Harom Hara Tickets: హరోం హర సినిమా బంపర్ ఆఫర్: రెండు టికెట్లు కొంటే ఒకటి ఫ్రీ.. ఎలా పొందాలంటే..
Harom Hara Movie Tickets: హరోం హర సినిమా టికెట్ల విషయంలో మూవీ టీమ్ ఓ ఆఫర్ తీసుకొచ్చింది. రెండు టికెట్లు కొంటే ఒకటి ఉచితం అంటూ ప్రకటించింది. ఇందుకు ప్రోమో కోడ్ కూడా వెల్లడించింది.
Harom Hara Movie Tickets: యంగ్ హీరో సుధీర్ బాబు హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. గతేడాది హంట్, మామా మశ్ఛింద్ర చిత్రాలు ఆయనకు నిరాశనే మిగిల్చాయి. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇప్పుడు ‘హరోం హర’ సినిమాతో సుధీర్ బాబు వస్తున్నారు. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా మూవీ రేపే (జూన్ 14) థియేటర్లలో రిలీజ్ కానుంది. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో పాటు సుధీర్ ఈ చిత్రంపై చాలా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ తరుణంలో ‘హరోం హర’ మూవీ టీమ్ ఓ సూపర్ ఆఫర్ ప్రకటించింది.
ఆఫర్ ఎక్కడ.. ఎలా పొందాలంటే..
హరోం హర సినిమాకు రెండు టికెట్లు కొంటే ఒక టికెట్ ఫ్రీ అనే ఆఫర్ ఇచ్చింది మూవీ టీమ్. ఆన్‍లైన్ ప్లాట్‍ఫామ్ ‘బుక్ మై షో’లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. “HAROMHARA” అనే కోడ్‍ను అప్లై చేయడం ద్వారా బుక్ మై షోలో ఈ ఆఫర్ పొందవచ్చు. బుక్ మై షోలో మూడు టికెట్లను సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసే ముందు HAROMHARA కూపన్ కోడ్ అప్లై చేస్తే రెండు టికెట్ల ధరకే మూడు వస్తాయని మూవీ టీమ్ వెల్లడించింది.
హరోం హర చిత్రానికి జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన మాళవిక శర్మ హీరోయిన్‍గా నటించారు. సునీల్, జయప్రకాశ్, అక్షర, అర్జున గౌడ, లక్ష్మణ్ కీలకపాత్రలు పోషించారు.
హరోం హర రన్‍టైమ్ ఇవే
హరోం హర సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. హింస ఎక్కువగా ఉండడం వల్లే ఏ సర్టిఫికేట్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం 2 గంటల 34 నిమిషాల (154 నిమిషాలు) రన్‍టైమ్‍తో వస్తోంది.
హరోం హర సినిమా ఫుల్ యాక్షన్ డ్రామాగా వస్తోంది. ఈ మూవీలో గన్‍లు తయారు చేసి విక్రయించే సుబ్రహ్మణ్యం పాత్రలో సుధీర్ బాబు నటించారు. ట్రైలర్లో సుధీర్ యాక్షన్, సీమ యాసలో డైలాగ్ డెలివరీ ఆకట్టుకున్నాయి. ట్రైలర్ తర్వాత ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి.
హరోం హర చిత్రం తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని, భారీ హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నానని ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో సుధీర్ బాబు చెప్పారు. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదని, నమ్మకం అని తెలిపారు. ఇప్పటికే ఈ మూవీని కొందరికి చూపించామని, వారి ఫీడ్ బ్యాక్ వల్ల ఇంత నమ్మకంగా ఉన్నామని చెప్పారు. సుధీర్ బాబు బావ సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఈ మూవీకి సపోర్ట్ చేస్తున్నారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం ఓ ఆడియో ఇంట్రాక్షన్ చేశారు మహేశ్. హరోం హర ట్రైలర్ తనకు నచ్చిందని, పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నానని చెప్పారు.
రేపు (జూన్ 14) థియేటర్లలో విజయ్ సేతుపతి ‘మహారాజ’తో పాటు మ్యూజిక్ షాప్ మూర్తి, యేవమ్, ఇంద్రాణి సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి.