AUS vs NAM: 5 ఓవర్లలో టార్గెట్ ఖతం చేసిన ఆస్ట్రేలియా - నమీబియాపై విజయంతో సూపర్ 8లోకి ఎంట్రీ
AUS vs NAM:టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా సూపర్ 8 బెర్తును ఖాయం చేసుకున్నది. బుధవారం నమీబియాపై రికార్డ్ విక్టరీని అందుకున్నది. నమీబియా విధించిన టార్గెట్‌ను కేవలం 5.4 ఓవర్లలోనే ఆస్ట్రేలియా ఛేదించింది.
AUS vs NAM: టీ20 వరల్డ్ కప్‌లో బౌలర్లదే అధిపత్యం కొనసాగుతోంది. 150 పరుగుల దాటడానికి కూడా అగ్ర జట్లు శ్రమిస్తోన్నాయి. మరోవైపు ఆస్ట్రేలియా మాత్రం వరల్డ్ కప్‌లో పరుగుల వదర పారిస్తోంది. ఇంగ్లండ్‌పై 200 పరుగుల స్కోరు చేసి అద్భుత విజయాన్ని అందుకున్న ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్‌లో మరో రికార్డ్ నెలకొల్పింది. బుధవారం నమీబియాపై కేవలం 5.4 ఓవర్లలోనే విజయాన్ని అందుకున్నది. మరో 14.2 ఓవర్లు (86 బాల్స్) మిగిలుండగానే ప్రత్యర్థిని చిత్తు చేసింది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
72 రన్స్‌కు ఆలౌట్...
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 17 ఓవర్లలో 72 పరుగులు ఆలౌటైంది. కెప్టెన్ హెరాస్మస్ ఒక్కడే 36 పరుగులు చేయగా...మిగిలిన పదిమంది బ్యాట్స్‌మెన్స్ కలిసి 36 రన్స్ చేశాడు. ఆసీస్ బౌలర్లను ఎదుర్కొంటూ హెరాస్మస్ 43 బాల్స్‌లో నాలుగు ఫోర్లు ఓ సిక్సర్‌తో 36 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు.
ఓపెనర్ లింగెన్ 10 పరుగులతో సెకండ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వీరిద్దరు మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ మొత్తం సింగిల్ డిజిట్ స్కోరుకే ఔటయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా నాలుగు ఓవర్లు వేసి 12 రన్స్ ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. హెజిల్ వుడ్, స్టోయినస్ తలో రెండు వికెట్లతో నమీబియాను దెబ్బకొట్టారు.
ట్రావిస్ హెడ్, వార్నర్ జోరు...
నమీబియా విధించిన సింపుల్ టార్గెట్‌ను ఆస్ట్రేలియా 5.4 ఓవర్లలోనే ఛేదించింది. డేవిడ్ వార్నర్ 8 బాల్స్‌లో మూడు ఫోర్లు ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్, మార్ష్ కలిసి ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించారు. ట్రావిస్ హెడ్ 17 బాల్స్‌లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 34 రన్స్ చేయగా...మార్ష్ 9 బాల్స్‌లో మూడు ఫోర్లు ఓ సిక్సర్‌తో 18 రన్స్ చేశాడు. వీరిద్దరి మెరుపులతో తొమ్మిది వికెట్ల తేడాతో నమీబియాపై ఆస్ట్రేలియా గెలిచింది.
86 బాల్స్ మిగిలుండగానే...
ఈ మ్యాచ్‌లో మరో 86 బాల్స్ మిగిలుండగానే నమీబియాపై ఆస్ట్రేలియా విక్టరీని నమోదు చేసింది. వరల్డ్ కప్‌లో అత్యధిక బాల్స్ మిగిలుండగానే గెలిచిన సెకండ్ టీమ్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.
2014 వరల్డ్ కప్‌లో నెదర్లాండ్స్‌పై శ్రీలంక 90 బాల్స్ మిగిలుండగానే గెలిచింది. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 39 పరుగులకే ఆలౌటైంది. అంతే కాకుండా శ్రీలంక తర్వాత పవర్ ప్లే ముగిసేలోపు వరల్డ్ కప్‌లో విజయాన్ని అందుకున్న సెకండ్ టీమ్‌గా ఆస్ట్రేలియా రికార్డ్ నెలకొల్పింది.
వంద వికెట్లు...
ఆ మ్యాచ్ ద్వారా అడమ్ జంపా టీ20ల్లో వంద వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. అంతే కాకుండా టీ20 వరల్డ్ కప్‌లో ఐదు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న ప్లేయర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. ఈ జాబితాలో ఏడు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తో కోహ్లి టాప్ ప్లేస్‌లో కొనసాగుతోన్నాడు.
సింగిల్ కోసం పదిహేడు బాల్స్...
ఈ మ్యాచ్‌లో నమీబియా కెప్టెన్ హెరాస్మస్ తొలి సింగిల్ తీయడానికి 17 బాల్స్ తీసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్‌లో సింగిల్స్ కోసం అత్యధిక బాల్స్ తీసుకున్న ప్లేయర్‌గా చెత్త రికార్డ్ నెలకొల్పాడు.