games made easier ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Microsoft New Web App Store: కొత్తగా వెబ్ యాప్ స్టోర్ ను ప్రారంభించిన మైక్రో సాఫ్ట్; యూజర్లకు ఇక మరింత సులువుగా..

Microsoft new web app store: కొత్తగా వెబ్ యాప్ స్టోర్ ను ప్రారంభించిన మైక్రో సాఫ్ట్; యూజర్లకు ఇక మరింత సులువుగా..

HT Telugu Desk HT Telugu
Oct 07, 2023 02:49 PM IST

Microsoft new web app store: మైక్రోసాఫ్ట్ మరో కొత్త యాప్ స్టోర్ (web app store) ను ప్రారంభించింది. విండోస్ (Windows) యూజర్ల కోసం ఈ వెబ్ యాప్ స్టోర్ ను ప్రత్యేకంగా మైక్రోసాఫ్ట్ రూపొందించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Microsoft)

Microsoft new web app store: విండోస్ యూజర్లకు మరింత సులువైన యాప్ సెర్చ్ సదుపాయాలను కల్పించే ఉద్దేశంతో మైక్రో సాఫ్ట్ (Microsoft) సరికొత్త వెబ్ యాప్ స్టోర్ ను ప్రారంభించింది. విండోస్ యాప్స్ ను, ఎక్స్ బాక్స్ పీసీ గేమ్స్ ను వెతకడానికి గతంలో వాడిన కోడ్ బేస్ యాప్ స్టోర్ స్థానంలో ఈ కొత్త వెబ్ యాప్ స్టోర్ వచ్చింది. దీనితో విండోస యాప్స్ ను సెర్చ్ చేయడం మరింత సులువవుతుంది.

టీమ్స్ అప్ డేట్

ఇటీవల విండోస్ కోసం, మ్యాక్ కోసం టీమ్స్ (Teams) యాప్ ను మైక్రోసాఫ్ట్ మరింత మెరుగుపరిచింది. ఇప్పుడు తాజాగా కొత్త వెబ్ యాప్ స్టోర్ ను ప్రారంభించింది. ఈ యాప్ స్టోర్ గతంలో అందుబాటులో ఉన్న విండోస్ యాప్ స్టోర్ లో స్వల్ప మార్పులు చేసి రూపొందించిన స్టోర్ కాదు. దీన్ని పూర్తిగా మూలాల నుంచి రీ డిజైన్ చేసి, కొత్త యూజర్ ఇంటర్ ఫేస్ (UI) తో యూజర్ ఫ్రెండ్లీగా రూపొందించారు. దీని ద్వారా విండోస్, ఎక్స్ బాక్స్ పీసీ గేమ్స్ లకు సంబంధించిన యాప్స్ ను వెతకడం, వివరాలు తెలుసుకోవడం, డౌన్ లోడ్ చేసుకోవడం మరింత సులువు అవుతుంది.

కోడ్ బేస్ రీప్లేస్ మెంట్

ఈ సరికొత్త వెబ్ యాప్ స్టోర్ కు పాత యాప్ స్టోర్ కు ఎలాంటి పోలికలు లేవని మైక్రోసాఫ్ట్ చెబుతోంది. గత యాప్ స్టోర్ కు సంబంధించిన కోడ్ బేస్ ను పూర్తిగా రీప్లేస్ చేసి, కొత్త యూఐ తో అత్యాధునిక వెబ్ యాప్ స్టోర్ ను రూపొందించామని వెల్లడించింది. ఈ యాప్ స్టోర్ లో యాప్స్ ను వెతకడం, ఆయా యాప్స్ వివరాలు తెలుసుకోవడం చాలా ఈజీ అని వెల్లడించింది. డ్రాప్ డౌన్ మెన్యూతో సెర్చ్ ఫంక్షనాలిటీని మెరుగుపర్చామని తెలిపింది.

Whats_app_banner